వేంపల్లె: వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. చివరి సంవత్సరం చదువుతోన్న విద్యార్థిని హాస్టల్‌లో వస్మాల్ లిక్విడ్ తాగి బలవన్మరణానికి యత్నించింది. అయితే ఆ అమ్మాయి అనారోగ్యంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది అని కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.