
సాయి పల్లవి, శేఖర్ కమ్ముల, నాగచైతన్య
‘భానుమతి–హైబ్రిడ్ పిల్ల..’ అంటూ సాయి పల్లవితో తెలంగాణ యాస మాట్లాడించి, ఫిదా చేశారు శేఖర్ కమ్ముల. ఇప్పుడు నాగచైతన్యతో కూడా మాట్లాడించబోతున్నారు. చైతూతో తొలిసారి సినిమా చేయబోతున్నారు శేఖర్. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్ దాస్ కె. నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సోమవారం మొదలైంది. ఏషియన్ గ్రూప్స్ అధినేత సునీల్ నారంగ్ స్క్రిప్ట్‌ను శేఖర్ కమ్ములకు అందించగా, శేఖర్ తండ్రి శేషయ్య క్లాప్ ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్ సదానంద కెమెరా స్విచాన్ చేశారు.
‘‘మూడు షెడ్యూల్స్‌లో సినిమాని ప్లాన్ చేశాం. ఈ రోజు మొదలైన షెడ్యూల్ పది రోజులు జరుగుతుంది’’ అన్నారు పి. రామ్మోహన్ రావు. ‘‘పల్లెటూరి నుంచి సిటీకి వచ్చి జీవితంలో ఏదో సాధించాలనుకునే ఇద్దరి మధ్య జరిగే ప్రేమకథ ఇది. తెలంగాణ యాసని చైతూ బాగా ఇష్టపడి నేర్చుకున్నాడు. తన పాత్ర సినిమాకు హైలెట్. సాయిపల్లవి ఈ కథకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. నా సినిమాల్లో మ్యూజిక్ బలంగా ఉంటుంది. ఈ సినిమాలో మరింత బలంగా ఉంటుంది. రెహమాన్ స్కూల్ నుంచి వచ్చిన పవన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు’’ అని శేఖర్ కమ్ముల అన్నారు. భరత్ నారంగ్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పవన్, కెమెరా: విజయ్ సి. కుమార్.
Comments
Please login to add a commentAdd a comment