దగ్గుబాటి వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ వెబ్ సిరీస్‌లో వెంకటేశ్ పూర్తి విభిన్న పాత్రలో కనిపించారు. అబ్బాయి రానాకు తండ్రిగా నటించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్‌పై ఫ్యాన్స్‌లో ఓ చర్చ నడుస్తోంది. ఈ సిరీస్‌లో నటించేందుకు వెంకటేశ్, రానా ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్న దానిపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
'రానా నాయుడు' వెబ్ సిరీస్‌లో నటించేందుకు వెంకటేశ్ దాదాపు రూ.12 తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రానా కూడా రూ.8 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. హిందీలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించారు. ఇందులో వెంకటేశ్ నాగ నాయుడు (తండ్రి), రానా.. రానా నాయుడు (కొడుకు) పాత్రలు పోషించారు. సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment