తొమ్మిది గంటలు... తొమ్మిది నేరాలు | Hawaa Telugu Motion Teaser | Sakshi
Sakshi News home page

తొమ్మిది గంటలు... తొమ్మిది నేరాలు

Oct 26 2018 1:03 AM | Updated on Aug 11 2019 12:52 PM

Hawaa Telugu Motion Teaser - Sakshi

శేఖర్‌ కమ్ముల, చైతన్య, మహేశ్‌

‘నైన్‌ బ్రెయిన్స్, నైన్‌ క్రైమ్స్, నైన్‌ అవర్స్‌.. ఇది సినిమా క్యాప్షన్‌. సినిమా పేరు ‘హవా’. ఆ తొమ్మిది మంది ఎవరు? వాళ్లు చేసిన నేరాలేంటి? తొమ్మిది గంటల్లో వారి జీవితాలు ఎలా మారాయి? అనే కాన్సెప్ట్‌తో తయారైన చిత్రం ‘హవా’. ఫిల్మ్‌ అండ్‌ రీల్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి మహేశ్‌ రెడ్డి దర్శకుడు. చైతన్య మాదాడి, దివి ప్రసన్న జంటగా నటించారు.

‘హవా’ లోగో అండ్‌ టీజర్‌ను హీరో రానా విడుదల చేశారు.  కాన్సెప్ట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించిన దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ– ‘‘సినిమా కాన్సెప్ట్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘క్రైమ్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాల్లో మా సినిమా ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement