IIIT student
-
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని.. ఆత్మహత్య!
వేంపల్లె: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో నిర్వహించే ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యారి్థని జమీషా ఖురేషీ (17) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన మక్బూల్, నసీమా దంపతులకు కుమారుడు సోహెల్ అబ్బాస్, కుమార్తె జమీషా ఖురేషీలు ఉన్నారు.ఈ అమ్మాయికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు వచి్చంది. మొదటి సంవత్సరం పీయుసీ–1 లో మంచి మార్కులు సాధించింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం క్యాంపస్‌లోని క్యాంటిన్‌కు వెళ్లింది. అక్కడ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యారి్థని మొబైల్ ఫోన్ పోయింది. ఆ ఫోన్‌ను జమీషా ఖురేషీ తీసుకున్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన ట్రిపుల్ ఐటీ అధికారులు ఆమెను అందరి ముందు మందలించారు. జరిగిన విషయాన్ని విద్యారి్థని తల్లిదండ్రులకు తెలియజేశారు.దీంతో ఆమె మనస్థాపానికి గురై హాస్టల్ గదిలో ఉన్న వాటర్ పైప్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్లో ఉన్న తోటి విద్యార్థులు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు స్టడీ అవర్స్‌కు వెళ్లి పోవడంతో ఎవరూ గుర్తించలేదు. 10 గంటల తర్వాత విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. నేడు నవ్వుతూ ఇంట్లో ఉండేది
ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈ పాటికి ఆ అమ్మాయి నవ్వుతూ ఇంటిలో ఉండేది. ఒక్క రోజు గడిస్తే చక్కగా కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకలు చేసుకుని ఉండేది. కానీ ఆ విద్యార్థిని సంయమనం చూపలేకపోయింది. తెలివితేటలతో ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థిని తన మనసుకు మాత్రం కరెక్ట్ సమాధానం చెప్పుకోలేకపోయింది. ఒక్క పరీక్షతో జీవితం ఆగిపోదన్న నిజాన్ని అర్థం చేసుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆశలు పెట్టుకున్న అమ్మానాన్నలకు క్షమాపణలు చెబుతూ బలవంతంగా ఊపిరి ఆపుకుంది. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో ఏడాది చదువుతున్న భవిరి విశిష్ట రోషిణి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాక్షి, శ్రీకాకుళం(ఎచ్చెర్ల క్యాంపస్): ‘అమ్మా..నాన్నా.. క్షమించండి. మీ అంచనాలు, ఆశలు అందుకోలేకపోతున్నాను. పరీక్ష మెరుగ్గా రాయలేకపోతున్నాను. తమ్ముడిని బాగా చదివించండి’ అంటూ సూసైడ్ నోట్ రాసి శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ) ఎస్ఎం పురం క్యాంపస్ విద్యార్థిని భవిరి విశిష్ట రోషిణి (17) బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని క్యాంపస్‌లో ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) రెండో ఏడాది చదువుతోంది. ప్రస్తుతం రెండో ఏడాది చివరి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం చివరి పరీక్ష ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఎగ్జామ్ జరిగింది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. అయితే ఈ విద్యార్థిని 11 గంటలకే పరీక్ష ముగించేసి వసతి గృహంలోని తన గదికి వచ్చేసింది. పరీక్ష సరిగా రాయలేకపోయాననే భావనతో సూసైడ్ నోట్ రాసి బ్లాక్ 1లో ఉన్న తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. మిగతా విద్యార్థులు పరీక్ష పూర్తి చేసుకు ని వచ్చే సరికి రోషిణి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వారు భయపడి కేర్ టేకర్ జి.జయలక్ష్మికి చెప్పగా.. ఆమె అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనకు చేరుకున్న పరిపాలన అధికారి రమేష్‌నాయుడు, అధ్యాపకులు విద్యార్థినిని కిందకు దించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అయితే విద్యార్థిని మృతి చెందినట్లు వై ద్యులు నిర్ధారించారు. వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు ఎచ్చెర్ల పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ టి.సత్యనారాయణ విద్యార్థిని ఫోన్‌తో పా టు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ వచ్చి సాక్ష్యాలు సేకరించింది. చదువు ఒత్తిడి కారణంగానే విద్యార్థిని క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెలివైన విద్యార్థిని.. రోషిణి చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిని. పీయూసీ మొదటి ఏడాది, రెండో ఏడాది మొదటి సెమిస్టర్‌లోనూ 9.3 క్రెడిట్స్ సాధించి మంచి స్థానంలో ఉంది. చివరి పరీక్షకు సైతం శ్రమించి చదివి సన్నద్ధమైంది. అనుకున్న రీతిలో పరీక్ష రాయలేకపోవడంతో అసంతృప్తికి లోనయ్యింది. కోవిడ్ నేపథ్యంలో 10వ తరగతి పాస్ అయినా ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ప్రారంభంలో మొదటి కౌన్సెలింగ్‌లో న్యూజివీడు క్యాంపస్ ఎంచుకుంది. సాలూరు శ్రీకాకుళానికి దగ్గర కావటంతో రెండో కౌన్సెలింగ్‌లో శ్రీకాకుళం క్యాంపస్ ఎంచుకుంది. తల్లిదండ్రులు సైతం తరచూ వచ్చి కలుస్తుండేవారు. నేడు బర్త్‌డే.. గురువారం రోషిణి పుట్టిన రోజు. సెమిస్టర్ పరీక్షలు బుధవారం ముగియటంతో విశ్రాంతి కోసం మూడు రోజులు ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి గురువారం జన్మదినం జరుపుకోవాలనుకుంది. 18వ ఏటలోకి అడుగు పెట్టాల్సిన విద్యార్థిని ఏకంగా లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. ఇది రెండో ఘటన.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఏడు నెలల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. విజయనగరం జిల్లా నెల్లిమెర్లకు చెందిన పీయూసీ మొదటి సంవత్స రం విద్యార్థిని కొండపల్లి మనీషా అంజు ఫిబ్రవరి 16న ఆత్మహత్యకు పాల్పడింది. విద్యాసంస్థలో చేరిన కొన్ని రోజులకే ఇంటిపై బెంగ (హోం సిక్‌తో) విద్యార్థిని మృతి చెందగా, ప్రస్తుతం విశిష్ట రోషిణి చదువు ఒత్తిడి కారణంగా చనిపోయింది. కన్నీరుమున్నీరు.. విశిష్ట రోషిణిది మన్యం జిల్లా సాలూరు పట్టణం తట్టికోట వీధి. తండ్రి బ్యాంకులో బంగారు నగల నిర్ధారణ పనిచేస్తుంటారు. తల్లి సౌజన్య గృహిణి. వీరికి 8వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు. కుమార్తె మృతి విషయం తెలియగానే తల్లిదండ్రులు శ్రీకాకుళం రిమ్స్‌కు చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇక క్యాంపస్‌లో విద్యార్థులు ఈ ఘటనతో హడలిపోతున్నారు. పరీక్షలు ముగియటం, మూడు రోజులు ఇళ్లకు వెళ్లే అవకాశం ఇవ్వటంతో తల్లిదండ్రులకు స మాచారం ఇచ్చి దగ్గరలో ఉన్నవారు ఇళ్లకు వెళుతున్నారు. మరోపక్క క్యాంపస్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
Kurnool: ట్రిపుల్ ఐటీ విద్యార్థికి రూ.1.3 కోట్ల వేతనం
కర్నూలు సిటీ: కర్నూలు నగర శివారులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ (ట్రిపుల్ ఐటీ)కి చెందిన విద్యార్థి ఏడాదికి రూ.1.30 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇటీవల ట్రిపుల్ ఐటీలో అమెజాన్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లలో పాల్గొన్న విద్యార్థుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన దీపక్ రాథోడ్ (బీటెక్, సీఎస్ఈ) అత్యధిక వార్షిక వేతనానికి ఎంపికయ్యాడని ట్రిపుల్ ఐటీ ప్లేస్మెంట్ సెల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థి దీపక్ రాథోడ్‌ను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డీవీఎల్‌ఎన్ సోమయాజులు అభినందించారు. చదవండి: (Varadapuram Suri: అక్రమాల ‘వరద’పై ఎందుకింత ప్రేమ!) -
Prakasam District: ట్రిపుల్ ఐటీ విద్యార్థికి రూ.22 లక్షల ప్యాకేజీ
సాక్షి, చీమకుర్తి: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని ట్రిపుల్ ఐటీ విద్యార్థి పంతగాని అజయ్ రూ.22 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న సింగపూర్‌కు చెందిన గోజెక్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అజయ్.. ఏడాదికి రూ.22 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు కంపెనీ వారు ఆఫర్ లెటర్‌ను పంపారు. దీనిని ట్రిపుల్ ఐటీ కళాశాల డైరెక్టర్ బి.జయరామిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థి అజయ్ మంగళవారం కళాశాలలో అందుకున్నారు. కాగా, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ జయరామిరెడ్డి మాట్లాడుతూ.. 2021–22 విద్యాసంవత్సరంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పలు కంపెనీలు నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్‌లలో మొత్తం 774 మంది తమ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. మరో 125 మంది విద్యార్థులు ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, ఆఫర్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. చదవండి: (అంతా నారాయణ ఆదేశాలతోనే..) -
ఆ బెంగతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్: ప్రతిభావంతురాలైన ఓ విద్యార్థిని ప్రయాణం అర్ధంతరంగా ఆగిపోయింది. పోటీ పరీక్షల్లో సత్తా చాటిన అమ్మాయి జీవితంలో మాత్రం ఆ తెగువ,తెలివి చూపలేకపోయింది. ఇంటిపై బెంగ పెట్టుకుని ఏకంగా ప్రాణాలే తీసుకుంది. ఆలోచనలకు అడ్డుకట్ట వేయలేక, వెంటాడుతున్న మనోవ్యధను భరించలేక, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో పాలుపోక బంగారు భవిష్యత్తు ఉన్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) ఎస్ఎం పురం క్యాంపస్‌లో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న కొండపల్లి మనీష అంజు(16) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని స్వస్థలం విజయనగరం జిల్లా నెల్లిమర్ల. అనారోగ్యం అని చెప్పి.. ఈ ఏడాది టెన్త్ క్లాస్‌లో కోవిడ్ కారణంగా అందరినీ పాస్ చేసేశారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు పోటీ పరీక్ష నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన మనీష అంజు శ్రీకాకుళం క్యాంపస్‌లో సీటు సంపాదించింది. ఈమెకు కాలేజీ హాస్టల్లోని ఎస్–4 గదిని మరో ఇద్దరు విద్యార్థినులు అక్షిత, యమునలతో కలిపి కేటాయించారు. యమున ఇంకా రిపోర్ట్ చేయలేదు. అక్షిత మాత్రం ఇదే గదిలో ఉంటూ బుధవారం క్లాసుకు వెళ్లిపోయింది. మనీష తనకు ఆరోగ్యం బాగోలేదని, విశ్రాంతి తీసుకుంటానని కేర్‌టేకర్‌కు చెప్పి ఆమె గదిలోకి వెళ్లిపోయింది. ఉదయం అంతా క్లాసులకు వెళ్లిపోయాక 10.30 గంటల ప్రాంతంలో గదిలోని ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదవండి: (13 మంది విద్యార్థినులపై అత్యాచారం.. టీచర్‌కు..) మధ్యాహ్నం తోటి విద్యార్థినులు ఆమెను భోజనానికి పిలవడానికి గది వద్దకు వచ్చారు. తలుపులు కొట్టగా ఎవరూ తీయలేదు. దీంతో వారు కేర్ టేకర్‌కు సమాచారం అందించారు. అనంతరం తలుపులు బద్దలుగొట్టి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతూ మనీష కనిపించింది. దీంతో కేర్ టేకర్ కంగారు పడి డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడ జగదీశ్వరరావు, పరిపాలన అధికారి కె.మోహన్‌కృష్ణ చౌదరిలకు సమాచారం చేరవేశారు. తర్వాత మనీషను కిందకు దించి అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ట్రిపుల్ ఐటీ అధికారులు ఎచ్చెర్ల పోలీసులకు, విద్యార్థిని తల్లిదండ్రులు సూరిబాబు, కరుణకుమారిలకు సమాచారం చేరవేశారు. ఎచ్చెర్ల ఎస్ఐ కె.రాము ఆధ్వర్యంలో పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులు విచారణ నిర్వహించి, ఆధారాలు సేకరించారు. తోటి విద్యార్థినులను విచారించారు. ఇంటిపై బెంగ పెట్టుకుందా..? మనీష అంజు చురుకైన విద్యార్థిని. ప్రాథమిక విద్యలో మంచి ప్రతిభ కనబరిచి ట్రిపుల్ ఐటీకి ఎంపికైంది. ఇక్కడ పీయూసీ మొదటి ఏడాది, మొదటి సెమిస్టర్ క్లాస్ వర్క్ సంక్రాంతి పండగ ముందు 15 రోజులు నిర్వహించారు. అనంతరం కరోనా నేపథ్యంలో విద్యాసంస్థకు సెలవులు ప్రకటించారు. మొదటి ఏడాది విద్యార్థులకు క్యాంపస్ అలవాటు చేసేందు ఆఫ్‌లైన్ క్లాస్‌వర్క్‌ను ఈ నెల 14న ప్రారంభించారు. ఈమె రెండు రోజుల పాటు క్లాస్‌కు హాజరైంది. కానీ ఇక్కడ తనకు నచ్చడం లేదని, ఇల్లు గుర్తుకు వస్తోందని తోటి వారితో తరచూ చెప్పేది. తల్లిదండ్రులతో రోజూ మాట్లాడేది. రెండు రోజుల కింద తల్లి స్వయంగా వచ్చి ఆమెను క్యాంపస్‌లో దించి వెళ్లారు. సంక్రాంతి ముందు కూడా ఆమె తండ్రి 15 రోజుల్లో రెండుసార్లు వచ్చి చూశారు. విద్యార్థిని ఇంటికి వెళ్లినప్పుడు కూడా తాను కాలేజీకి వెళ్లనని చెప్పినట్లు సమాచారం. తల్లిదండ్రులను విడిచి ఇక్కడ ఉండలేకే విద్యార్థి ఇలా చేసుకుందని తోటివారు భావిస్తున్నారు. ఈ క్యాంపస్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. కూతురు చనిపోయిందన్న వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
విషాదం: బాగా చదవలేక పోతున్నా.. అందుకే
నూజివీడు(కృష్ణా జిల్లా): స్థానిక ట్రిపుల్ ఐటీలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈవూరి గౌరీష్(16) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన నగరం గ్రామానికి చెందిన గౌరీష్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని ఐ2 హాస్టల్ భవనం ఫస్ట్‌ఫ్లోర్‌లోని ఓ గదిలో ఉరివేసుకున్నాడు. ఆదివారం ఉదయం గౌరీష్‌కు అతని తల్లి ఫోన్ చేయగా స్పందించలేదు. సాయంత్రం మళ్లీ ఫోన్ చేసినా ఫలితంలేకపోవడంతో అతని స్నేహితులకు ఫోన్ చేసి మాట్లాడించమని చెప్పింది. చదవండి: వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్టు పరీక్షలు కావడంతో స్నేహితుల రూమ్‌లకు వెళ్లి చదువుకుంటూ ఉంటాడేమోనని రాత్రి 8.30 గంటల సమయంలో అన్ని రూమ్‌లను వెతుకుతుండగా ఒక గది తలుపులు తెరుచుకోలేదు. తలుపులను పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని గౌరీష్ కనిపించాడు. ఈ సమాచారం అందిన వెంటనే డీఎస్పీ బుక్కాపురం శ్రీనివాసులు, పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. తాను బాగా చదువలేకపోతున్నానని, అందుకే చనిపోతున్నట్లుగా గౌరీష్ సూసైడ్ లెటర్ రాశాడని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పట్టణ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థికి ముఖ్యమంత్రి ఆపన్నహస్తం
సాక్షి, వైవీయూ: వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్‌ఐటీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎస్.కృష్ణప్రసాద్‌నాయక్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన రైతు విజయ్‌కుమార్‌నాయక్, సుభద్రాబాయి దంపతుల కుమారుడు ఎస్.కృష్ణప్రసాద్‌నాయక్ బోన్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఇటీవల ఇడుపులపాయకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ విద్యార్థి కలిసి తన పరిస్థితిని వివరించారు. మెరుగైన వైద్యం కోసం సాయం చేయాలని అర్థించారు. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్‌ను ఆదేశించారు. విద్యార్థికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (సీఎంఆర్ఎఫ్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్) డాక్టర్ హరికృష్ణకు జిల్లా కలెక్టర్ పంపిన నివేదికకు ఆమోదం దక్కింది. త్వరలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు మంజూరుకానున్నాయి. ఈ సందర్భంగా బాధిత విద్యార్థి మాట్లాడుతూ.. తనకు మెరుగైన వైద్యం అందించేందుకు సహకరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి ఈయూ ఫెలోషిప్
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థిని షేక్ నజ్మాసుల్తానా చదువులో ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ యూనియన్ ఫెలోషిప్‌కు ఎంపికైంది. ఈ ఫెలోషిప్ కింద ఎంఎస్ చేయడానికి నజ్మాసుల్తానాకు ఏడాదికి రూ.20 లక్షల చొప్పున రెండేళ్లపాటు ప్రోత్సాహకంగా అందిస్తారు. దేశవ్యాప్తంగా ఈ ఫెలోషిప్‌కు ఇద్దరు మాత్రమే ఎంపిక కాగా.. అందులో నజ్మాసుల్తానా ఒకరు కావడం విశేషం. చదువులో మేటి గుంటూరు నగరం నల్లపాడుకు చెందిన షేక్ నజ్మాసుల్తానా చదువులో చిన్ననాటి నుంచి ప్రతిభ కనబరిచేది. తండ్రి అమీర్‌బాషా మిలటరీలో కెప్టెన్‌గా పనిచేయగా, తల్లి ముజాహిదా సుల్తానా గృహిణి. నజ్మాసుల్తానా 2013లో ట్రిపుల్ ఐటీలో పీయూసీలో చేరి, ఆ తరువాత ఇంజనీరింగ్‌లో మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజినీరింగ్ బ్రాంచి తీసుకుంది. అందులోనూ ప్రతిభ కనబరిచింది. ఇంజినీరింగ్‌లో 9.1 సీజీపీఏతో ఉత్తీర్ణురాలైన నజ్మాసుల్తానా ఐఐటీ మద్రాస్‌లో సిరామిక్ టెక్నాలజీలో ఇంటర్న్‌షిప్ చేసింది. బయో మెటీరియల్స్‌పై అంతర్జాతీయ రీసెర్చ్ పేపర్స్‌ను సైన్స్ జర్నల్స్‌కు సమర్పించింది. ఆగస్టులో ఫ్రాన్స్‌కు.. నజ్మాసుల్తానా యూరప్‌లోని ఫ్రాన్స్‌లో గల గ్రెనోబుల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రథమ సంవత్సరం, జర్మనీలోని డామ్స్ట్రాడ్లో ఉన్న టెక్నికల్ యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం చదవనుంది. యూరప్‌లోని నాలుగు దేశాల (ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, పోర్చుగల్)కు చెందిన ఏడు యూనివర్సిటీలు కలసి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఆఫ్ సైన్సెస్‌కు సంబంధించి రెండేళ్ల ఎంఎస్ కోర్సును అభివృద్ధి చేశాయి. ఈ కోర్సులో చేరేందుకు ప్రతిభావంతులైన యూరోపియన్ విద్యార్థులకు, యూరోపియనేతర విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తున్నాయి. నజ్మాసుల్తానా ఆగస్టు మూడో వారంలో ఫ్రాన్స్‌కు వెళ్లనుంది. నజ్మా సుల్తానాను, ఆమె తల్లిదండ్రులు అమీర్‌బాషా, ముజాహిదా సుల్తానాలను ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డి.సూర్యచంద్రరావు సన్మానించారు. -
నాన్న వద్దు.. ప్రేమికుడే ముద్దు
నూజివీడు : ‘నేను నా తండ్రితో పాటు ఇంటికెళ్లను.. నాకు వేరే పెళ్లి చేస్తారు. నేను ప్రేమించిన యువకుడి దగ్గరికే వెళ్తా.. ’ అంటూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థిని మొండికేసింది. ట్రిపుల్ ఐటీకి సెలవులు కావడంతో కుమార్తెను తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రి వెంట తాను వెళ్లేది లేదని భీష్మించుకూర్చుంది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనతో ఏం చేయాలో పాలుపోక ట్రిపుల్ ఐటీ అధికారులు తలలు పట్టుకున్నారు. ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం పూర్తిచేసిన పి.జ్యోత్స్న స్వగ్రామం గుంటూరు జిల్లా వెల్లటూరు. ఏడాది కిందట ఇంటర్న్‌షిప్‌నకు వెళ్లిన సమయంలో విజయవాడలో ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మోహనమురళీతో పరిచయం ఏర్పడి అదికాస్తా ప్రేమగా మారింది. ఎంబీఏ చదివిన అతను ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. కుమార్తె ప్రేమ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో పలుమార్లు కుమార్తెను మందలించారు కూడా. ఈ నేపథ్యంలో శనివారంతో పరీక్షలు పూర్తవుతున్నందున కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి శుక్రవారం సాయంత్రమే ట్రిపుల్ ఐటీకి వచ్చాడు. ట్రిపుల్ ఐటీ అధికారులు కూడా ఎంత చెప్పినా ఆమె వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నూజివీడు సీఐ మిద్దే గీతారామకృష్ణ సైతం వెళ్లి ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ చేసినా తండ్రి వెంట వెళ్లేందుకు ససేమిరా అనడంతో ఏమి చేయాలో తెలియనిస్థితిలో ఉన్నారు. -
శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో కలకలం
కృష్ణాజిల్లా , నూజివీడు : శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థిని బోడ సుష్మాపావని (18) ఆత్మహత్యాయత్నం ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో కలకలం రేపింది. సాఫీగా సాగుతున్న విద్యాసంస్థలో ఆత్మహత్యాయత్నం జరగడంతో ఒక్కసారిగా సంచలనం కలిగించింది. బోడ సుష్మాపావని స్వగ్రామం వరంగల్ జిల్లా గూడూరు మండలం గుండెంగ కాగా, తండ్రి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తాడని ట్రిపుల్ఐటీ సిబ్బంది పేర్కొన్నారు. ఒకవైపు సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండగా వాటిని రాస్తున్న విద్యార్థిని ఒక్కసారిగా ఆత్మహత్యాయత్నానికి ఎందుకు ప్రయత్నించిందో అంతుబట్టడం లేదు. అర్ధరాత్రి దాటిన తరువాత 2.30 గంటల ప్రాంతంలో కే4 హాస్టల్ భవనంలో రెండో అంతస్తు నుంచి హాస్టల్ వెలుపల వైపునకు దూకడం వెనుక బలమైన కారణాలు ఏమిటనేది ఇంకా బయటపడలేదు. తల, ఇతర చోట్ల దెబ్బలు తగలకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిందని అధికారులు అంటున్నారు. ఇదిలాఉండగా సదరు విద్యార్థిని గత శనివారం మూడో అంతస్తులో ఉన్న తన రూం నుంచి రెండో అంతస్తులో ఉన్న 45వ నంబరు రూంలోకి వచ్చి ఉంటోందని విద్యార్థినులు చెబుతున్న సమాచారం. విద్యార్థిని రూం మారినప్పటికీ కేర్ టేకర్లు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తే ట్రిపుల్ఐటీ అధికారుల వద్ద సరైన సమాచారం లభించడం లేదు. పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు.. ఒక వైపు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు ఆత్మహత్యాయత్నమేనని స్పష్టం చేస్తుండగా, ట్రిపుల్ఐటీ అధికారులు మాత్రం కాలు జారి పడిపోయినట్లుగా ప్రచారం చేస్తూ పక్కదారి పట్టించడానికి ప్రయత్నించడం గమనార్హం. వాష్‌రూంకు వెళ్లేందుకు లేచిన విద్యార్థిని ఉమ్ము ఊసేందుకు పక్కకు వంగగా జారి పడిపోయానని క్షతగాత్రురాలు చెప్పిందంటూ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ బాలికకు మూడో అంతస్తులోని రూం నంబరు 47ను కేటాయించగా, గత శనివారం నుంచి రెండో అంతస్తులోని రూంనెంబరు 45లో ఉంటోంది. ఈ రూంలో ఉంటున్న పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు మాకు ఇబ్బందిగా ఉంటోందని కేర్ టేకర్లకు చెప్పినా పట్టించుకోలేదని సమాచారం. పరీక్షల వరకే కదా ఉండేది, ఆ తరువాత సెలవులు ఇస్తారు కాబట్టి ఇంటికి వెళ్లిపోతానని వారితో అన్నట్లు ఆ విద్యార్థులు చెప్తున్నారు. అసలు ఆమెకు కేటాయించిన గదిలో ఉండకుండా క్లాసుమేట్స్ కూడా కానటువంటి, అక్టోబర్‌లో నూతనంగా చేరిన పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల గదిలో ఎందుకు ఉంటుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సరైన విచారణ జరిపి కారణాలను వెలికితీయకపోతే ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలు మిస్టరీగానే మిగలనున్నాయి. -
వైఎస్ జగన్‌ను కలిసిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని
-
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
ఖమ్మం అర్బన్: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నగరంలోని పాండురంగాపురంలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాళ్లు, చేతులు కట్టేసి ఉరికి వేలాడదీశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోది చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. కామేపల్లి మాజీ ఎంపీపీ జర్పుల లక్ష్మణ్ నాయక్–రమాదేవి దంపతులు పదేళ్ల క్రితం ఖమ్మం నగరంలోని పాండురంగాపురంలో స్థిరపడ్డారు. రమాదేవి గేటు కారేపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరి కూతురు లిఖిత యామిని(19) చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ కాలేజీలో ట్రిపుల్ ఐటీ చదువుతోంది. మొదటి ఏడాది పూర్తవడంతో సెలవులకు ఇంటికి వచ్చింది. రెండు నెలలపాటు ఇంటి వద్దనే ఉంది. రెండో ఏడాది తరగతులు ప్రారంభం కానుండడంతో గత ఆదివారం కాలేజీకి వెళ్లాల్సి ఉంది. వచ్చే ఆదివారం వెళదామని ఆమె నిర్ణయించుకుంది. బుధవారం ఆమె తల్లి పాఠశాలకు, తండ్రి బయటకు వెళ్లారు. ఇంటిలో లిఖిత యామిని ఒక్కతే ఉంది. పాఠశాల నుంచి తల్లి రమాదేవి కూతురుకు ఫోన్ చేశారు. ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో ఇంటి కింది పోర్షన్లో అద్దెకు ఉంటున్న వారికి ఫోన్ చేసి, ‘లిఖిత పోన్ తీయడం లేదు. వెళ్లి చూడండి’ అని కోరారు. వారు పైకెళ్లి చూసే సరికి.. ఇంట్లో ఫ్యాన్‌కు యామిని వేలాడుతూ ఉంది. ఆమె కాళ్లు, చేతులు చీరతో గట్టిగా కట్టేసి ఉన్నాయి. ఆమెది ముమ్మాటికీ హత్యేనని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి ఉంటే ఉరి వేసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఎవరో చంపి, ఇలా వేలాడదీశారని భావిస్తున్నారు. ఆమె తండ్రి ఫిర్యాదుపై ఎస్ఐ అశోక్‌రెడ్డి కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. -
కథ అల్లి.. ప్రియుడితో వెళ్లి..!
విజయవాడ ,నూజివీడు : ట్రిపుల్ ఐటీకి వచ్చేందుకు బయలుదేరి నూజివీడు వరకు వచ్చి, కట్టుకథ అల్లి ఆ తర్వాత ప్రియుడితో కలిసి చెన్నై వరకు ఓ విద్యార్థిని వెళ్లిన ఘటన ట్రిపుల్ ఐటీలో సంచలనం కలిగించింది. తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని (17) జూలై 29న ఇంటి నుంచి సోదరుడితో కలిసి నూజివీడుకు సాయంత్రం 4 గంటలకు వచ్చింది. నూజివీడు బస్టాండులో దిగాక సోదరుడిని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పింది. ఆ తర్వాత నాన్‌స్టాప్ బస్సులో విజయవాడకు చేరుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడి నుంచి ప్రియుడితో కలిసి చెన్నై వరకు వెళ్లి అక్కడ రైల్వే పోలీసులకు చిక్కింది. దీంతో తమ బాబాయి ఇక్కడ ఉన్నాడంటూ చెప్పడంతో ఆయనకు అప్పగించారు. అయితే ఇక్కడకు తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే తాను ఆటోలో ఎక్కానని, పక్కన కూర్చున్న వ్యక్తి ఏదో గుచ్చినట్లుగా ఉందని, అనంతరం ఏం జరిగిందో తెలియదని, తెలివి వచ్చేసరికి చూస్తే చెన్నై స్టేషన్లో ఉన్నానంటూ నమ్మశక్యం కాని కథను వినిపిస్తోంది. సోదరుడు నూజివీడు బస్టాండు వరకు రాగా, అక్కడి నుంచి ఎందుకు వెనక్కు వెళ్లిపొమ్మందో అడిగితే సమాధానం లేదు. నూజివీడు నుంచి చెన్నై వరకు బాలిక నిద్రమత్తులోనే ఉంటే రైల్వే స్టేషన్లోకి ఆగంతకులు ఎలా తీసుకెళ్లారు.. నిజంగా ఎవరైనా మత్తు ఇచ్చినా నూజివీడు చుట్టుపక్కల అన్ని తోటలు, అటవీ ప్రాంతం కాబట్టి మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతారే గాని చెన్నై వరకు ఎందుకు తీసుకెళ్తారనే విషయం అంతుబట్టడం లేదు. అక్కడ వరకు వెళ్తే తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు, వారు ఏమయ్యారు అనేది ప్రశ్నార్ధకం. బస్టాండు వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే కట్టు కథ అవునా, కాదా అనే విషయం వెలుగు చూస్తుంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ అధికారులు బాలికను కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి రమ్మని మంగళవారం పంపించి వేసినట్లు సమాచారం. -
మహేశ్‌బాబుకు సూసైడ్ నోట్ రాసి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఎస్ఐ చింతకాయల వెంటేశ్ తెలిపిన మేరకు.. గుంటూరు సిద్ధార్థ నగర్‌కు చెందిన పులి శ్రీనివాస్ రెడ్డి బెంగళూర్‌లో ఆంధ్రాబ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తూ భార్య మయూరితో కలిసి అక్కడే ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారులు పులి సునంద్ కుమార్ రెడ్డి(21) ట్రిపుల్ ఐటీలో సీఎస్డీ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ట్రిపుల్ ఐటీ పలాస్ నివాస్ ఓల్డ్ బాయ్స్ హస్టల్లోని రూమ్ నెంబర్ 267లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి స్నేహితుడు సాయి సాహిత్ ఫోన్ చేస్తే సునంద్ స్పందించలేదు. అతను ఇదే విషయాన్ని స్నేహితుడు రోహిత్‌కు తెలియజేశాడు. మధ్యాహ్నం సెమిస్టర్ పరీక్ష ఉండటంతో గురువారం ఉదయం 11.45 గంటలకు రోహిత్ వెళ్లి సునంద్ గది డోర్ కొట్టినా స్పందించలేదు. ఎంత పిలిచినా పలకకపోవడంతో కిటీకిలోంచి చూడగా సునంద్ బెడ్‌షీట్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో గచ్చిబౌలి పోలీసులు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకటేశ్ ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహంతో పాటు రెండు సూసైడ్ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకటి తన తల్లిదండ్రులకు రాసి ఉంది. ‘అమ్మా.. నాన్న.. నేను ఈ లోకంనుంచి వెళ్లిపోతున్నాను. నన్ను క్షమించండి. మీరంటే నాకు ఎంతో ఇష్టం. కానీ మీ తరుఫున బంధువులంటే నాకు ఇష్టం లేదు.. వారు కేవలం అవసరానికి వచ్చి వెళ్లేవారు.. భారతీయ బంధుత్వ వ్యవస్థ బాగా లేదు..’ అని ఒక లేఖలో రాశాడు. మహేశ్.. యు ఆర్ మై డాక్టర్ సునంద్ రెడ్డి హీరో మహేశ్ బాబుకు వీరాభిమాని. అతని గది నిండా మహేశ్ ఫొటోలు అంటించినట్లు పోలీసులు తెలిపారు. ఒత్తిడికి లోనైనప్పుడు గదిలోకి వెళ్లి మహేశ్ బాబు సినిమాలు చూస్తాడని స్నేహితులు తెలిపారు. ‘నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు మీ సినిమాలే చూస్తాను.. మీరంటే నాకు ఎంతో ఇష్టం. మీరే నా డాక్టర్, మీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు....’ అంటూ రాసిన లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య కలకలం
సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పులి సునందకుమార్‌రెడ్డి అనే విద్యార్థి గురువారం బలవన్మరణం చెందాడు. ఎవరూ లేని సమయంలో కాలేజీ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మానసిక ఒత్తిడితోనే సునందకుమార్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి స్వస్థలం గుంటూరు జిల్లా అని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అంతర్జాతీయ వేదికపై ట్రిపుల్ఐటీ విద్యార్థిని
రాయదుర్గం: బ్యాంకాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ విద్యార్థిని సౌమ్య రావత్ పరిశోధనాత్మక పత్ర సమర్పణ చేశారు. ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన 24వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మల్టీమీడియా మోడలింగ్ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ‘ఫైండ్ మీ ఏ స్కై: ఏ డేటా డ్రివెన్ మెథడ్ ఫర్ కలర్ కన్సిస్టెడ్ స్కై సెర్చ్ అండ్ రీప్లేస్మెంట్’ అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రశంసలు అందుకుకున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థినికి ఈ అవకాశం రావడం విశేషమని అధ్యాపకులు అభినందించారు. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం
-
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం
సాక్షి, వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అదృశ్యం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా ఇరుసుమందకు చెందిన అనిత ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి అనిత కనిపించడం లేదని తోటి విద్యార్థులు తెలిపారు. విద్యార్థి అదృశ్యంతో ట్రిపుల్ ఐటీ అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్కే వ్యాలీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
పులివెందుల: వైఎస్సార్ జిల్లా పులివెందులలో ట్రిపుల్‌ఐటీలో ఓ విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసింది. సుమియా అనే విద్యార్థిని వ్యాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది సుమియాను దగ్గరలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసేముందు తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్రిపుల్ ఐటీ విద్యార్థికి ఆర్థికసాయం
హిందూపురం అర్బన్ : విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ అన్నారు. హైదరాబాద్ బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో సీటు సాధించి ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్న విద్యార్థినికి ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఆర్థికసాయం అందించి ఆదుకున్నారు. లేపాక్షి మండలం నాయనపల్లికి చెందిన కృష్ణారెడ్డి కుమార్తె కీర్తిరెడ్డి ట్రిపుల్æఐటీ ప్రవేశానికి ఫీజు రూ.15 వేలు చెల్లించాల్సి ఉండగా ఆ మొత్తాన్ని రెడ్డి సంక్షేమం అందజేసింది. కార్యక్రమంలో సప్తగిరి కళాశాల ప్రిన్సిపల్ ఈశ్వర్‌రెడ్డి, సభ్యులు అనిల్‌కుమార్‌రెడ్డి, మదన్‌గోపాల్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థికి ‘నాసా’ ఆహ్వానం
హైదరాబాద్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఆహ్వానం మేరకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి కొంకటి ప్రశాంత్ అమెరికా వెళ్లనున్నారు.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రశాంత్ స్వస్థలం మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గం నంగునూరు మండలం ఘన్సూర్. ఈ నెల 18 నుంచి 22 వరకు అమెరికాలోని సాన్ జావున్ సిటీలో నాసా సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా ప్రశాంత్‌ను ‘నాసా’ ఆహ్వానించింది. అయితే ఆర్థిక ఇబ్బందులను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం తరపున రూ.2 లక్షల చెక్కును ఆదివారం అందజేశారు. -
ఎంతపని చేశావమ్మా..
- హాస్టల్ గదిలో విషంతాగిన ట్రిపుల్ ఐటీ విద్యార్థిని - కడప రిమ్స్‌కు తరలించేలోపు మృతి - సెల్‌ఫోన్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు - ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు దారితీసిందని ప్రాథమికంగా నిర్ధారణ - గుండెలవిసేలా విలపించిన తల్లిదండ్రులు.. ట్రిపుల్ ఐటీలో విషాదం వేంపల్లె : కొద్ది నెలల్లో విద్య పూర్తి చేసుకుని ఉద్యోగమో.. లేక ఉన్నత చదువుకో వెళ్లాల్సిన వడ్డె భారతి (21) ఆత్మహత్య చేసుకుందని తెలియగానే ట్రిపుల్‌ఐటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులందరూ ఒక్క సారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కంప్యూటర్ సైన్స్ నాలుగవ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని చదువులో బాగా రాణించేది. పదవ తరగతిలో మంచి మార్కులతో ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం హనుమతుగుండం గ్రామానికి చెందిన మద్దిలేటి, అలివేలమ్మ దంపతుల మూడవ కుమార్తె. తండ్రి బేల్దార్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది నెలల్లో భారతి ట్రిపుల్‌ఐటీలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుంటుందని, తమ కష్టాలు తీరుతాయనే సంతోషంలో ఉన్న వారికి సోమవారం అందిన వార్త షాక్‌కు గురి చేసింది. హుటాహుటిన కడపలోని రిమ్స్‌కు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘ఆదివారం రాత్రి ఫోన్లో మాట్లాడాం.. సంతోషంగా కబుర్లు చెప్పుకున్నాం.. ఏం జరిగిందో ఏమో.. మా పిల్ల ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు.. ధైర్యవంతురాలు ఇలా చేసిందంటే మేం నమ్మలేకపోతున్నాం.. సారూ.. పూర్తిగా విచారించండి’ అంటూ వారు గుండెలవిసేలా రోదించారు. ఓ దశలో తల్లి అలివేలమ్మ నిల్చోలేక కుప్పకూలిపోయింది. అయ్యో భారతి.. తన పని తాను చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లని భారతి సోమవారం హాస్టల్ గదిలో విషం తాగిందని తెలియగానే ఒక్క సారిగా విద్యార్థులు నివ్వెరపోయారు. ప్రథమ చికిత్స అనంతరం భారతిని హుటాహుటిన ట్రిపుల్ ఐటీ అంబులెన్స్‌లో కడప రిమ్స్‌కు తరలించారు. ‘దేవుడా..భారతికి ఏం కాకూడ దు.. ఆరోగ్యంగా తిరిగి రావాలి’ అంటూ ప్రార్థించారు. ‘బాగా చదివే అమ్మాయి.. ఇలా చేసిందేమిటి.. ఏమైనా కష్టమొచ్చింటే ధైర్యంగా చెప్పి ఉండాల్సింది.. అందరం మద్దతుగా నిలిచేవాళ్లం. ఇలా చే సి కన్నవాళ్లకు గుండె కోత మిగిల్చడం బాగోలేదు’ అంటూ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు హాస్టల్ గదిలో భారతి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. సెల్ఫోన్లో ఉన్న మెసేజ్‌ల ఆధారంగా ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ‘విష్ యూ హ్యాపీ బర్త్‌డే.. కను రెప్పలు కలుసుకోవాలని కలవరుపడుతున్నాయి.. కనుమరుగై నీ రూపాన్ని కనుపాపకు చూపాలని నా ప్రయత్నం.. ఈ ప్రయాణం నీ కోసం (ఆర్)...’ అనే మెసేజ్ డ్రాప్ట్‌లో ఉన్నట్లు తెలిసింది. సెల్‌ఫోన్, సూసైడ్ నోట్ స్వాధీనం పులివెందుల రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐ ప్రదీప్ నాయుడు ట్రిపుల్ఐటీ హాస్టల్లోని భారతి ఉండే 72వ గదిని పరిశీలించారు. ఆమె వాడుతున్న సెల్‌ఫోన్, విషం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ పుస్తకంలో రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘ఆరోగ్యం బాగోలేదు.. ఈ రోజు నేను క్లాస్‌కు రాను అని చెప్పింది.. దీంతో మేము క్లాస్‌కు వెళ్లిపోయాం.. మధ్యాహ్నం గదికి వచ్చాము.. భారతి పడిపోయి ఉంది.. సారోళ్లకు విషయం చెప్పాము.. భారతి బాగా చదివేది.. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి దాకా మంచి మార్కులు తెచ్చుకుంది.. ఎందుకిలా చేసిందో అర్థం కావడం లేదు..’ అని ఆమె గదిలో ఉంటున్న విద్యార్థినులు కావ్య, సుందరమ్మ, ఇతర విద్యార్థులు కన్నీటిసుడుల మధ్య గద్గద స్వరంతో చెప్పారు. నాన్నా.. అమ్మా క్షమించండి ఈ ఆఖరి క్షణంలో ఏమి రాయాలో అర్థం కాలేదు. నాన్నా.. చేతులు వణుకుతున్నాయి.. మీ ఆశలను, నమ్మకాలను చంపేసి వెళుతున్నందుకు నన్ను క్షమించండి.. అమ్మా.. నీకు కడుపు కోత పెట్టిస్తున్నందుకు క్షమించమ్మా.. నావల్ల ఎవరూ బాధపడటం నాకు ఇష్టం లేదు.. అందుకే ఇలా చేస్తున్నా.. - క్షమాపణలతో మీ భారతి.. -
విద్యార్థిని అనుమానాస్పద మృతి
వేంపల్లె: వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. చివరి సంవత్సరం చదువుతోన్న విద్యార్థిని హాస్టల్లో వస్మాల్ లిక్విడ్ తాగి బలవన్మరణానికి యత్నించింది. అయితే ఆ అమ్మాయి అనారోగ్యంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది అని కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. -
భవనంపై నుంచి కిందపడిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి
వేంపల్లె (వైఎస్సార్ జిల్లా) : స్నేహితులతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మొదటి అంతస్థు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన సల్మాన్ అనే విద్యార్థి ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ నాలుగవ ఏడాది చదువుతున్నాడు. కాగా శనివారం మొదటి అంతస్థులో నిలబడి స్నేహితులతో మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అతనిని కడపలోని రిమ్స్‌కు తరలించారు. విషయం తెలిసిన పోలీసులు రిమ్స్‌కు వెళ్లి విచారిస్తున్నారు. -
ట్రిపుల్ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఇడుపులపాయ : వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఓ విద్యార్థిని గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల ప్రకారం.. ట్రిపుల్‌ఐటీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న వాణి(18) అనే విద్యార్థిని గురువారం బిల్డింగ్ రెండవ అంతస్తు నుంచి దూకటంతో చేయి విరిగింది. వెంటనే అక్కడున్నవారు ఆమెను 108లో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రాణాపాయమేమి లేదని తెలిపారు. కాగా విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
బాసర IIIT విద్యార్ధిని ఆత్మహత్య
-
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి
ఆదిలాబాద్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు రైలు కింద పడి స్థానిక ట్రిపుల్ ఐటీ విద్యార్థి గాంధీ మరణించారు. చిత్తురు జిల్లాకు చెందిన గాంధీ ట్రిపుల్ ఐటీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. స్వస్థలం నుంచి గాంధీ రైల్లో వస్తు ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డాడు. దాంతో గాంధీ అక్కడికక్కడే మరణించారు. రైల్వే స్టేషన్ అధికారులు వెంటనే స్పందించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో గాంధీ మృతదేహన్ని ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. విద్యార్థి మృతి వార్త తెలియడం బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే బాసర ట్రిపుల్ ఐటీలో ఇటీవల నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి కె.నాగరాజు కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి నాగరాజు ఆదివారం ఉదయం ఆత్మహత్యకు యత్నించారు. సహచర విద్యార్థులు వెంటనే స్పందించి కళాశాల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై నాగరాజును నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మరణించాడు. నల్గొండ జిల్లా కనగల్ మండలం గౌరారం ఏంచ గ్రామానికి చెందిన నాగరాజు బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సహచర విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే అధికారు నిర్లక్ష్యం వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.