‘లవ్‌స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్‌ క్లారిటీ | Naga Chaitanya Love Story to release on April 16 | Sakshi
Sakshi News home page

‘లవ్‌స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్‌ క్లారిటీ

Published Tue, Mar 30 2021 6:31 AM | Last Updated on Tue, Mar 30 2021 9:02 AM

Naga Chaitanya Love Story to release on April 16 - Sakshi

నాగచైతన్య, సాయి పల్లవి

లవ్‌స్టోరీ’లో కన్‌ఫ్యూజన్‌ ఏం లేదంటున్నారు నాగచైతన్య. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. కె. నారాయణదాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్‌ 16న విడుదల చేయాలనుకున్నారు. అయితే ‘లవ్‌స్టోరీ’ ఏప్రిల్‌ 16న విడుదల కావడం లేదనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో మొదలైంది. ఈ విషయంపై చిత్రబృందంæస్పందించింది.

‘‘విడుదల విషయంలో ఎటువంటి కన్‌ఫ్యూజన్‌ లేదు. ముందు చెప్పినట్లుగానే ఏప్రిల్‌ 16న విడుదల చేస్తాం. మా ఈ అందమైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement