
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ చిత్రసీమకు చెందిన ప్రముఖ యువ దర్శకుడు దీపక్ ఆరస్ కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. డైరెక్టర్ ఆకస్మిక మరణం శాండల్‌వుడ్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. దర్శకుడి మరణవార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన చెల్లెలు, నటి అమూల్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ కుటుంబంలో తీవ్ర విషాదంలో ఉందని ఎమోషనలైంది.
కాగా.. దర్శకుడు దీపక్ ఆరస్ మనసాలజీ (2012), షుగర్ ఫ్యాక్టరీ (2023) లాంటి చిత్రాలతో ఫేమస్ అయ్యారు. అతని తొలిచిత్రం మనసాలజీతోనే విజయం అందుకున్నారు. 2023లో విడుదలైన షుగర్ ఫ్యాక్టరీ అనే కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో డార్లింగ్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. కాగా..ఇప్పటికే దీపక్ ఆరస్‌కు పెళ్లి కాగా.. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన చెల్లెలు అమూల్య కన్నడలో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది.