బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థికి ‘నాసా’ ఆహ్వానం | NASA Invites Basara IIIT Student | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థికి ‘నాసా’ ఆహ్వానం

Published Sun, May 8 2016 5:55 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

NASA Invites Basara IIIT Student

హైదరాబాద్‌ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఆహ్వానం మేరకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి కొంకటి ప్రశాంత్ అమెరికా వెళ్లనున్నారు.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రశాంత్ స్వస్థలం మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గం నంగునూరు మండలం ఘన్సూర్.

ఈ నెల 18 నుంచి 22 వరకు అమెరికాలోని సాన్ జావున్ సిటీలో నాసా సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా ప్రశాంత్‌ను ‘నాసా’ ఆహ్వానించింది. అయితే ఆర్థిక ఇబ్బందులను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం తరపున రూ.2 లక్షల చెక్కును ఆదివారం అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement