
సునీత, శేఖర్ కమ్ముల, తనికెళ్ల భరణి, భావన, ఆకాశ్, రాఘవేంద్రరావు, అనిల్
‘‘సర్కారు నౌకరి’ సినిమా ట్రైలర్ బాగుంది. ఈ మూవీ ద్వారా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. గాయని సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భావన హీరోయి¯Œ . ఆర్కే టెలీషోపై కె.రాఘవేంద్రరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలకానుంది.
ఈ మూవీ ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘వెంకటేశ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్‌లను హీరోలుగా పరిచయం చేశాను.. వారంతా ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. ‘సర్కారు నౌకరి’ తో పరిచయమవుతున్న ఆకాష్ కూడా వారిలా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఆకాష్ ΄ాడగలిగినా నటనపై ఎక్కువ ఆసక్తి ఉండటంతో హీరోగా పరిచయవుతున్నాడు’’ అన్నారు సునీత. ‘‘నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం’’ అన్నారు గంగనమోని శేఖర్. ‘‘నాకు తొలి అవకాశాన్ని ఇచ్చిన రాఘవేంద్రరావుగారికి ధన్యవాదాలు’’ అన్నారు ఆకాష్.
Comments
Please login to add a commentAdd a comment