విక్టరీ వెంకటేశ్ (Venkatesh), రానా దగ్గుబాటి (Rana Daggubati)నటించిన డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు. గతంలో విడుదలైన ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ వెబ్ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ విడుదలైంది.
ఈ సిరీస్‌కు ఆదరణ దక్కడంతో మేకర్స్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో రానా నాయుడు సీజన్-2 టీజర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. తాజాగా విడుదలైన అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్ మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.
Ab hogi todfod ki shuruvaat mamu, kyun ki ye Rana Naidu ka style hai 👊.
Watch Rana Naidu Season 2, out in 2025, only on Netflix #RanaNaiduS2#RanaNaiduS2OnNetflix #NextOnNetflixIndia pic.twitter.com/AKzezumPzN— Netflix India (@NetflixIndia) February 3, 2025
Comments
Please login to add a commentAdd a comment