
ఆత్మహత్యకు పాల్పడిన నాగరాజు
ఆదిలాబాద్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి నాగరాజు ఆదివారం ఉదయం ఆత్మహత్యకు యత్నించారు. సహచర విద్యార్థులు వెంటనే స్పందించి కళాశాల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులు వెంటనే అప్రమత్తమై నాగరాజును నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మరణించాడు.
నల్గొండ జిల్లా కనగల్ మండలం గౌరారం ఏంచ గ్రామానికి చెందిన నాగరాజు బాసర ట్రిపుల్ ఐటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సహచర విద్యార్థులను పోలీసులు విచారిస్తున్నారు. అయితే అధికారు నిర్లక్ష్యం వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.