సాయి పల్లవి, విజయ్, శేఖర్ కమ్ముల, శేఖర్
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ స్టోరి’. ఆహ్లాదకరమైన ప్రేమకథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన పాటతో ఈ సినిమా పూర్తయింది.
షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టిన సందర్భంగా శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి. కుమార్ ఫొటోలు దిగారు. ‘‘రియలిస్టిక్ ప్రేమకథగా రూపొందిన చిత్రమిది. శేఖర్ కమ్ముల శైలిలో ఆహ్లాదకరంగా ఉంటుంది. పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశాం. థియేటర్లు తెరుచుకుని ప్రేక్షకుల సందడి మొదలు కాగానే ‘లవ్ స్టోరి’ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: పవన్ సి.హెచ్, సహ నిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వర రావు.
Comments
Please login to add a commentAdd a comment