
విద్యార్థి దీపక్‌ను అభినందిస్తున్న ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సోమయాజులు
కర్నూలు సిటీ: కర్నూలు నగర శివారులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీ)కి చెందిన విద్యార్థి ఏడాదికి రూ.1.30 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
ఇటీవల ట్రిపుల్ ఐటీలో అమెజాన్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లలో పాల్గొన్న విద్యార్థుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీపక్ రాథోడ్ (బీటెక్, సీఎస్‌ఈ) అత్యధిక వార్షిక వేతనానికి ఎంపికయ్యాడని ట్రిపుల్ ఐటీ ప్లేస్‌మెంట్ సెల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థి దీపక్ రాథోడ్‌ను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డీవీఎల్‌ఎన్ సోమయాజులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment