Naga Chaitanya Emotional Tweet On Love Story Movie Anniversary Special, Deets Inside - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.. నాగచైతన్య ఎమోషనల్‌ ట్వీట్‌

Published Sat, Sep 24 2022 12:39 PM | Last Updated on Sat, Sep 24 2022 1:33 PM

Naga Chaitanya Emotional Tweet On Love Story Movie Anniversary - Sakshi

నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన  చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  విడుదలై నేటికి(సెప్టెంబర్‌ 24) ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ  నాగచైతన్య ఓ ట్వీట్‌ చేశాడు. ‘ఇలాంటి స్పెషల్‌ చిత్రాన్ని నాకు అందించిన చిత్ర యూనిట్‌కి, బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం నాకెన్నో విషయాలను నేర్పించింది. ‘లవ్‌స్టోరీ’ సినిమా జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’అని చైతన్య ట్వీట్‌ చేశాడు. 

(చదవండి: సలార్‌’ షురూ.. పుట్టెడు శోకంలోనూ షూటింగ్‌కి ప్రభాస్‌ హాజరు)

 కరోనా సెంకడ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి 2021లో బ్లాక్‌ బస్టర్‌ చిత్రంగా నిలిచింది. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్‌స్టోరి’ మూవీని రూపొందించారు. ఇందులో అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌గా  చైతూ, పెద్దింటి అమ్మాయి మౌనిక‌గా సాయి ప‌ల్ల‌వి అద్భుతంగా న‌టించి మెప్పించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement