వేంపల్లె (వైఎస్సార్ జిల్లా) : స్నేహితులతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మొదటి అంతస్థు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన సల్మాన్ అనే విద్యార్థి ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఇంజనీరింగ్ నాలుగవ ఏడాది చదువుతున్నాడు. కాగా శనివారం మొదటి అంతస్థులో నిలబడి స్నేహితులతో మాట్లాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అతనిని కడపలోని రిమ్స్‌కు తరలించారు. విషయం తెలిసిన పోలీసులు రిమ్స్‌కు వెళ్లి విచారిస్తున్నారు.