చైతూ-సాయిపల్లవిల ‘లవ్‌ స్టోరి’ | Naga Chaitanya and Sai Pallavi New Telugu Movie Title Fix | Sakshi
Sakshi News home page

శేఖర్‌ కమ్ముల ‘లవ్‌ స్టోరి’

Published Tue, Jan 14 2020 6:21 PM | Last Updated on Tue, Jan 14 2020 6:30 PM

Naga Chaitanya and Sai Pallavi New Telugu Movie Title Fix - Sakshi

‘ఫిదా’సినిమాతో సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్న క్లాస్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ‘వెంకీ మామ’తో హిట్‌ అందుకున్న నాగచైతన్య, ‘ఫిదా’తో అందరి మనసులను దోచుకున్న సాయి పల్లవిలు ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.  ఇప్పటికే విడుదలై చేసిన నాగచైతన్య ఫస్ట్‌ లుక్‌కు విశేష స్పందన వస్తోంది. పక్కా శేఖర్‌ కమ్ముల స్టైల్‌లో రూపొందుకుంటున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌ భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. 

తాజాగా సంక్రాంతి కానుకగా శేఖర్‌ కమ్ముల టీం సినీ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ.. దానికి సంబంధించిన పోస్ట్‌ర్‌ను విడుదల చేసింది. అందరూ భావించినట్టే ఈ చిత్రానికి ‘లవ్‌ స్టోరి’అనే టైటిల్‌నే చిత్ర బృందం ఖరారు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పక్కా ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది.  
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement