prasanth
-
చిరంజీవితో ఛాన్స్ వచ్చిందని మాకు హ్యాండిచ్చాడు: డైరెక్టర్
కోలీవుడ్ టాప్‌స్టార్ ప్రశాంత్ చాలా గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం అందగన్. తాజాగా తమిళ్లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ హిట్ సినిమా అంధాధున్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసింది. ఇందులో నటి సిమ్రాన్, ప్రియా ఆనంద్, కార్తీక్, యోగిబాబు, సముద్రఖని, ఊర్వశీ,కేఎస్.రవికుమార్, వనితా విజయ్‌కుమార్ నటించారు.ఈ చిత్రాన్ని స్టార్ మూవీస్ పతాకంపై శాంతి త్యాగరాజన్ నిర్మించగా, త్యాగరాజన్ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ చిత్ర థ్యాంక్స్ గివింగ్ సమావేశాన్ని చైన్నెలో మేకర్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో చిత్ర దర్శకుడు త్యాగరాజన్ మాట్లాడుతూ అందగన్ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన మీడియా మిత్రులకు ధన్యవాదాలన్నారు. పాజిటివ్ రివ్యూలే చిత్ర విజయానికి కారణం అన్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ కథానాయకుడు అయినా , అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఇచ్చామన్నారు. ఈ చిత్రానికి ముందుగా మోహన్‌రాజాను దర్శకుడిగా ఎంపిక చేశామని, మూడు నెలలు చర్చలు జరిగిన తరువాత ఆయన తెలుగులో చిరంజీవితో చిత్రం చేసే అవకాశం రావడంతో వెళ్లిపోయారన్నారు. దీంతో తానే దర్శకత్వం బాధ్యతలను చేపట్టినట్లు చెప్పారు. చిరంజీవి లాంటి పెద్ద హీరోతో ఛాన్స్ వస్తే ఎవరూ వదులుకోలేరని, దీంతో ఆ విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని ఆయన అన్నారు. మోహన్‌రాజా-చిరంజీవి కాంబినేషన్లో గాడ్‌ఫాదర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇదే వేదికపై హీరో ప్రశాంత్ పెళ్లి టాపిక్ కూడా వచ్చింది. అందుకు బదులిచ్చిన త్యాగరాజన్ అందగన్ చిత్రం మంచి హిట్ అయ్యిందని, ఇక సినిమా విషయాలను పక్కన పెట్టి ప్రశాంత్ పెళ్లి పైనే పూర్తిగా దృష్టి పెట్టనున్నట్లు, త్వరలోనే మంచి అమ్మయితో ప్రశాంత్ పెళ్లి ఉంటుందని చెప్పారు. కాగా నటుడు ప్రశాంత్ మాట్లాడుతూ అందగన్ చిత్ర విజయానికి ప్రధాన కారణం దర్శకుడు త్యాగరాజన్, నటీనటులని పేర్కొన్నారు. ఈ చిత్రం తనకు కమ్ బ్యాక్ అనీ, ఇకపై చాలా చిత్రాలు చేస్తానని ఆయన అన్నారు. తొలి ముద్దు, జోడి, జీన్స్ వంటి చిత్రాలతో ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. -
సినిమా ఇంటర్వ్యూ.. ప్రముఖ హీరోకి ఫైన్ వేసిన పోలీసులు
ప్రముఖ హీరోకి జరిమానా పడింది. కొత్త సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఊహించని విధంగా పోలీసులకు ఇతడు చిక్కాడు. దీంతో ఫైన్ వేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసుకోవాలి కదా బ్రో అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: Kalki 2898 AD: గుడ్ న్యూస్.. చవక రేటుకే కల్కి టికెట్స్)'జీన్స్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ హీరో ప్రశాంత్.. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయాడు. తెలుగులో 'వినయ విధేయ రామ' చిత్రంలో సహాయ పాత్ర చేశాడు. ప్రస్తుతం విజయ్ 'ద గోట్' మూవీలోనూ కీ రోల్ చేశాడు. ఇది కాకుండా 'అంధగన్' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఇది ఆగస్టు 9న థియేటర్లలోకి రానుంది.ఈ క్రమంలోనే బైక్‌పై చెన్నై రోడ్లపై తిరుగుతూ ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో చెన్నై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. రూ.2000 చలాన్ వేసినట్లు ట్విటర్లో పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉండగా అప్పుడెప్పుడో హిందీలో వచ్చిన 'అంధాదున్' సినిమాకి ఇది రీమేక్. తెలుగులోనూ నితిన్ హీరోగా దీన్ని చాన్నాళ్ల క్రితమే రీమేక్ చేశారు. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: చిరంజీవి కంటే తమిళ హీరో విజయ్‌నే బెస్ట్: కీర్తి సురేశ్)#ActionTaken on reported violation.#GreaterChennaiTraffic https://t.co/bAZecvNYgn pic.twitter.com/TqJVoLi9MT— Greater Chennai Traffic Police (@ChennaiTraffic) August 1, 2024 -
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాకి టైటిల్ ఇదే
-
భార్య వల్లే హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో
ఒకప్పుడు సౌత్ ఇండియా స్టార్ నటుడిగా ప్రశాంత్ గుర్తింపు పొందాడు. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించినా తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా మెప్పించాడు. ప్రశాంత్ ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ కుమారుడు. 17 సంవత్సరాల వయసులోనే ప్రశాంత్ 'వైగాసి పోరంతచ్చు' అనే తమిళ సినిమాతో నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. తమిళంలో ఒకప్పుడు అగ్ర కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన స్టార్ ప్రశాంత్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జీన్స్ సినిమా ఆయన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అజిత్, విజయ్ తదితరులు కెరీర్లో గుర్తింపు పొందుతున్న సమయంలో ప్రశాంత్‌కు వారికి మించిన గుర్తింపు ఉండేది. సినీ కెరియర్ భారీ విజయాలతో దూసుకుపోతున్న సమయంలో తన భార్యతో వివాదాలు. ఆపై పదే పదే సినిమా పరాజయాలతో స్టార్ డమ్ కోల్పోయాడు. విడాకుల సమయంలో వచ్చిన వివాదాల వల్ల ప్రశాంత్ కెరీర్ పాతాళానికి పడిపోయింది. తెలుగులో వినయ విధేయ రామ చిత్రంలో రామ్ చరణ్‌కు అన్నగా, కలెక్టర్ పాత్రలో ప్రశాంత్ కనిపించాడు. తాజాగ తమిళ ప్రముఖ రాజకీయ, సినీ విశ్లేషకుడు కాంతరాజ్ ప్రశాంత్ గురించి పలు విషయాలు వెల్లడించారు. 'సినీ ఇండస్ట్రీలో ప్రతి పదేళ్లకు ఒకసారి మార్పులు వస్తూనే ఉంటాయి. కొంతమంది నటీనటులు మాత్రమే కాలంతో ముందుకు సాగగలుగుతున్నారు. నటనలో ప్రశాంత్‌కు ప్రత్యేకంగా చేయాల్సిన పనిలేదు. ప్రశాంత్ తన తండ్రి త్యాగరాజ్ డైరెక్షన్లో 'అంధాగన్' సినిమా తీస్తున్నారు. ఇంతటితో ఆయన సినిమాలు చేయకపోవడమే మంచిది. (ఇదీ చదవండి: చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్ హిట్ డైరెక్టర్‌కు ఛాన్స్) అతను వేరే ఉద్యోగం చూసుకోవడం మంచిది. నేడు సినిమాలు మారిపోయాయి. అతనిలో గతంలో ఉన్న హీరోయిజం లేదు. ఇప్పుడు సినిమా బాగుంటేనే చూస్తారు. అంతేకాకుండా ప్రశాంత్ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చాయి. అది ప్రశాంత్ సినీ కెరీర్‌పై భారీ ప్రభావం చూపాయి. వాటి తర్వాత ప్రశాంత్ సినిమాల నుంచి తప్పుకున్నాడు.' అని కాంతరాజ్ పేర్కొన్నాడు. భార్యతో గొడవలు ప్రశాంత్‌కి 2005లో వ్యాపారవేత్త కుమార్తె గృహలక్ష్మితో పెళ్లయింది. వారిద్దరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే కొద్దిరోజుల్లోనే వారిద్దరి మధ్య సమస్యలు తలెత్తాయి. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. వీరిద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగినట్లు సమాచారం. తర్వాత గృహలక్ష్మి తన పుట్టింటికి వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. పాపను చూసేందుకు వారి ఇంటికి వెళ్లినా ప్రశాంత్‌ను అనుమతించలేదు. తన భార్యను తిరిగి పొందేందుకు ఆయన కోర్టును ఆశ్రయించాడు. అలా వారిద్దరి మధ్య అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే ఇంతలోనే మరో అనుకోని సంఘటన జరిగింది. ప్రశాంత్ జీవితంలో ఊహించని ఘటన నారాయణన్ అనే వ్యక్తి వారి గొడవలోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ కంటే ముందే గృహలక్ష్మిని పెళ్లి చేసుకున్నానని రంగంలోకి దిగాడు. గృహలక్ష్మి తనను 1998లోనే పెళ్లాడిందన్నది అతని వాదన. దీంతో విడాకుల కోసం హీరో ప్రశాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కోర్టు విడాకులు మంజూరు చేసిందని సమాచారం. తన కూతురుని తన దగ్గర వదిలేయాలని ప్రశాంత్ కోరగా కోర్టు అంగీకరించలేదు. విడాకుల సమయంలో వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రశాంత్ ఇమేజ్ను భారీగా దెబ్బతీశాయి. ఇలా వెండితెర లైమ్‌లైట్‌లో కనిపించకుండా పోయాడు. ఆయనతో పాటు వచ్చిన అజిత్, విజయ్ లాంటి స్టార్లందరూ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు. -
భారత్‌లో మొదటి టెస్లా కార్ ఇతనిదే..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీలలో టెస్లా ఒకటి. దాని వ్యవస్థాపకుడు, సీఈవో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్‌ను కలిశారు. భారత్ ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ మార్కెట్‌గా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా ఇప్పటికీ దేశంలో అధికారికంగా లేదు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ టెస్లా భారత్‌కు వస్తున్నట్లు ప్రకటించారు. అయితే టెస్లా అధికారికంగా భారతదేశంలోకి రానప్పటికీ, భారతీయ రోడ్లపైకి టెస్లా కార్లు ఎప్పుడో వచ్చేశాయి. దేశంలో మొదటి టెస్లా కారును ఓ వ్యక్తి 2017లో దిగుమతి చేసుకున్నారు. ఆయనేం ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీ లేదా గౌతమ్ సింఘానియా కాదు. టెస్లాను కొనుగోలు చేసిన మొదటి భారతీయుడు ఎస్సార్ గ్రూప్ సీఈఓ ప్రశాంత్ రుయా. టెస్లా మోడల్ X SUV బ్లూ కలర్ కార్‌ను ఆయన దిగుమతి చేసుకున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని నడుపుతూ ఆయన చాలా సార్లు కనిపించారు. ఎస్సార్‌ను స్థాపించిన రుయా కుటుంబంలోని రెండవ తరానికి చెందినవారు ప్రశాంత్ రుయా. ఎస్సార్ గ్లోబల్ ఫండ్ లిమిటెడ్‌లో ఆయన ఏకైక పెట్టుబడిదారు. ఎస్సార్ సంస్థను 1969లో ప్రశాంత్ రుయా తండ్రి శశి రుయా, మేనమామ రవి రుయాలు స్థాపించారు. ఇదీ చదవండి: అవును.. భారత్‌కు టెస్లా వచ్చేస్తోంది! స్పష్టం చేసిన ఎలాన్ మస్క్ -
గేమ్ ఛేంజర్?
-
మన జీవితాల్లోనివే ఈ సినిమాలో ఉన్నాయి – సుష్మిత కొణిదెల
‘‘మన జీవితంలో మనం అనుభవించే నిజమైన భావోద్వేగాలు, లవ్, ఫెంటాస్టిక్ డ్రామా ‘శ్రీదేవి శోభన్‌బాబు’లో ఉంటాయి. ప్రశాంత్‌తో పాటు యూనిట్ అంతా ఈ సినిమాకి మనసు పెట్టి పని చేశారు’’ అని సుస్మిత కొణిదెల అన్నారు. సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ జంటగా ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకలో సుస్మిత మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి (చిరంజీవి) ఆశీస్సులతో మా ‘శ్రీదేవి శోభన్‌బాబు’ని మీ ‘శ్రీదేవి శోభన్‌బాబు’గా థియేటర్స్‌కి తెస్తున్నాం’’ అన్నారు. ‘‘చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఓ కాఫీ షాప్‌లో సుష్మిత అక్కని కలిసి, ‘నేను చిరంజీవి సార్ అభిమానిని.. డైరెక్టర్ అవుదామని ప్రయతి్నస్తున్నాను’ అన్నాను. అలా చెప్పిన ఐదు రోజులకే అక్క నుంచి కాల్ వచ్చింది.. నాన్న (చిరంజీవి) కథ వింటానన్నారు.. ఇంటికి రమ్మన్నారని అక్క అన్నారు. అక్కడికి వెళ్లగానే చిరంజీవిగారు సొంత మనిలా నన్ను పలకరించారు’’ అన్నారు. ‘‘అచ్చమైన తెలుగు సినిమా ‘శ్రీదేవి శోభన్‌బాబు’’ అన్నారు సంతోష్ శోభన్. ‘‘మా చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు విష్ణు ప్రసాద్. -
చెక్క పెట్టెలో చిన్నారుల మృతదేహాలు
సాక్షి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం చిన్నయ్య పాలెం లో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు చివరికి చెక్క పెట్టెలో విగత జీవులుగా కనిపించారు. అనూహ్యంగా గ్రామంలోని పాడుబడిన పాఠశాలలో ఉన్న చెక్కపెట్టలో వీరిద్దరు శవాలుగా కనిపించారు. కాగా బేలెం ప్రశాంత్ కుమార్, చెడెం కార్తీక్ కనిపించడం లేదంటూ గత నెల 26న వారి తల్లిదండ్రులు జడ్డంగి పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన చిన్నారుల గురించి వెతకటం ప్రారంభించారు. అయితే ఆడుకుంటూ వీరిద్దరూ పెట్టెలోకి దూరి ఉంటారని, మూత మూసుకుపోవడంతో బయటకు రాలేక చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు పెట్టెలో.. -
అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు పెట్టెలో..
-
బోధన్‌లో దారుణం
సాక్షి, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తతో పాటు అత్త, మరిది కలిసి ఆరు నెలల గర్భవతిపైన కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితురాలు సీతాలు తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. రాకాసిపేట్‌లో నివసిస్తోన్న గైని ప్రశాంత్, సీతాలు భార్యాభర్తలు. పెళ్లి అయిన నెల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. కల్యాణ లక్ష్మీ చెక్కు వచ్చాక ఇష్టం లేని పెళ్లి చేశారని సీతాలుకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. కుట్రలో భాగంగానే ఆమెను అంతమొందించేందుకు ఈ ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం అత్త, భర్త పరారయ్యారు. బోధన్ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమకథ ముగిసింది
ఓ అందమైన ప్రేమకథ ముగిసిపోయింది. మరి.. ఎప్పుడు చూడొచ్చు అంటే త్వరలో విడుదల అంటున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కేవీఆర్. మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘దొరసాని’. రాజశేఖర్, జీవితల చిన్నకుమార్తె శివాత్మిక ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా.. ముఖ్యంగా తెలంగాణ భాష సంస్కృతులను ప్రతిబింబించేలా సినిమాను తెరకెక్కించారట మహేంద్ర. ఈ సినిమాకు ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. -
నల్లగొండ గుట్టపై విషాదం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హసన్కుర్తి గ్రామానికి చెందిన గౌతమి(20), ప్రశాంత్(21) ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కమ్మరపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం గుట్టపై ఓ చెట్టుకు రెండు మృతదేహాలు వేలాడుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో దొరికిన సిమ్ కార్డు ఆధారంగా పోలీసుల వివరాలు సేకరించి, ప్రేమజంట కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గుట్టపైన ఆనవాళ్లను బట్టి ప్రేమికుల ఆత్మహత్య నెల క్రితం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. -
యువ రైతు బలవన్మరణం
వరంగల్ రూరల్: వరంగల్ రూరల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఓ యువరైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఎన్కమూరి ప్రశాంత్(24) శుక్రవారం రాత్రి పత్తి చేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. శనివారం ఉదయమైనా అతడు ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. తనకున్న మూడెకరాల్లో వేసిన పంటలు ఆశాజనకంగా లేక, రూ.1.70 లక్షల వరకు ఉన్న అప్పులు తీర్చేదారి కానరాకే అతడు ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబసభ్యులు అంటున్నారు. farmer suicide, debts, prasanth, యువరైతు, ఆత్మహత్య, ప్రశాంత్, -
ఉపాధ్యాయుడి అవతారమెత్తిన కలెక్టర్ !
తిరువనంతపురం: జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. విద్యార్థులు చదువును కోల్పోకుండా ఉండేందుకు ఏకంగా తన కార్యాలయాన్నే బడిగా మార్చేశారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని మలపరంబ హైస్కూల్ మూతపడటంతో విద్యార్థులకు పాఠశాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. పరిస్థితిపై దృష్టిసారించిన కలెక్టర్.. కార్యాలయంలో సగభాగాన్ని పాఠాలు చెప్పుకొనేందుకు ఇవ్వడంతోపాటు... విద్యార్థులకు ముఖ్యమైన సందేశాలను అందిస్తూ ఓరోజు తాను సైతం పాఠాలను చెప్పారు. కేరళ కోజిఖోడ్ జిల్లాలోని మలపరంబ ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ రెండు రోజుల క్రితం మూతపడింది. కొన్ని కారణాలతో స్కూలును మూసివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. కేవలం పాఠశాల భవనం లేదన్న కారణంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందని ఆలోచించిన జిల్లా కలెక్టర్.. విషయంపై మరింత దృష్టి సారించారు. తన కార్యాలయంలో సగభాగాన్ని తాత్కాలికంగా బడికి కేటాయించారు. దీంతో ఉపాధ్యాయులు సైతం అక్కడికే వచ్చి పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు కూడా చేయించారు. అయితే ఎల్డీఎఫ్ ప్రభుత్వం పాఠశాలను స్వాధీనం చేసుకున్న అనంతరం విద్యార్థులు తిరిగి పాఠశాలకు వెళ్లే అవకాశం ఉందని, స్కూల్ ఆందోళనల కారణంగా మూసివేయలేదని ఏఈవో చెప్పగా... త్వరలో పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని విద్యాశాఖ మంత్రి సి రవీంద్రనాథ్ వివరణ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు మలపరంబ స్కూల్ నిర్వహణా వ్యవహారాలను ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధీనంలోకి తీసుకుంటుందని చెప్పారు. కాన్ఫరెన్స్ హాల్లోకి చేరిన విద్యార్థులకు మొదటిరోజు కోజికోడ్ కలెక్టర్ ప్రశాంత్ పాఠాలు చెప్పారు. ప్రపంచంలో బతకాలంటే డబ్బు కన్నా విజ్ఞానం ఎంతో అవసరమన్నారు. ఇప్పటికే పాఠశాలను అధీనంలోకి తీసుకునేందుకు కావలసిన అన్ని ప్రక్రియలను ప్రభుత్వం పూర్తి చేసిందని, త్వరలో స్కూల్ ను స్వాధీనం చేసుకుంటుందని ప్రశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థికి ‘నాసా’ ఆహ్వానం
హైదరాబాద్ : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ ఆహ్వానం మేరకు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి కొంకటి ప్రశాంత్ అమెరికా వెళ్లనున్నారు.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రశాంత్ స్వస్థలం మెదక్ జిల్లా సిద్ధిపేట నియోజకవర్గం నంగునూరు మండలం ఘన్సూర్. ఈ నెల 18 నుంచి 22 వరకు అమెరికాలోని సాన్ జావున్ సిటీలో నాసా సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనవలసిందిగా ప్రశాంత్‌ను ‘నాసా’ ఆహ్వానించింది. అయితే ఆర్థిక ఇబ్బందులను మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం తరపున రూ.2 లక్షల చెక్కును ఆదివారం అందజేశారు. -
క్రికెట్ బంతి కోసం వెళ్లి..
బనగానపల్లి(కర్నూలు): క్రికెట్ బంతి కోసం వెళ్లిన చిన్నారి కుళాయి గుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు కుటుంబ సభ్యులు ఈ రోజు ఈస్టర్ కావడంతో చర్చికి వెళ్లి వచ్చారు. అనంతరం ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో అతని నాలుగేళ్ల కుమారుడు ప్రశాంత్ ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బంతి కుళాయి గుంతలో పడటంతో.. దాని కోసం వెళ్లిన చిన్నారి గుంతలో పడిపోయాడు. గుంతలో నీళ్లు ఉండటంతో అందులో మునిగి మృతిచెందాడు. విగతజీవిగా మారిన చిన్నారిని గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
రైలు కిందపడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం ఓ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పెద్దపల్లిలోని మదర్ థెరెసా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రశాంత్ గా పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాలోని చిట్యాలకు చెందిన ప్రశాంత్ పెద్దపల్లిలో చదువుతున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు, సంఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారులో వచ్చి దొరికి'పోయాడు'
నటుడు బాలప్రశాంత్ మృతి కేసు దర్యాప్తులో వెల్లడి? హైదరాబాద్: స్కోడా కారులో రావడమే వర్ధమాన సినీ నటుడు బాలప్రశాంత్ మృతికి కారణమైందా... అంటే అవుననే చెబుతున్నాయి పోలీసు విచారణలో వెల్లడవుతున్న విషయాలు. పోలీసుల కథనం ప్రకారం...ఈనెల 13న ప్రియురాలి భర్త అనంతపురంలోని ఒక ఫంక్షన్‌కు వెళ్లాడు. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా రమ్మని ప్రియుడు బాలప్రశాంత్ని పవర్నగర్లో ఉండే వివాహిత ఆహ్వానించింది. అయితే ఆమె భర్త... బావమరిదికి ఫోన్‌చేసి ఇంట్లో మీ అక్క ఒక్కతే ఉందని, ఇంటికి వెళ్లి ఉండాలని చెప్పాడు. దీంతో అతను ఇంటికి వెళ్లి గడియ కొట్టగా తాను నిద్రపోతున్నానని ఇంటికి వెళ్లిపోమని సోదరుడికి ఆమె చెప్పింది. ఈ విషయాన్ని బావమరిది.. బావకు చెప్పడంతో అనుమానం వచ్చిన ఆయన సెల్లార్లో వాహనాలు ఉన్నాయేమో చూడమని చెప్పాడు. స్కోడా కారు ఉందని బావమరిది చెప్పడంతో అనుమానం వచ్చిన భర్త... తన అక్కాబావలను తన ఇంటికి వెళ్లమని చెప్పాడు. వారు వెళ్లగా గడియ తీసిన వివాహిత ‘నన్ను ప్రశాంతంగా ఉండనీయండి’.. అంటూ చేతులు కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి నుంచి ఆమె సెల్‌ఫోన్ ద్వారా ‘ ప్లీజ్ ఎలాగైనా తప్పించుకో’ అని బాలప్రశాంత్కు మెస్సేజ్ పెట్టగా.. అలాగే చేస్తా అని అతను తిరిగి మేస్సేజ్ పెట్టాడు. తర్వాత ఇంట్లోంచి తప్పించుకొని వెళ్లే క్రమంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందపడి మృతి చెందినట్టు భావిస్తున్నారు. కాగా, మూసాపేటలోని ఆంజనేయనగర్‌లో బాలప్రశాంత్ నిర్వహిస్తున్న డ్యాన్స్ స్కూల్‌కు తన కూతురిని రెండేళ్లుగా పంపిస్తున్న ఆమె అతడికి దగ్గరైందని తెలిసింది. -
ర్యాగింగ్ జరిగిందని రుజువైతే...కేసు మారుస్తాం: సీఐ
విశాఖ : విశాఖ భీమిలీలోని ఎన్ఆర్ఐ కళాశాల హాస్టల్ భవనంపై నుంచి పడి గాయపడిన ఫార్మసీ విద్యార్థి ప్రశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈనెల 19న ప్రశాంత్ భవనం పైనుంచి పడిపోయిన విషయం తెలిసిందే. అతడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కేర్ ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. మరోవైపు ర్యాగింగ్ వల్లే తమ కుమారుడు మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ తట్టుకోలేకే తన తమ్ముడు భవనంపైనుంచి దూకాడని ప్రశాంత్ సోదరి సంధ్య ఆరోపించారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చేవరకూ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయటానికి వీలు లేదని పట్టుబట్టారు. కాగా ప్రశాంత్ వారం క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసి సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని.. హాస్టల్లో ఉండలేకపోతున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదని సమాచారం. ఈ ఘటనపై భీమిలీ సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ విద్యార్థి మృతిపై ప్రస్తుతం ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశామన్నారు. ఒకవేళ ర్యాగింగ్ జరిగిందని రుజువైతే ...ర్యాగింగ్ కేసుగా మార్చుతామని ఆయన తెలిపారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కాగా కళాశాల యాజమాన్యం మాత్రం తమ కళాశాలలో ర్యాగింగ్ అనేదే లేదని, ప్రశాంత్ మానసిక ఒత్తిడిని తట్టుకోలేకే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని చెబుతోంది. -
‘సెలైంట్’ గా మనసులు దోచిన ‘మెలడీ’
షార్ట్ ఫిల్మ్ పుష్పక్... ఈ సెలైంట్ సినిమా పేరు చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది... తెలుగు సినిమాలలో అదొక కొత్త ట్రెండ్... ప్రేక్షకుల మనసుల్ని నిశ్శబ్దంగా దోచేసింది... ఆ తరవాత తెలుగులో మళ్లీ సెలైంట్ మూవీ రాలేదు. అయితే లఘుచిత్రాలలో మాత్రం చాలామంది నిశ్శబ్ద చిత్రాలు తీస్తున్నారు. ప్రశాంత్ కూడా అలాంటిదే ఒక చిత్రం తీశారు. ‘సెలైంట్ మెలడీ’ పేరుతో తీసిన ఈ చిత్రం మొదటి నెలలోనే పది లక్షల వ్యూస్‌తో ‘వైవా’ లఘుచిత్రం తరవాత అంత పేరు సంపాదించుకుంది. పాలకొల్లుకి చెందిన 26 సంవత్సరాల ప్రశాంత్, హైదరాబాద్‌లోని సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పట్టా పుచ్చుకున్నారు. తండ్రి బిల్డర్‌గా పని చేస్తున్నారు. తల్లి గవర్నమెంట్ స్కూల్లో టీచర్. ‘‘మా పేరెంట్స్ నేను సినిమాల్లోకి వెడతాననగానే ముందు షాకయ్యారు. తరవాత నాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు’’ అంటూ తల్లిదండ్రుల ఆశీస్సుల గురించి వివరించారు ప్రశాంత్. ఈ చిత్ర కథ గురించి - ‘‘ఒకసారి నేను హోటల్‌కి వెళ్లినప్పుడు, ఒక జంటను చూశాను. వారి మధ్య సంభాషణ చేతి సైగలతో నడుస్తోంది. మూగవారేమో అనుకున్నాను. అంతలోనే ఆయన వెయిటర్ని పిలిచి ఆర్డర్ ఇవ్వడంతో, ఆయనకు మాటలు వచ్చు, ఆవిడ మూగది అని అర్థం అయ్యింది. నా మనసు వారి వైపు ఆరాధనగా చూసింది. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని లఘుచిత్రం తీయాలనిపించింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా హీరో సందీప్ కిషన్‌కి కథ చెప్పాను. తనకి బాగా నచ్చి ఈ సినిమాని తనే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. అలా ఈ చిత్రం తీశాం’’ అంటారు ప్రశాంత్. సెలైంట్ మెలడీ’ లఘుచిత్రానికి యాహూ, ఎన్డిటివి వాళ్లు ‘బెస్ట్ మూవీ’ అంటూ పబ్లిసిటీ ఇచ్చారు. ఇందులో సినిమాలకి వాడే కెమెరాలు వాడారు. ‘‘సినిమా బడ్జెట్ రూ. 75000 వేలు. రెండు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. ఇందులో హీరోయిన్గా నటించిన ప్రాచీ థాకరేను ఫేస్బుక్ ద్వారా సంప్రతించాను. అయితే ఆ అమ్మాయికి తెలుగు రాదని చెప్పింది. ఇది ఏ భాషా అవసరం లేని సెలైంట్ మూవీ అని చెప్పడంతో ఆ అమ్మాయి అంగీకరించింది’’ అన్నారు ప్రశాంత్. ప్రాచీ థాకరే నిఫ్ట్‌లో చదువుతున్నారు. అందువల్ల తన కాస్ట్యూమ్స్‌ను తానే సొంతంగా డిజైన్ చేసుకున్నారు. ప్రొడ క్షన్ వర్క్ బాగా నేర్చుకున్న ప్రశాంత్, చదువుతూన్న రోజుల్లోనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. ‘ఆడపిల్లల్ని చంపుకోవడం’ గురించి సందేశాత్మకమైన పాట ఒకటి తీశారు. కొన్ని డాక్యుమెంటరీలూ చేశారు. చాలా సినిమాలకు యాడ్స్ చేశారు. ‘‘బీటెక్ పూర్తవ్వగానే అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరదామనుకున్నాను. కానీ, నేను అనుకున్న యూనివర్శిటీలో సీటు రాకపోవడంతో ఇక్కడే ఉండిపోయాను’’ అంటున్న ప్రశాంత్... సినిమా రంగానికి చెందిన వారితో పరిచయాలు పెంచుకుని, సినిమాల గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించుకున్నారు. ‘‘నేను చేసిన లఘుచిత్రాలను కాంపిటీషన్‌కి పంపినప్పుడు అక్కడ ఐదుగురు న్యాయనిర్ణేతలు నన్ను ప్రశంసించారు. అయితే నా చిత్రం వారు ఇచ్చిన అంశానికి భిన్నంగా ఉండటంతో బెస్ట్ కన్సొలేషన్ ప్రైజ్ ఇచ్చారు. దాసరిగారు నన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు’’ అని వివరించారు ప్రశాంత్. ప్రస్తుతం రెండు పెద్ద చిత్ర నిర్మాణ సంస్థల సినిమాలకు డెరైక్టర్‌గా సంతకం చేశారు ప్రశాంత్. చదువులో టాపర్ అయిన ప్రశాంత్ తన వెండి తెర కలల్ని నిజం చేసుకొనే ప్రయత్నంలో కృషి చేస్తున్నారు. ‘‘నాటాలో నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో ‘సెలైంట్ మెలడీ’ ఫైనలిస్ట్‌లోకి చేరడం, అందులో నేను మోస్ట్ ప్రామిసింగ్ బడ్డింగ్ డెరైక్టర్ అవార్డు అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా 18వ పుచోన్ ఇంటర్నేషనల్ ఫెన్టాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘సైలంట్ మెలడీ’ని స్క్రీనింగ్‌కి ఎంపిక కావడం నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన’’ అంటారు ప్రశాంత్. - డా. పురాణపండ వైజయంతి -
కూలికి వెళితే.. ప్రాణం పోరుుంది
భూపాలపల్లి, న్యూస్‌లైన్ : కలప అక్రమ రవాణా అన్నెపున్నం తెలియని ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఫారెస్ట్ అధికారులు వస్తున్నారనే సమాచారంతో స్మగ్లర్ కంగారుతో ద్విచక్రవాహనం నడపగా అదుపుతప్పింది. దీంతో వెనకాల టేకు దుంగలను పట్టుకుని కూర్చున్న యువకుడు కిందపడగా, అతడిపై దుంగలు పడడంతో తీవ్రగాయూలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామశివారులోని పెద్దమ్మగుడి సమీపంలో జరిగింది. భూపాలపల్లి సీఐ ఎల్ ఆదినారాయణ, మృతుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం... రేగొండ మండలం కాకర్లపల్లి శివారు మడతపల్లికి చెందిన సిరంగి రామయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు ప్రశాంత్(18) వారం రోజుల క్రితం వెంకటాపూర్ మండలంలోని పెద్దాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన సల్ల సతీష్ శనివారం రాత్రి సుమారు 12 గంటలకు ప్రశాంత్ వద్దకు వెళ్లి కూలీకి రావాల్సిందిగా కోరాడు. తన ద్విచక్ర వాహనంపై ఒక టేకు దుంగను పట్టుకుని కూర్చుంటే కూలీ ఇస్తానని చెప్పాడు. దీంతో ప్రశాంత్ అతడితో బయల్దేరాడు. వారితోపాటు అదేగ్రామానికి చెందిన పొన్నం సమ్మయ్య, చేను కిరణ్ రెండు టేకు దుంగలతో మరో ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలకు ముందు అదే గ్రామానికి చెందిన ఆవుల సంపత్, గుండగాని రాజు మరో ద్విచక్రవాహనంపై పైలట్‌గా బయల్దేరారు. మూడు ద్విచక్ర వాహనాలు పెద్దాపూర్ నుంచి గణపురం మండలం చెల్పూరు మీదుగా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామశివారులోని పెద్దమ్మ గుడి దాటాయి. ఈ క్రమంలోనే పైలట్‌గా వ్యవహరిస్తున్న సంపత్, రాజుకు అటవీశాఖ అధికారులు కనిపించారు. ఈ విషయాన్ని వారు టేకు దుంగలను తీసుకొస్తున్న వారికి చేరవేశారు. అప్పటికే వారు దగ్గరికి రావడంతో చేసేదిలేక సమ్మయ్య, కిరణ్ తమ ద్విచక్రవాహనంతోపాటు రెండు టేకు దుంగలను రోడ్డుపైనే వదిలి పారిపోయారు. అటవీ అధికారులు ఆ బైక్‌ను, కలప దుంగలను స్వాధీనం చేసుకుని భూపాలపల్లి వైపు వస్తున్నారు. మరో ద్విచక్రవాహనంపై వస్తున్న సతీష్, ప్రశాంత్ అటవీ అధికారుల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్రవాహనాన్ని పొలాలబాట వైపు తిప్పారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కిందపడిపోగా ప్రశాంత్‌పై టేకు దుంగ పడింది. దుంగ సుమారు 6 ఫీట్లు ఉండడంతో అతడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యూరుు. రక్తస్రావం అధికంగా జరిగింది. సతీష్ గమనించి ప్రశాంత్‌ను మోరంచపల్లి గ్రామం వరకు ఎత్తుకుని రాగా మార్గమధ్యలోనే ప్రశాంత్ మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని మోరంచపల్లి క్రాస్‌రోడ్డు వద్దే వదిలి సతీష్ పరారయ్యూడు. తెల్లవారుజామున ఆరు గంటలకు గ్రామస్తులు మృతదేహాన్ని చూసి సమాచారం అందించగా మృతుడి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు సల్ల సతీష్, ఆవుల సంపత్, గుండగాని రాజు, పొన్నం సమ్మయ్య, చేను కిరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆదినారాయణ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు. స్మగ్లర్ల కొత్త పంథా.. అటవీశాఖ అధికారులు, పోలీసులు కొంతకాలంగా కలప తరలిస్తున్న ఎడ్లబండ్లు, ట్రాలీ, డీసీఎం వ్యాన్లను భారీ మొత్తంలో పట్టుకున్నారు. దీంతో కలప స్మగ్లర్లు కొంత పంథాను అవలంభిస్తున్నట్లు తెలిసింది. ద్విచక్ర వాహనంపై దుంగలను తరలిస్తే అటవీ అధికారులు గాలింపు చేపడుతున్న సమయంలో సులువుగా తప్పించుకోవచ్చని భావించినట్లు సమాచారం. దుంగను వదిలి పారిపోవచ్చు... లేదా దుంగను దాచి అధికారులు వెళ్లేంత వరకు బైక్‌పై దర్జాగా తిరగొచ్చని భావించారు. ఇందు కోసం ద్విచక్ర వాహనం వెనుక టైర్‌కు ఇరువైపులా కంపెనీ ఇచ్చే షాకప్జల్ కాకుండా అదనంగా మరో షాకప్జల్ను ఏర్పాటు చేసుకున్నారు. మృతుడు ప్రశాంత్ ప్రయాణించిన, అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న రెండు ద్విచక్ర వాహనాలకు ఇలాగే ఉండడం బట్టి స్మగ్లర్లు వీటిని కలప దందా కోసమే ప్రత్యేకంగా చేరుుంచినట్లు తెలుస్తోంది.