కొబ్బరికాయ కొట్టారు | Asian Group announces Sekhar Kammula movie launch | Sakshi
Sakshi News home page

కొబ్బరికాయ కొట్టారు

Published Tue, Nov 13 2018 2:22 AM | Last Updated on Tue, Nov 13 2018 2:22 AM

Asian Group announces Sekhar Kammula movie launch - Sakshi

విజయ భాస్కర్, శేఖర్, సునీల్, రామ్మోహన్, భరత్, సదానంద్‌

‘ఫిదా’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా  సోమవారం మొదలైంది. అమిగోస్‌ క్రియేషన్స్‌ సమర్పణలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నారాయణ దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ (తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌) నిర్మాతలు. తన సినిమాల ద్వారా ఎంతో మంది హీరో, హీరోయిన్లు, నటీనటులను  పరిచయం చేసిన శేఖర్‌ కమ్ముల ఈ చిత్రంలో కూడా అందరూ కొత్తవాళ్లనే నటింపజేయనున్నారు.

రొమాంటిక్‌ మ్యూజికల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్టు, క్లాప్‌ బోర్డ్‌ పూజా కార్యక్రమాలు సికింద్రాబాద్‌లోని గణేష్‌ ఆలయంలో జరిగాయి. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ డిసెంబర్‌లో మొదలు కానుంది. ఈ సినిమా ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ‘ఏషియన్‌ గ్రూప్‌’ సునీల్‌ నారంగ్‌ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నిర్మాతలు సునీల్‌ నారంగ్, పి.రామ్మోహన్, కో ప్రొడ్యూసర్‌ విజయ్‌ భాస్కర్, భరత్‌ నారంగ్, సదానంద్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement