Deepak
-
హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. డైరెక్టర్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ చిత్రసీమకు చెందిన ప్రముఖ యువ దర్శకుడు దీపక్ ఆరస్ కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. డైరెక్టర్ ఆకస్మిక మరణం శాండల్‌వుడ్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. దర్శకుడి మరణవార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన చెల్లెలు, నటి అమూల్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమ కుటుంబంలో తీవ్ర విషాదంలో ఉందని ఎమోషనలైంది.కాగా.. దర్శకుడు దీపక్ ఆరస్ మనసాలజీ (2012), షుగర్ ఫ్యాక్టరీ (2023) లాంటి చిత్రాలతో ఫేమస్ అయ్యారు. అతని తొలిచిత్రం మనసాలజీతోనే విజయం అందుకున్నారు. 2023లో విడుదలైన షుగర్ ఫ్యాక్టరీ అనే కామెడీ ఎంటర్టైనర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో డార్లింగ్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. కాగా..ఇప్పటికే దీపక్ ఆరస్కు పెళ్లి కాగా.. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన చెల్లెలు అమూల్య కన్నడలో హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. -
పోలవరం పూర్తికి గడువు రెండేళ్లే
సాక్షి, అమరావతి: ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించింది. ప్రాజెక్టులో మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. భారీ వరదల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉత్పన్నమైతే మరో ఏడాది పొడిగిస్తామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు.అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ గడువును విధించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వరదను మళ్లించే స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో కీలకమైన పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది.వీటి నిర్మాణం పూర్తవడంతో గతంలో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త వాల్‌ను ఒకే సీజన్లో నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. గ్యాప్–1,2ల్లో ప్రధాన డ్యాం పనులు చేపట్టి.. 2026 మార్చికల్లా పూర్తి చేయవచ్చని తెలిపారు.41.15 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసి, ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే రూ.12,157.53 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.చంద్రబాబు తప్పులను సరిదిద్దిన జగన్కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అప్పటి సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇస్తే చాలని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని అంగీకరించారు. ప్రొటోకాల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్‌ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను నిర్మించి.. వాటి మధ్య డయాఫ్రం వాల్ వేసి.. దానిపై ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. చంద్రబాబు ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కి కమీషన్లు అధికంగా వచ్చే పనులనే చేపట్టారు. వరద మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేయకుండానే 2018కే ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ నిర్మించారు. దీంతో అది 2018 వరదలకే దెబ్బతింది. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. తర్వాత గోదావరి వరద జలాలు ఖాళీ ప్రదేశాల గూండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. 2019 మే 30న సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక.. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంను పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వైఎస్ జగన్ వినతికి సానుకూలంగా సమ్మతించిన కేంద్రం.. తాజా ధరల మేరకు పోలవరానికి నిధులిచ్చేందుకు గత ఏడాది జూన్ 5న అంగీకరించిన విషయం తెలిసిందే. -
‘గొడుగుల పాఠశాల’ పై కలెక్టర్ సీరియస్
నెన్నెల: తరగతి గదులు కురుస్తుండటంతో విద్యార్థులు గొడుగులు పట్టుకుని పాఠాలు విన్న ఘటనపై మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సీరియస్ అయ్యారు. నెన్నెల మండలం కుశ్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం సందర్శించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఠాకూర్ ఇందన్‌సింగ్‌ను సస్పెండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మరో మూడు గదులున్నా వాటిని ఉపయోగించుకోకుండా కురుస్తున్న గదిలోనే పిల్లలను గొడుగులు పట్టుకుని కూర్చోబెట్టి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారని అధికారులు పేర్కొన్నారు. ఫొటోలు, వీడియోలు తీయించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడంలో హెచ్ఎం ప్రమేయం ఉందని భావించి చర్యలు తీసుకున్నారు. విచారణ పూర్తయ్యే వరకు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని ఆదేశించారు. ఆ గదిలో ఎందుకు కూర్చోబెట్టారు? గదులు కురుస్తున్నాయని తెలిసినా విద్యార్థులను అదే గదిలో ఎందుకు కూర్చోబెడుతున్నారని ఉపాధ్యాయులను కలెక్టర్ కుమార్ దీపక్ ప్రశ్నించారు. వర్షాలు తగ్గే వరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పొడిగా ఉన్న ఇతర గదుల్లో కూర్చోబెట్టాలని ఆదేశించారు. పాఠశాల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యను ఎందుకు పెద్దగా చేస్తున్నారని టీచర్లను మందలించారు. స్టాఫ్‌రూమ్, ల్యాబ్ రూమ్‌లతోపాటు డైనింగ్ హాల్లో విద్యార్థులను సర్దుబాటు చేయాలని ఆదేశించారు. వర్షాలు తగ్గాక మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం పక్కనే ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. వార్డెన్ లచ్చన్న విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఐటీడీఏ పీఓకు చెప్పి షోకాజ్ నోటీసు ఇప్పిస్తానన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ యాదయ్య పాఠశాలకు చేరుకుని సమస్యలు తెలుసుకున్నారు. -
Lok Sabha Election 2024: పెళ్లిపత్రికలోనూ ఈవీఎంపై వ్యతిరేకత!
లాతూర్: మా పెళ్లికి విచ్చేసి భోజనతాంబూలాదులు స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. ఇది చాలా పెళ్లిపత్రికల్లో కనిపించే ఒక విన్నపం. కానీ ఇక్కడ ఒక పత్రికలో విజ్ఞాపనకు బదులు ‘వ్యతిరేకత’ కనిపించింది. ‘‘ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను నిషేధించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అంటూ కొటేషన్‌ను పెట్టాడు ఒక పెళ్లికొడుకు. మహారాష్ట్రలోని ఛాకూర్ తహసీల్ పరిధిలోని అజన్సోందా(ఖుర్ద్) గ్రామానికి చెందిన దీపక్ కుంబ్లే పెళ్లి వచ్చే నెల ఎనిమిదో తేదీన లాతూర్ పట్టణంలో జరగనుంది. కుంబ్లే అందరికీ పంచిన తన వివాహ ఆహా్వన పత్రికలో ఇలా ఈవీఎంలపై తన అసంతృప్తి వెళ్లగక్కాడు. సాధువులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను ఆ వెడ్డింగ్ ఇని్వటేషన్ కార్డులో ప్రచురించాడు. తనకు పాఠాలు బోధించిన స్కూలు టీచర్ల ఫోటోలకు ఈ ఆహ్వానపత్రికలో స్థానం కలి్పంచాడు. ఈయన అఖిలభారత వెనకబడిన, మైనారిటీ వర్గాల ఉద్యోగుల సంఘం(బామ్సెఫ్) సభ్యుడు. ‘‘ ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం సార్వత్రిక ఎన్నికలకు ముందే ఊపందుకుంది. బంధువులు, స్నేహితుల్లోనూ ఉద్యమంపై మరింత అవగాహన పెంచాలనే ఇలా ఈవీఎంల అంశాన్ని పెళ్లికార్డులో ప్రస్తావించా’ అని కుంబ్లే చెబుతున్నారు. కార్డులో కథాకమామిషు, ఫొటోలను చూసి ముక్కున వేలేసుకున్న వాళ్లూ లేకపోలేదు. కార్డు ఎలాగుంటే మనకెందుకు? పెళ్లికెళ్లి నాలుగు అక్షింతలు వేసి భోంచేసి వచ్చేద్దాం అని ఊళ్లో చాలా మంది డిసైడ్ అయ్యారట! -
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
అది 1995.. దేశంలోని హర్యానాలో చౌదరి బన్సీలాల్ ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని హర్యానా రాష్ట్ర ఇంచార్జిగా నియమించింది. మోదీకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, పార్టీ అతనికి హర్యానా బాధ్యతలను అప్పగించింది. నాటి రోజుల్లో పార్టీకి సొంత కార్యాలయం లేదు. పార్టీ సమావేశాలు అద్దె భవనంలో జరిగేవి.నరేంద్ర మోదీ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు అతని చూపు అక్కడున్న దీపక్ అనే 12 ఏళ్ల బాలునిపై పడింది. ఆ కుర్రాడు సంఘ్ కార్యక్రమాలకు హాజరుకావడంతోపాటు, బీజేపీ కార్యాలయంలో వంటమనిషిగా కూడా పనిచేసేవాడు. మోదీ ఆ కుర్రాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మరుసటి రోజు రోహ్తక్ లో జరిగే బీజేపీ సమావేశానికి తనతో పాటు దీపక్‌ను కారులో తీసుకెళ్లారు.నాటి అనుభవాల గురించి దీపక్ మీడియాతో మాట్లాడుతూ ‘నాడు రోహ్తక్ నుంచి తిరిగి వస్తుండగా కిలా రోడ్డులో కారు ఆపిన మోదీ తనకు డబ్బులు ఇచ్చి , ఒక షార్ట్, టీ షర్ట్ కొనుక్కోమని చెప్పారు. తరువాత వాటిని వేసుకుని చూపించమన్నారు. కొద్దిసేపటి తరువాత కిచిడీ ఎలా చేయాలో చూపించారు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నాకు నేర్పించారు.ఇక్కడికి వచ్చినప్పుడల్లా, నేను తయారుచేసిన కిచిడీని తినేవాడు. నేను అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతున్నాను. చదువు మానవద్దని చెబుతూ, నా స్కూలు ఫీజు కట్టేవారు. నన్ను చదువుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. మోదీ ఆరేళ్లపాటు హర్యానా బీజేపీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.2002లో మోదీ.. దీపక్‌కు ఫోన్ చేశారు. అలాగే 2004, 2006లో కూడా దీపక్‌తో ఫోన్లో మాట్లాడారు. 2009లో మోదీ హిస్సార్‌లో జరగబోయే ర్యాలీకి వెళ్తుండగా హెలికాప్టర్ చెడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న దీపక్.. మోదీని కలుసుకున్నారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ.. దీపక్‌ను వేదికపైకి పిలిచి ప్రశంసించారు.తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్న పీఎంవో కార్యాలయ బృందం దీపక్‌ను ఇంటర్వ్యూ చేసింది. దీపక్ ఆచార్య నేపాల్‌కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కో-ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. -
తొలి రౌండ్లోనే దీపక్ పరాజయం
పారిస్ ఒలింపిక్స్ వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నీలో తొలి రోజు బరిలోకి దిగిన ఇద్దరు భారత బాక్సర్లకు నిరాశే ఎదురైంది. ఆదివారం ఇటలీలో జరిగిన పురుషుల 51 కేజీల విభాగంలో దీపక్... +92 కేజీల విభాగంలో నరేందర్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. నిజాత్ హుసెనోవ్ (అజర్బైజాన్)తో జరిగిన బౌట్లో దీపక్ 2–3తో... టియాఫాక్ (జర్మనీ)తో జరిగిన బౌట్లో నరేందర్ 0–5తో ఓడిపోయారు. హరియాణాకు చెందిన దీపక్ గత ఏడాది ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్య పతకం సాధించాడు. -
వధూవరులకు సీఎం జగన్ ఆశీస్సులు
సాక్షి, అమరావతి/కంకిపాడు: మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) మేనకోడలు వివాహ వేడుకలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. కోనేరు లీలాప్రసాద్, రాజ్యలక్ష్మి విజయ చాముండేశ్వరిదేవి కుమార్తె డాక్టర్ స్నేహ, డాక్టర్ అనురాగ్ దీపక్‌ల వివాహం గురువారం కృష్ణా జిల్లా కంకిపాడులోని అయాన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం వైఎస్ జగన్ నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ వేడుకలో మంత్రి జోగి రమేశ్, కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ జాషువా, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కైలే అనిల్‌కుమార్, దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: ఈనాడు ఆరోపణలు అవాస్తవం
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్పత్రుల ఎంపానల్మెంట్ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి పాదర్శకంగా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) దీపక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ముడుపులు అందితేనే ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ అంటూ ఈనాడులో సోమవారం ప్రచురించిన కథనంలో చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. ఎంపానల్మెంట్ అవడానికి నిర్దేశించిన సదుపాయాలున్న ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పోర్టల్ అందుబాటులో ఉండే ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆ దరఖాస్తుల్ని నిర్ణీత సమయపాలనతో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఎంపానల్మెంట్ ప్రక్రియలో మాన్యువల్ ప్రమేయం ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఏవైనా లోపాలుంటే ఆ వివరణలతో ఆన్లైన్లోనే ఆస్పత్రులకు నోటీసులు వెళతాయని తెలిపారు. ఇక రోగులకు వైద్యసేవల కోసం ముందస్తు అనుమతులు (ప్రీ ఆథరైజేషన్), క్లెయిమ్‌లు ఆన్లైన్లో వివిధ స్థాయిల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆస్పత్రులను, వైద్యసేవలకు సంబంధించి ప్రజలను ఎవరైనా లంచాలు డిమాండ్ చేస్తే నేరుగా 104 (ఆరోగ్యశ్రీ ఫిర్యాదుల నంబరు), 14400 (అవినీతి నిరోధక విభాగం) నంబర్లకు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఆస్పత్రుల సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల పరిష్కార సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్పత్రుల యాజమాన్యాలు సమస్యలను cgro@aarogyasri.ap.gov.in కు మెయిల్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. -
ఆటతో...
చైతన్య పసుపులేటి, హీనా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘జీటీఏ’. దీపక్ సిద్ధాంత్ దర్శకత్వంలో డా. సుశీల నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్‌ను రచయిత–దర్శకుడు కృష్ణ చైతన్య రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘క్రైమ్ యాక్షన్ డ్రామాగా జీటీఏ అనే ఆట ఆధారంగా ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు దీపక్ సిద్ధాంత్. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కామెరా: కేవీ ప్రసాద్. -
అజ్ఞాతం వీడండి
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు, తెలంగాణకు చెందిన అగ్రనేతలు, కేడర్ అజ్ఞాతం వీడి పోలీసులకు లొంగిపోవాలని డీజీపీ అంజనీకుమార్ విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సంజోయ్ దీపక్రావును శుక్రవారం ఉదయం కూకట్‌పల్లిలోని మలేషియన్ టౌన్షిప్లో అరెస్టు చేసినట్టు డీజీపీ తెలిపారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన దీపక్‌రావు ఛత్తీస్‌గఢ్‌లోని మాడ్ ప్రాంతంలో ఓ మావోయిస్టు సమావేశానికి హాజరుకావాల్సి ఉందని, ఆయన కదలికలపై ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఒక రివాల్వర్, ఆరు లైవ్‌రౌండ్లు(బుల్లెట్లు), రూ.47,250 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మలేషియన్ టౌన్షిప్లో ఉండే మహేంద్రటెక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రంజిత్శంకరన్, మాదాపూర్‌కు చెందిన ఓ సినీ దర్శకుడు బి.అజిత్‌కుమార్‌లు దీపక్‌రావుకు ఆశ్రయం ఇచ్చినట్టు గుర్తించామన్నారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి మావోయిస్టుల రిక్రూట్మెంట్ పూర్తిగా శూన్యమని, సంజోయ్ దీపక్‌రావు అరెస్టుతో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యిందన్నారు. దీపక్‌రావు మావోయిస్టు అగ్రనేతలు గణపతి, బస్వరాజ్, కోసాలతో నేరుగా సంబంధాలున్నట్టు తెలిపారు. నాలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ సంజోయ్ దీపక్‌రావు ప్రస్తుతం కేంద్ర కమిటీతోపాటు సౌత్ రీజియన్ బ్యూరో ఇన్చార్జ్గా, వెస్ట్రన్ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా ఉన్న ఆయన మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల పోలీసులతోపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్నారు. దీపక్‌రావుపై మహారాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. మహారాష్ట్రలోని థానే జిల్లా అంబర్నాథ్ ఈస్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివగంధనగర్కు చెందిన సంజయ్ దీపక్‌రావు జమ్మూకశ్మీర్‌లో 1984లో బీటెక్ పూర్తి చేశారు. 1999లో సీపీఐఎంఎల్ రవూఫ్ గ్రూఫ్‌లో తొలుత చేరారు. నక్సల్బరీ గ్రూప్‌నకు మహారాష్ట్ర ఇన్చార్జ్గా పనిచేశారు. 2000లో ఓసారి అరెస్టు, తర్వాత విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. 2002లో అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాల వ్యాప్తికి కీలకంగా పనిచేశారు. 2014లో నక్సల్బరీ, సీపీఐ మావోయిస్టులో విలీనం కావడంలో కీలక పాత్ర పోషించారు. నవంబర్ 2021లో పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి బీజీ కృష్ణమూర్తి అరెస్టు తర్వాత, ఆ జోనల్‌కు ప్రత్యేక జోనల్ కమిటీకి కార్యదర్శిగా నియామకం కాగా, అప్పటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు. -
ఫైనల్లో బెర్త్ కోసం బరిలో భారత బాక్సర్లు
World Boxing Championships 2023: ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నేడు ముగ్గురు భారత బాక్సర్లు కీలకపోరుకు సిద్ధమయ్యారు. తెలంగాణకు చెందిన హుసాముద్దీన్ (57 కేజీలు), హరియాణాకు చెందిన దీపక్ భోరియా (51 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) సెమీఫైనల్ బౌట్లలో పోటీపడనున్నారు. 2022 యూరోపియన్ చాంపియన్ బిలాలా బెనామా (ఫ్రాన్స్)తో దీపక్; సైడెల్ హోర్టా (క్యూబా)తో హుసాముద్దీన్; 2022 ఆసియా చాంపియన్ అస్లాన్‌బెక్ షింబెర్జనోవ్ (కజకిస్తాన్)తో నిశాంత్ దేవ్ తలపడతారు. సెమీఫైనల్లో గెలిస్తే ఫైనల్ చేరి స్వర్ణ–రజత పతకాల బరిలో ఉంటారు. ఓడితే కాంస్య పతకాన్ని గెల్చుకుంటారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం గం. 5:30కు దీపక్ బౌట్ ఉంది. ఆ తర్వాత హుసాముద్దీన్, నిశాంత్ దేవ్ బౌట్లు జరుగుతాయి. ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ఈ బౌట్లను ప్రత్యక్షంగా తిలకించవచ్చు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరే ఫైనల్‌కు అర్హత సాధించారు. 2019లో అమిత్ పంఘాల్ (52 కేజీలు) ఫైనల్లో ఓడిపోయి రజత పతకం గెల్చుకున్నాడు. -
పోలీసుల ముందే ఫైటింగ్..!
-
సైన్యాధికారిణిగా గల్వాన్ అమరుని అర్ధాంగి
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో చైనా సైన్యంతో ఘర్షణల్లో అమరుడైన భారత సైనికుడు నాయక్ దీపక్ సింగ్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సతీమణి సైతం కదనరంగంలోకి దూకారు. చెన్నై కేంద్రంగా పనిచేసే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(ఓటీఏ)లో విజయవంతంగా ఆర్మీ శిక్షణ పూర్తిచేసుకున్నాక 29 ఏళ్ల లెఫ్టినెంట్ రేఖా సింగ్.. ఆర్మీ ఆర్డ్‌నన్స్ కోర్ విభాగంలో శనివారం విధుల్లో చేరారు. తూర్పు లద్దాఖ్‌లో ఫ్రంట్‌లైన్ యూనిట్లో ఆమె కర్తవ్య దీక్షను మొదలుపెట్టారని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. ఆర్మీ మెడికల్ కోర్లో సభ్యుడైన నాయక్ దీపక్ సింగ్ ఆ తర్వాతికాలంలో బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో నర్సింగ్ అసిస్టెంట్‌గా చేరారు. 2020 జూన్‌లో గల్వాన్‌లోయలో చైనా సైనికులతో పోరాడింది ఈ బెటాలియన్ బృందమే. ఘర్షణల్లో గాయపడినా కూడా నాయక్ తోటి 30 మంది క్షతగాత్రులైన సైనికులకు అత్యవసర వైద్యసాయం చేసి అద్భుత ధైర్యసాహసాలు ప్రదర్శించారని నాడు కేంద్రం శ్లాఘించింది. -
పీఎఫ్ఆర్డీఏ చైర్మన్‌గా దీపక్ మొహంతీ
న్యూఢిల్లీ: పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్‌గా దీపక్ మొహంతీను ప్రభుత్వం నియమించింది. జనవరిలో పదవీకాలం ముగిసిన సుప్రతిమ్ బంద్యోపాధ్యాయ స్థానంలో ఆయన నియామకం జరిగింది. ప్రస్తుతం పీఎఫ్ఆర్డీఏ సభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు. మొహంతీ ఆగస్టు 2020లో మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) గతంలో నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అపార అనుభవం కూడా ఆయనకు ఉంది. తాజా నియామకానికి సంబంధించి వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఇళ్లు, కారు సౌకర్యం లేకుండా మొహంతీ నెలకు రూ.4.50 లక్షల కన్సాలిడేటెడ్ వేతనం పొందుతారు. పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బాధ్యతల్లో ఆయన పనిచేస్తారు. మెంబర్‌గా...మమతా శంకర్ మొహంతీ తాజా నియామకం నేపథ్యంలో ఆయన స్థానంలో పీఎఫ్ఆర్డీఏ మెంబర్‌గా (ఎకనామిక్) మమతా శంకర్ నియమితులయ్యారు. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (1993)లో ఉన్న ఆమె ప్రస్తుతం ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖలో సీనియర్ ఎకనమిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (ఏది ముందుగా అయితే) ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రత్యేక నోటిఫికేషన్ పేర్కొంది. పెన్షన్ నిధులు ఇలా... నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) అలాగే అటల్ పెన్షన్ యోజన కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ 2023 మార్చి 4వ తేదీ నాటికి రూ. 8.81 లక్షల కోట్లు. దేశంలోని పెన్షన్ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది. అయితే తదుపరి స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్పీఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. -
Kurnool: ట్రిపుల్ ఐటీ విద్యార్థికి రూ.1.3 కోట్ల వేతనం
కర్నూలు సిటీ: కర్నూలు నగర శివారులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీ)కి చెందిన విద్యార్థి ఏడాదికి రూ.1.30 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇటీవల ట్రిపుల్ ఐటీలో అమెజాన్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లలో పాల్గొన్న విద్యార్థుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీపక్ రాథోడ్ (బీటెక్, సీఎస్ఈ) అత్యధిక వార్షిక వేతనానికి ఎంపికయ్యాడని ట్రిపుల్ ఐటీ ప్లేస్మెంట్ సెల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థి దీపక్ రాథోడ్‌ను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డీవీఎల్‌ఎన్ సోమయాజులు అభినందించారు. చదవండి: (Varadapuram Suri: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!) -
Deepak Chauhan: నవ్విస్తే ఏమొస్తుంది.. బోలెడు డబ్బులు వస్తాయి గురూ.. నమ్మరా!
Youtuber Laughing King Deepak Chauhan Successful Journey In Telugu: కాస్త సరదాగా మొదలెడదాం... నవ్వితే ఏమొస్తుంది? నవ్వే వస్తుంది. నవ్విస్తే ఏమొస్తుంది? బోలెడు లైక్‌లు వస్తాయి. సొంతకాళ్ల మీద నిలబడేంత డబ్బులు వస్తాయి! యూట్యూబ్ చానల్ ‘స్టార్’ చేయడం చాలా వీజి. దాన్ని ‘స్టార్’ చేయడం వెరీ కష్టమ్ అంటారు యూట్యూబ్ తత్వవేత్తలు. దీపక్ చౌహాన్ చానల్ మొదలుపెడితే ‘స్టార్’ కావడం తప్ప స్టార్టింగ్ ట్రబుల్స్,ఆ తరువాత ట్రుబుల్స్ అంటూ ఏమీ ఉండవు. దీపక్ విజయమంత్రం... హాస్యం! నోయిడా (ఉత్తర్‌ప్రదేశ్)కు చెందిన దీపక్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుకునే రోజుల్లో నటనపై మనసు మళ్లింది. కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అందరిలాగే తనను యూట్యూబ్ ఆకర్షించింది. దీపక్‌కు వ్గోగ్స్(వీడియో బ్లాగింగ్) అంటే ఇష్టం. ఇద్దరు ఫ్రెండ్స్(శుభమ్గాంధీ, పియూష్ గుర్జర్)తో కలిసి ‘దీపక్ శుభమ్ పియూష్ వ్లోగ్స్’ వ్గోగ్ మొదలుపెట్టాడు. 3.5 లక్షల సబ్స్క్రైబర్స్తో అది దూసుకెళ్లింది. ఆ తరువాత సొంతంగా ‘దీపక్ చౌహాన్’ యూట్యూబ్ చానల్ మొదలు పెట్టాడు. 60కె సబ్‌స్రైబర్స్‌తో శబ్భాష్ అనిపించుకుంది. తన ఫ్రెండ్స్ శుభమ్ గాంధీ, పియూష్లతో కలిసి మొదలు పెట్టిన ‘రియల్హిట్’ 3.25 మిలియన్ సబ్స్క్రైబర్స్తో మోస్ట్ పాప్లర్ అండ్ ట్రెండింగ్ యూట్యూబ్ చానల్లలో ఒకటిగా నిలిచింది. దీపక్ కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారే. తాను మాత్రం ఈ ఫీల్డ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం తన చానల్లో వెబ్‌సిరీస్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు దీపక్. చానల్ సక్సెస్ కాగానే ‘ఇక వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేదు’ అనే ఆత్మవిశ్వాసంతో ఉండేవాళ్లు అక్కడే ఉండిపోతారు. కానీ దీపక్‌కు మాత్రం ఏ రోజుకు ఆరోజు కొత్త. ప్రతిరోజూ ఒక పరీక్ష. సృజనాత్మక శక్తులు మనలో బలపడాలంటే ఏసీ రూమ్‌లో కూర్చుంటే సరిపోదు. నిరంతరం ప్రజాసమూహాల మధ్య ఉండాలనే ఎరుక దీపక్‌కు ఉంది. అందుకే పెళ్లి ఫంక్షన్ల నుంచి పుట్టిన రోజు ఫంక్షన్ల వరకు తప్పకుండా హాజరవుతాడు. అక్కడికి వచ్చిన వారి హావభావాలు, హాస్యచెణుకులు, కొత్త పదాలు...అన్ని సీరియస్‌గా గమనిస్తాడు. ఇక్కడి నుంచే తనకు అవసరమైన ముడిసరుకు దొరుకుతుంది. వాటికి తన కల్పన జోడించి షార్ప్‌గా ‘షార్ట్స్’ తయారుచేసి వదులుతాడు. ఒకరోజు ఒక పెళ్లి ఫంక్షన్‌కు వెళ్లాడు దీపక్. ఒక పెద్దావిడ తనను వెదుక్కుంటూ వచ్చింది. ‘మా ఆయనను పూర్తిగా మార్చేశావయ్యా’ అంది చాలా గంభీరంగా. ‘నేను మార్చడమేమిటి!’ అనుకున్నాడు దీపక్. ఆమె ఇలా చెప్పింది... ‘మా ఆయన నవ్వడం పెళ్లయిన కొత్తలో చూశాను. ఇక అంతే...ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవాడు. అందరిలా నవ్వితే తన పెద్దరికం ఎక్కడ పలచబారుతుందో అన్నట్లుగా ఉండేవాడు. అలాంటి మా ఆయన నీ వీడియోలు చూసి చిన్నపిల్లాడిలా నవ్వుతూనే ఉన్నాడు....’ చెప్పుకుంటూపోతూనే ఉంది ఆమె. ఇంతకీ దీపక్ ఎక్కడ? క్లౌడ్9పై అని వేరే చెప్పాలా! చదవండి: -
‘హెచ్‌సీఏపై సీబీఐ అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై సీబీఐ దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. క్రికెట్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోందని వ్యాఖ్యానించింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మను నియమించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టడంతో హెచ్‌సీఏ, బడ్డింగ్‌స్టార్ క్రికెట్ క్లబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా హెచ్‌సీఏ వ్యవహారాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ కొంత మంది మంచి వ్యక్తుల్ని నియమిస్తాం. విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులను నియమిస్తాం. హెచ్‌సీఏలోని రెండు గ్రూపులు మేనేజ్మెంట్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సీబీఐ దర్యాప్తు అవసరం. న్యాయవ్యవస్థను కూడా లాగాలని వారు చూస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘జస్టిస్ వర్మను ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దని తెలపండి. ఆయన పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. బుధవారానికి విచారణ వాయిదా వేస్తాం. ఈ లోగా విచారణ నిమిత్తం కొందరు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లు పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. -
మిశ్రమ సూచిక పద్ధతిలో ముడిబియ్యం పరీక్ష
సాక్షి, హైదరాబాద్: కస్టంమిల్డ్ రైస్(సీఎంఆర్) సేకరణలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) రాష్ట్ర జనరల్ మేనేజర్ దీపక్ శర్మ తెలిపారు. సెంట్రల్ పూల్ సీఎంఆర్‌లో పాత బియ్యం ఆమోదించేందుకు ముందుగా మిశ్రమ సూచిక పద్ధతిలో తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. కేంద్రప్రభుత్వం ఈ కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిందని దీని ప్రకారం సెంట్రల్ పూల్ కింద సీఎంఆర్ సేకరణ కోసం మిల్డ్ ముడి బియ్యాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. ఆకుపచ్చ/అవకాడో ఆకుపచ్చలో ఉన్న నమూనాలను మాత్రమే ఆమోదిస్తామని, పసుపు/పసుపు నారింజ/నారింజ తదితర రంగులో ఉన్న నిల్వలను తిరస్కరిస్తామని తెలిపారు. వాటాదారులకు ఈ పద్ధతి గురించి అవగాహన కల్పిస్తామని, తెలంగాణ ప్రభుత్వం భారత ఆహార సంస్థ కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్లర్లతో ఈ విధానంపై అవగాహన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. -
వాహనాల డిమాండ్ పెరిగింది, ఆటో మొబైల్ రంగం పుంజుకుంది
న్యూఢిల్లీ: దేశీయ ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఆశాజనకంగా మారింది. ముడి సరుకుల ధరల పెరుగుదల, లాజిసిక్ట్ సవాళ్ల నేపథ్యంలోను దేశీయ ఆటో పరిశ్రమ క్రమంగా కోలుకుంటుందని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) తెలిపింది. ఆర్ధిక వ్యవస్థ క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవటం, వాహనాల డిమాండ్ పెరగడంతో ఈ ఆర్ధిక సంవత్సరంలో పరిశ్రమ పనితీరు ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేసింది. కోవిడ్ థర్డ్ వేవ్‌పై ఆధారపడి పరిశ్రమ పనితీరు ఆధారపడి ఉంటుందని తెలిపింది. గత ఫైనాన్షియల్ ఇయర్లో పరిశ్రమ టర్నోవర్‌లో 3 శాతం క్షీణతతో రూ.3.40 లక్షల కోట్లకు చేరిందని ఏసీఎంఏ ప్రెసిడెంట్ దీపక్ జైన్ తెలిపారు. సెమీకండక్టర్ల లభ్యత, ముడిసరుకుల ధరల వృద్ధి, లాజిస్టిక్స్ ఇబ్బందులు, కంటైనర్ల అధిక ధరలు వంటివి పరిశ్రమ రికవరీకి అడ్డంకులుగా మారాయని చెప్పారు. వివిధ సవాళ్ల కారణంగా నిలిచిపోయిన పెట్టుబడులు పరిశ్రమ వృద్ధితో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాయని పేర్కొన్నారు. ఆటో పరిశ్రమ బిలియన్ డాలర్ల పెట్టుబడి అవకాశాలను కోల్పోయిందని.. ఇది ఇండస్ట్రీ వృద్ధిని చూసినప్పుడు 2018–19లో మొత్తం క్యాపెక్స్‌గా ఉండేదని ఆయన తెలిపారు. పరిశ్రమ వ్యయాల తగ్గింపు, స్థానికీకరణ చర్యలపై దృష్టిపెడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఆటోమోటివ్ పరిశ్రమలో 60–70 శాతం సామర్థ్య వినియోగం ఉన్పప్పటికీ ఉద్యోగుల పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. తక్కువ దిగుమతి సుంకాలు కోరుకుతున్న టెస్లా.. స్థానిక తయారీపై దృష్టి సారిస్తే ఏసీఎంఏ మద్దతు ఇస్తుందని చెప్పారు. హర్యానాలో స్థానికులకు 75 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు ఉండటంతో పరిశ్రమపై ప్రభావం చూపించిందని.. ఇలాంటి నిర్ణయాలు పోటీతత్వాన్ని తగ్గిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
బ్యాంకులకు రూ200 కోట్లు టోకరా వేసిన నిండుతుండి అరెస్ట్
-
ఫన్నీ వీడియో: పాపం హరితేజ భర్త.. చివరకు ఇలా అయ్యాడేంటి?
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఇటీవల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల తమ చిన్నారి ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. కూతురికి భూమి దీపక్‌రావు అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. అయితే పాప పూర్తి ఫోటోని మాత్రం ఇంతవరకు రివీల్ చేయలేదు హరితేజ. కానీ అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌రావు ఆడిస్తున్న కొన్ని వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. రీసెంట్గా హరితేజ షేర్ చేసిన ఒక వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. అందులో దీపక్ రావు కూతురిని చేతుల్లో ఎత్తుకొని ఆడిస్తూ ఉంటాడు. ఇలా రోజూ ఆడించడం అలవాటుపడిన దీపక్ రావు.. ఒకసారి చేతుల్లో కూతురు లేకున్నా.. అదేపనిగా చేతులు ఊపుతుంటాడు. ఈ ఫన్నీ వీడియోని హరితేజ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘ఫాదర్ ఆన్ డ్యూటీ’అని హాష్‌ట్యాగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ‘క్యూటెస్ట్ డాడీ’అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. -
బాలుకు ఏదైతే అవసరమో.. అదంతా చేశాం
వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు భావోద్వేగాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కాని ఎస్.పి.బాలు వంటి నిత్య జీవన గాయకుడితో అలా దూరంగా ఉండటం సాధ్యం కాదు. అటువంటి గాయకుడిని పోగొట్టుకునే సందర్భానికి సాక్షిగా మారడం సామాన్యమైన గుర్తు కాదు. బాలు వైద్యం తీసుకున్న చెన్నై ఎం.జి.ఎం హాస్పిటల్లో ఆయనకు వైద్యం చేసిన లేప్రోస్కోపిక్–బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ దీపక్ సుబ్రమణియన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ రోజులను మరువలేక పోతున్నానన్నారు. ఆయన పంచుకున్న విషయాలు... ‘‘శశికుమార్ అని నా ఫ్రెండ్ క్లినిక్ ఉంది. ఒకరోజు అర్జంటుగా రమ్మని తను ఫోన్ చేస్తే వెళ్లాను. అక్కడ బాలు సార్, చరణ్ (బాలూ తనయుడు) వెయిట్ చేస్తున్నారని శశికుమార్ నాతో చెప్పలేదు. బాలూగారిని వ్యక్తిగతంగా నేను కలిసింది ఆ రోజునే. ఓ ఆరేళ్లు అయ్యుంటుంది. ఏదో చిన్న మెడికల్ ఇష్యూస్ చెబితే పరిష్కరించాం. ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే నాకు ఫోన్ చేసేవారు. ఆయన ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ‘గ్యాస్ట్రో ఇంటెస్టినల్’ ఇష్యూస్ ఉంటే నన్ను కలవమని చెప్పేవారు. నా ప్రతి బర్త్ డేకి ఒక వాయిస్ నోట్ పంపేవారు. ఏదైనా పాటలో రెండు లైన్లు పాడి, పంపేవారు. అది నాకు చాలా స్పెషల్. అంతకుముందే చరణ్ నాకు ఫ్రెండ్. కాకపోతే బాలూతో పరిచయం అయినది మాత్రం శశికుమార్ ద్వారానే.’’ ‘‘ఆగస్ట్ 3న రాత్రి 8 గంటల ప్రాంతంలో చరణ్ ఫోన్ చేసి, ‘నాన్నకు జ్వరం ఉంది’ అంటే ముందు మందులు ఇద్దామనుకున్నాను కానీ ఆ తర్వాత ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని టెస్ట్ చేస్తే మంచిదని చేశాం. కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ‘హైరిస్క్‌లో ఉన్నారు. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండండి. ఏమీ సమస్య లేకపోతే అప్పుడు ఇంటికి వెళ్లొచ్చు’ అన్నాను.’’ ‘‘ఆయన ఎంత పెద్ద గాయకుడు అయినా అదేం చూపించేవారు కాదు. కాని నేను మాత్రం ఆయన గతంలో ఎప్పుడు హాస్పిటల్‌కు వచ్చినా స్పెషల్‌గా ట్రీట్ చేసేవాణ్ణి. ‘అలా ఏం వద్దు. వెయిట్ చేస్తాను. అందరిలానే నేను’ అనేవారు. వచ్చే ముందు ఫోన్ చేసి చెప్పేవారు. అంతే.. వెరీ డౌన్ టు ఎర్త్. అందరిలో ఒకడిగా ఉండాలనుకునేవారు.’’ ‘‘ముందు ఐసొలేషన్ రూమ్‌లోనే ఉంచాం. కానీ అడ్మిట్ అయిన మూడు రోజులకే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేశాం. మామూలు రూమ్‌లో ఉన్నప్పుడు ఆయన బుక్స్ చదివారు. టీవీ చూసేవారు. నెట్‌ఫ్లిక్స్ షోస్ చూసేవారు. కానీ శ్వాస సమస్య ఎక్కువయ్యాక ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. బాలూగారి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఇలా జరిగే అవకాశం ఉందని ముందే ఊహించి, అందుకు అనుగుణంగా చికిత్సను ప్లాన్ చేశాం. ఎక్మో వెంటిలేటర్ మీదే చికిత్స జరుగుతున్నప్పటికీ కొన్ని రోజులకు కాస్త కోలుకున్నారు. ఫుల్ కాన్షియస్లోకి వచ్చారు. అప్పుడు పదిరోజులకు ముందు వచ్చిన మెసేజ్‌లు, వీడియోలు చూపించారు చరణ్. కుడివైపు ఉండి చరణ్ చూపిస్తుంటే ఎడమ వైపుకి రమ్మన్నారు. కుడివైపు మెషీనులు ఉంటాయి కాబట్టి. అప్పుడే ఇళయరాజా మెసేజ్ చూశారు. ‘ఇటువైపు రా’ అన్నట్లు చరణ్‌ని చూసి, ఆయన సైగ చేశారు. చరణ్ ముందుకెళితే, ‘నువ్వు కాదు.. ఫోన్’ అన్నట్లు ఫోన్‌ని తన చేతిలోంచి తీసుకుని ముద్దు పెట్టుకున్నారు. అది చాలా టచింగ్ మూమెంట్. ఆయన హాస్పిటల్లో ఉన్న 52 రోజుల్లో నా కళ్లు చెమర్చిన ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.’’ ‘‘వీడియోలు, మెసేజ్‌లు మెంటల్లీ ఆయన్ను బూస్ట్ చేసేవి. గ్రాండ్ చిల్డ్రన్ పంపిన గ్రీటింగ్స్ చూపించేవాళ్లం. ఉదయం భక్తి పాటలు, ఆ తర్వాత ఆయన–ఇళయరాజా కాంబినేషన్లో వచ్చిన పాటలు, వేరే పాటలు వినిపించేవాళ్లం. అదంతా హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. ముఖ్యంగా ఆయన భార్య సావిత్రిగారు, కుమారుడు చరణ్, కుమార్తె పల్లవి వచ్చినప్పుడు సార్ ముఖం బ్రైట్‌గా అయ్యేది. ఇక బాగా రికవర్ అయ్యారనుకున్నప్పుడు చివరి 48 గంటల్లో ఆయన ఆరోగ్యం క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది.’’ ‘‘చికిత్సాకాలంలో సార్‌కి స్వల్పంగా ఇన్ఫెక్షన్ వస్తూ తగ్గుతుండేది. యాంటీ బయాటిక్స్ ఇచ్చేవాళ్లం. శుక్రవారం ఆయన చనిపోయారు. బుధవారం మధ్యాహ్నం నుంచి ఇన్ఫెక్షన్ పెరగడం మొదలైంది. ఏ మందూ దాన్ని అరికట్టలేనంత వేగంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందింది. దాంతోపాటు బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది. ఆయనకు 74 ఏళ్లు. శరీరం తట్టుకోలేకపోయింది.’’ ‘‘చరణ్ నాకు అంతకుముందే మంచి స్నేహితుడు. ఒక స్నేహితుడిగా, డాక్టర్‌గా రెండు రోల్స్ నావి. ఎక్మో ట్రీట్మెంట్లో ఏమైనా జరగొచ్చని ముందే చరణ్‌కి చెప్పాం. అయిన్నప్పటికీ బాగా రికవర్ అవుతున్న సమయంలో ఇలా జరగడం ఓ షాక్. లంగ్ ట్రాన్స్ ప్లాంట్ చేస్తే ఆయన్ను కాపాడగలిగి ఉండేవాళ్లమని కొంతమంది అన్నారు. ఎవరికేది ఇష్టం వస్తే అది రాశారు. కానీ మేం మాత్రం ఏం చేయాలో అంతా చేశాం. డాక్టర్స్ అందరం కలిసి ప్రతి రోజూ గడచిన 24 గంటల్లో ఏం జరిగింది? అనేది చర్చించేవాళ్లం. మధ్యాహ్నం చరణ్‌కి మొత్తం రిపోర్ట్ చెప్పేవాళ్లం. యూఎస్ డాక్టర్స్‌తో వీడియో కాల్ మాట్లాడేవాళ్లం. ఏదైతే అవసరమో అదే చేశారని అందరూ అన్నారు. మెడికల్ టీమ్, చరణ్ అండ్ ఫ్యామిలీ అవసరమైన దానికంటే అంతకంటే ఎక్కువే చేశామని నమ్ముతున్నారు. శుక్రవారం అంబులెన్స్‌లో ఆయన భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇక ఆ తర్వాత రెండు రోజులు నేను ‘షటాఫ్’. వేరే ఏ కేసులూ చూడకుండా అలా ఉండిపోయాను. ఎందుకంటే ఇలా జరుగుతుందని ఊహించలేదు. చాలా బాధగా అనిపించింది. ఆయన పాట రూపంలో మన మధ్య ఉంటారు.’’ -
వేదనిలయంలోకి దీపక్
సాక్షి, చెన్నై: పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం జయలలిత నివాసం వేద నిలయంలోకి వెళ్లేందుకు ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్ మంగళవారం ప్రయత్నించారు. ఆయన్ను అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. చివరకు పక్కనే ఉన్న మరో భవనంలోకి వెళ్లి కాసేపు కూర్చుని బయటకు వచ్చేశారు. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసం వేదనిలయంను స్మారకమందిరంగా మార్నేందుకు ప్రభుత్వం కసరత్తుల వేగాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఇందు కోసం సీఎం నేతృత్వంలో ఓ ట్రస్ట్ సైతం ఏర్పడింది. అదే సమయంలో జయలలిత ఆస్తులకు ఆమె అన్న జయకుమార్ కుమారుడు దీపక్, కుమార్తె దీప వారసులుగా కోర్టు ప్రకటించింది. దీంతో వేదనిలయంపై తమకు హక్కులు ఉన్నట్టు దీప, దీపక్ పేర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం మధ్యాహ్నం దీపక్ హఠాత్తుగా పోయెస్గార్డెన్లోకి వచ్చారు. అక్కడి వేదనిలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, పోలీసులు ఆయన్ను లోనికి అనుమతించలేదు. చివరకు తన వద్ద కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని, లోనికి అనుమతించాలని పట్టుబట్టారు. అయితే, పోలీసులు ఏ మాత్రం తగ్గలేదు. ఆ ఉత్తర్వుల కాపీని పరిశీలించి మౌనంగానే ఉండిపోయారు. లోనికి ఎవర్నీ అనుమతించే అధికారం తమకు లేదని భద్రతా సిబ్బంది స్పష్టం చేశారు. అర్థం చేసుకోవాలని దీపక్‌కు సూచించారు. చివరకు వేదనిలయం పక్కనే ఉన్న పాత కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు పోలీసులు అంగీకరించడంతో కాసేపులోపల కూర్చుని బయటకు దీపక్ వచ్చేశారు. అనంతరం కారులో ఆయన వెళ్లిపోయారు. జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే చరిత్రలో నిలిచిపోయేలా 'అమ్మ' స్మారకం -
జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. జయ ఆస్తులకు దీప, దీపక్ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జయ ఆస్తికి వారిద్దరూ రెండో తరం వారసులని గురువారం ప్రకటించిన కోర్టు శుక్రవారం తీర్పును సవరిస్తున్నట్లుగా ప్రత్యక్ష వారసులని స్పష్టం చేసింది. అనారోగ్యకారణాలతో జయలలిత అకస్మాత్తుగా కన్నుమూసిన నాటి నుంచి రెండు అంశాలపై రసవత్తరమైన చర్చకు తెరలేచింది. ఒకటి రాజకీయ వారసులు ఎవరు, రెండు అపారమైన ఆమె ఆస్తికి వారసులు ఎవరు..? అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీలో ఎవ్వరినీ నెంబరు టూ స్థాయిలో కూర్చో బెట్టలేదు. ఒకటి నుంచి వంద వరకూ అన్నీ తానై వ్యవహరించారు. ఆస్తుల కేసులో జైలు జీవితం గడిపినపుడు పన్నీర్‌సెల్వంకు సీఎం బాధ్యతలు అప్పగించినా అది అంతవరకే. పార్టీలో, ప్రభుత్వంలో పన్నీర్‌సెల్వం సహా అందరూ కిందిస్థాయి నేతలుగానే కొనసాగారు. ఆ రెండింటిలో మొదటిదాన్ని కైవసం చేసుకునే యత్నంలో శశికళ బొక్కబోర్లాపడి జైలు జీవి తం గడుపుతోంది. జయ స్థాయిలో శశికళ పార్టీలో చక్రం తిప్పినా అదంతా అనధికారమే. కొంత జయకు తెలియకుండా సాగిపోయినదే. ఇక ఆస్తిని దక్కించుకునేందుకు సైతం శశికళ, టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేసి విఫలమైనారు. జయ అవివాహిత కావడంతో ప్రత్యక్ష వారసులు లేరు. తాను నటుడు శోభన్‌బాబు, జయలలితకు జన్మించిన కుమార్తెను, ఆమె ఆస్తికి తానే వారసురాలినంటూ వేర్వేరుగా ఇద్దరు యువతులు కొన్నాళ్లపాటు హడావిడి చేశారు. వీరిలో బెంగళూరుకు చెందిన యువతి కోర్టులో కేసు కూడా వేసింది. ఆమె వాదనకు బలం లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే కనుమరుగైంది. ఇక జయలలిత అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్ సైతం వారసత్వపోరును ప్రారంభించారు. పారీ్టకి, ప్రాపరీ్టకి సైతం తామే వారసులమని దీప మీడియా ముందుకొచ్చారు. చెన్నై పోయస్ గార్డెన్‌లోని నివాసాన్ని జయ స్మారకమందిరంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నారు. చదవండి: పోయెస్ గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే జయకు రక్తసంబందీకులుగా దీప, దీపక్ మాత్రమే చలామణిలో ఉండడంతో న్యాయస్థానం తీర్పు కూడా వారిద్దరికీ అనుకూలంగా వచ్చింది. పోయస్‌గార్డెన్ ఇంటిని స్మారకమందిరం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని గురువారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. జయ ఆస్తులకు దీప, దీపక్ రెండోతరం వారసులని పేర్కొంది. ముందురోజు చెప్పిన తీర్పులో సవరణలు చేస్తూ జయ ఆస్తులకు దీప, దీపక్ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం మరో తీర్పు వెలువరించింది. ఇతర ఆస్తుల మాటెలా ఉన్నా చెన్నై పోయస్గార్డెన్పై అటు ప్రభుత్వం ఇటు దీప, దీపక్ పట్టుబటి ఉన్నారు. పోయస్‌గార్డెన్ ఇంటిని స్మారక మందిరం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానమే చెప్పిందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం తీర్పు వెలువడగానే మీడియా ముందు ధీమా వెలిబుచ్చారు. తాజా తీర్పుతో పోయస్‌గార్డెన్ ఇంటిపై దీప, దీపక్‌కు పూర్తిస్థాయి అధికారం వచ్చినట్లు భావించవచ్చు. జయ ఆస్తుల వ్యవహారంలో ఇంతవరకు శశికళ ప్రత్యక్ష జోక్యం చేసుకోలేదు. త్వరలో అదే జరిగితే ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి. చదవండి: వారిద్దరూ అమ్మ వారసులే ఈ తీర్పును ఊహించలేదు: దీప మద్రాసు హైకోర్టు శుక్రవారం తాజా తీర్పును వెలువరించిన అనంతరం మీడియాతో దీప మాట్లాడారు. ఇలాంటి తీర్పును నేను ఊహించలేదు. అన్నాడీఎంకే సైతం ఈ తీర్పును స్వాగతించాలి. పోయెస్‌గార్డెన్ రోడ్డులోకి ప్రవేశించకుండా నిరోధించారు. వారు ఎవరో మీకు తెలుసు. అత్త (జయలలిత) కడసారి చూపులకు కూడా నోచుకోకుండా చేసింది అన్నాడీఎంకే ప్రభుత్వమే. పోయెస్‌గార్డెన్ ఇంట్లోనే పుట్టాను. అయితే ఆ ఇంటిలోకి నేను వెళ్లకుండా అడ్డుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తమపై అనవసరమైన నిందలు మోపింది. అయితే చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మద్రాసు హైకోర్టుకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జయ ఆస్తులపై మాకు కోర్టు సర్వాధికారం ఇచ్చింది. ప్రత్యక్ష వారసులమని ప్రకటించిన తరువాత ఏఏ హక్కులు వస్తాయో పరిశీలించాలి. అన్ని ఆస్తులు మాకు అప్పగించాలి. వేదనిలయాన్ని జయ స్మారకమందరంగా మార్చాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై, ఆ ఇంటిపై హక్కు కల్పించాలని కోరుతూ గవర్నర్‌ను కలుస్తాను. అన్నాడీఎంకే నుంచి ఇకపై వచ్చే సమస్యలను న్యాయస్తానంలోనే ఎదుర్కొంటాను. జయ ఆస్తుల విషయంలో అన్నాడీఎంకేకు అడ్డంకులు ఎదురవడంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. మాలో కొన్ని భయాలు నెలకొన్నందున సాయుధ పోలీసు బందోబస్తు కల్పించాలి. చదవండి: రక్త సంబంధీకులు వారసులు కారా? జయ ఆస్తుల చిట్టా జయలలిత ఆస్తులను అధికారికంగా లెక్కకట్టేందుకు ఉన్న ఆధారాలు ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో ఆమె చూపిన వివరాలు మాత్రమే. తన వార్షిక ఆదాయం రూ.9.34 కోట్లని 1996లో ఆదాయపు పన్నుశాఖకు లెక్కచూపారు. అధికశాతం వ్యవసాయంపై వచ్చే ఆదాయమని పేర్కొన్నారు. నెలకు ఒక్కరూపాయి జీతం పొందుతున్నట్లు ఆ లెక్కల్లో తెలిపారు. 2011 ఎన్నికల్లో పోటీచేసినపుడు రూ.51.4 కోట్ల ఆస్తి చూపారు. 2016లో రూ.113.73 కోట్ల ఆస్తిని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. చరాస్థి కింది రూ.42 కోట్ల విలువైన బంగారు నగలను చూపారు. స్థలాలు, నిర్మాణాల కింద మరో రూ.72 కోట్ల ఆస్తులను ఆమె చూపారు. బ్యాంకుల్లో రూ.10.63 కోట్ల డిపాజిట్టు చూపగా ఇందులో రెండుకోట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీజ్‌కు గురయ్యాయి. వివిధ కంపెనీల్లో రూ.27.44 కోట్లు పెట్టుబడులున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 21289.30 గ్రాముల బంగారం, 1250 కిలోల వెండిని సీజ్ చేశారు. రూ.2.4 కోట్ల అప్పుకూడా ఉందని ఆమె పేర్కొన్నారు. 1992లో కొడనాడులో 900 ఎకరాల టీ ఎస్టేట్‌ను కొనుగోలు చేసి క్రమేణా 1,800 ఎకరాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఎకరా రూ.1 కోటికి పలుకుతుంది. ఇక లగ్జరీ వసతులతో కొడనాడు బంగ్లా కూడా ఉంది. కొడనాడు ఎస్టేట్ తనకు సొంతమని శశికళ చెబుతున్నారు. జయలలిత పేరున మొత్తం 173 ఆస్తులున్నట్లు సమాచారం. వీటిల్లో కనీసం వంద ఆస్తుల్లోనైనా జయలలితకు పెద్దవాటా ఉండే అవకాశం ఉంది. జయ ఆస్తులపై న్యాయస్థానంలో వాదోపవాదాల్లో రూ.913 కోట్ల ఆస్తులుగా చూపారు. -
పోయెస్ గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకప్పటి పవర్ఫుల్ రాజకీయకేంద్రమైన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం స్మారకమందిరం వివాదంలో నలిగిపోతోంది. జయ వారసులు దీప, దీపక్ ఒకవైపు, ప్రభుత్వం మరోవైపు సమరం సాగిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత చెన్నై పోయెగార్డెన్‌లో అత్యంత విలాసవంతమైన భవనంలో నివసించేవారు. రాజకీయ వర్గాలు ‘గార్డెన్’ అని ముద్దుగా పిలుచుకునేవారు. జయలలిత అధికారంలో ఉన్నపుడు ‘గార్డెన్’ నుంచి ఆదేశాలు వచ్చాయా అని ముందుగా ప్రశ్నించేవారు. సచివాలయం కంటే పోయెగార్డెన్ కే ప్రాధాన్యతతో రాజకీయ, అధికార కేంద్రంగా వెలిగిపోయేది. జయ మరణించిన తరువాత కూడా దాని ప్రాభవం తగ్గలేదు. జయకు వందలకోట్ల రూపాయల ఆస్తులున్నా గార్డెన్హౌస్ చుట్టూనే రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. జయకు సొంతమైన వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తికి ఆమె అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్ వారసులని మద్రాసు హైకోర్టు తేల్చడంతో ఇంతకూ ఆస్తులెక్కడెక్కడ ఉన్నాయి, వాటి విలువ ఎంత అనే అంశంపై జోరుగా చర్చ బయలుదేరింది. (వారిద్దరూ అమ్మ వారసులే) అవినీతి నిరోధకశాఖ కోర్టులో దాఖలు చేసిన జాబితాలో ఎన్నికల సమయంలో జయలలిత దాఖలు చేసిన నామినేషన్ పత్రంలో చూపిన ఆస్తులనే పేర్కొన్నారు. జయకు వారసులమని తమను ప్రకటించి ఆమె ఆస్తుల పర్యవేక్షణ బాధ్యతను తమకు అప్పగించాల్సిందిగా దీప, దీపక్ గతంలో వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వెలువడిన తీర్పుతో స్పష్టత వచ్చింది. వారిద్దరూ జయ ఆస్తికి రెండోతరం వారసులని కోర్టు పేర్కొంది. జయ ఆస్తులపై పర్యవేక్షణాధికారం వారిద్దరికీ ఉంటుందని తెలిపింది. పోయెస్ గార్డెన్లోనిఇంటిని జయ స్మారక మందిరంగా మార్చాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సింది ప్రభుత్వాన్ని కోర్టు సూచించింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హర్షం వ్యక్తంచేసిన దీప, దీపక్ ఇద్దరూ కలిసి చెన్నై మెరీనాబీచ్‌లోని జయ సమాధికి వెళ్లి అంజలి ఘటించారు. గార్డెన్‌లోనే కాపురం: దీప కోర్టు తీర్పులో సైతం గార్డెన్‌కు ప్రాధన్యత ఇవ్వడంతో జయ నివాసం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ, చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని వేదనిలయం తమ పూర్వీకుల ఆస్తి, ఆ భవనం తమకు సొంతమని కోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె అన్నారు. జయకు నేరుగా వారసులు లేకపోవడంతో ఆమె ఆస్తిని కాజేయాలని ఎందరో చేసిన ప్రయత్నాలకు కోర్టు అడ్డుకట్టవేసింది. పోయెస్‌గార్డెన్ ఇంటిని జయ స్మారకమందిరంగా మార్చడాన్ని అంగీకరించం. ఇందుకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర చట్టంపై కోర్టులో అప్పీలు చేస్తాం. జయకు చెందిన ఆస్తులన్నీ మాకే సొంతం. వాటిని స్వాధీనం చేసుకునేందుకు న్యాయవాదులతో చర్చిస్తున్నాం. జయ ఆస్తులను ఆక్రమించిన వారికి నోటీసులు జారీచేస్తాం. చట్టపరమైన సమస్యలు పరిష్కారం కాగానే పోయెస్‌గార్డెన్‌లో నివసిస్తాం. జయ ఆస్తులను స్వాధీనం చేసుకుని కాపాడే బాధ్యత మాపై ఉంది. జయ పేరున మేమే ట్రస్టును ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు సేవచేస్తామని దీప చెప్పారు. దీపక్ మాట్లాడుతూ, పోయెస్‌గార్డెన్ ఇల్లు వారసత్వంగా మాకు సంక్రమించిన ఆస్తి, దాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని అన్నారు. జయ స్మారకమందిరంగా ప్రభుత్వం మార్చదలచుకుంటే తాముగా ఇవ్వాలేగాని వారు ఏకపక్ష నిర్ణయం తీసుకునేందుకు వీలులేదు. వేద నిలయంను సీఎం క్యాంపాఫీస్ చేయా లన్న సూచన కూడా సరికాదు. డీఎంకే అధి కారంలోకి వచ్చి స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన పక్షంలో అందులో ఉంటారా. మాకు సాయుధ పోలీస్ బందోబస్తు కావాలని కోరలేదు. ఒక ఆస్తి కోసం నన్ను హత్యచేస్తే అందుకు బాధ్యులెవరు. ఎడపాడి, పన్నీర్‌సెల్వం తమ పూర్వీకుల ఆస్తిని జయ స్మారకమందిరంగా చేసుకుంటే మంచిదని దీపక్ వ్యాఖ్యానించారు.(స్మారక మందిరంగా జయలలిత నివాసం) చిన్నమ్మకు చిక్కే.. జయ ఆస్తులపై కోర్టు ఇచ్చిన తీర్పు శశికళను చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. జయలలిత, శశికళ సంయుక్తంగా అనేక సంస్థలు నడుపుతుండేవారు. వాటిల్లోని జయ వాటాను దీప, దీపక్‌లకు కేటాయించాల్సి ఉంటుంది. లేదా జయ ఆస్తులన్నీ ట్రస్ట్ కిందకు తీసుకొస్తే మారుమాట్లాడకుండా శశికళ అప్పగించాల్సి రావచ్చు. కొడనాడు ఎస్టేట్, హైదరాబాద్‌లోని ద్రాక్ష తోట వివాదాలు కుదుటపడవచ్చు. ప్రభుత్వానికే అధికారం: సీవీ షణ్ముగం చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసాన్ని స్మారక మందిరంగా మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు తీర్పుతో స్పష్టమైందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం వ్యాఖ్యానించారు. జయ ఇంటిని స్మారకమందిరంగా మార్చడంపై పునరాలోచించాలని, ఒక భాగం స్మారక మందిరం, మరో భాగం సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మార్చవచ్చని కోర్టు సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కోర్టు తీర్పు ప్రతులు అందిన తరువాత క్షుణ్ణంగా అధ్యయనం చేసి బదులు పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన తెలిపారు.