పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా? | Pavithra Gowda's Daughter Khushi Shares FIRST Post After Actress Arrest | Sakshi
Sakshi News home page

Pavithra Gowda: కన్నడ హీరో దర్శన్ కేసు.. పవిత్ర మొదటి భర్త ఎవరంటే?

Published Mon, Jun 17 2024 4:19 PM

Pavithra Gowda's Daughter Khushi Shares FIRST Post After Actress Arrest

ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ కేసు హాట్‌టాపిక్‌గా మారింది. ఓ అభిమాని హత్యకేసులో వీరిద్దరు ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. వీరిద్దరు గత పదేళ్లుగా సహజీవనంలో ఉన్నట్లు తెలిసింది. పవిత్ర గౌడకు ఓ అభిమాని అశ్లీల సందేశాలు పంపడంతోనే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. నటి పవిత్ర గౌడ గురించి నెటిజన్స్‌ ఆరా తీయడం మొదలెట్టారు. అసలు ఆమె ఎవరు? ఇంతకీ పవిత్రకు పెళ్లయిందా? దర్శన్‌తో రిలేషన్‌లో ఉందా? అని తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి పవిత్రకు ఇప్పటికే పెళ్లయినట్లు తెలుస్తోంది. ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా ఆమె కూతురు ఖుషిగౌడ చేసిన పోస్ట్ నెట్టింట వైరలైంది. 'నాకు అన్ని నువ్వే.. హ్యాపీ ఫాదర్స్‌ డే' అంటూ ఆమె కూతురు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.  దీంతో ఆమెకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. 

కాగా.. పవిత్ర 18  ఏళ్ల వయస్సులోనే సంజయ్ సింగ్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరి ఖుషీ అనే కూతురు ఉంది. ఆ తర్వాత సంజయ్‌ సింగ్‌తో పవిత్ర గౌడ విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పదేళ్లుగా దర్శన్‌తో రిలేషన్‌లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దర్శన్‌తో ఉన్న రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది. కాగా.. పవిత్ర కన్నడ సినీ పరిశ్రమలో 2013 కామెడీ చిత్రం చత్రిగలు సార్ చత్రిగలుతో అరంగేట్రం చేసింది. 2016లో తమిళ థ్రిల్లర్ మూవీ 54321లో నటించింది. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement