కారులో వచ్చి దొరికి'పోయాడు' | actor prasanth went to lover house in car | Sakshi
Sakshi News home page

కారులో వచ్చి దొరికి'పోయాడు'

Published Mon, Nov 16 2015 8:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:34 PM

కారులో వచ్చి దొరికి'పోయాడు'

కారులో వచ్చి దొరికి'పోయాడు'

నటుడు బాలప్రశాంత్ మృతి కేసు దర్యాప్తులో వెల్లడి?
 

 హైదరాబాద్: స్కోడా కారులో రావడమే వర్ధమాన సినీ నటుడు బాలప్రశాంత్ మృతికి కారణమైందా... అంటే అవుననే చెబుతున్నాయి పోలీసు విచారణలో వెల్లడవుతున్న విషయాలు. పోలీసుల కథనం ప్రకారం...ఈనెల 13న ప్రియురాలి భర్త అనంతపురంలోని ఒక ఫంక్షన్‌కు వెళ్లాడు. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా రమ్మని ప్రియుడు బాలప్రశాంత్‌ని పవర్‌నగర్‌లో ఉండే వివాహిత ఆహ్వానించింది. అయితే ఆమె భర్త... బావమరిదికి ఫోన్‌చేసి ఇంట్లో మీ అక్క ఒక్కతే ఉందని, ఇంటికి వెళ్లి ఉండాలని చెప్పాడు. దీంతో అతను ఇంటికి వెళ్లి గడియ కొట్టగా తాను నిద్రపోతున్నానని ఇంటికి వెళ్లిపోమని సోదరుడికి ఆమె చెప్పింది.
 

 ఈ విషయాన్ని బావమరిది.. బావకు చెప్పడంతో అనుమానం వచ్చిన ఆయన సెల్లార్‌లో వాహనాలు ఉన్నాయేమో చూడమని చెప్పాడు.  స్కోడా కారు ఉందని బావమరిది చెప్పడంతో అనుమానం వచ్చిన భర్త... తన అక్కాబావలను తన ఇంటికి వెళ్లమని చెప్పాడు. వారు వెళ్లగా గడియ తీసిన వివాహిత ‘నన్ను ప్రశాంతంగా ఉండనీయండి’.. అంటూ చేతులు కోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడి నుంచి ఆమె సెల్‌ఫోన్ ద్వారా ‘ ప్లీజ్ ఎలాగైనా తప్పించుకో’ అని బాలప్రశాంత్‌కు మెస్సేజ్ పెట్టగా.. అలాగే చేస్తా అని అతను తిరిగి మేస్సేజ్ పెట్టాడు. తర్వాత ఇంట్లోంచి తప్పించుకొని వెళ్లే క్రమంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందపడి మృతి చెందినట్టు భావిస్తున్నారు. కాగా, మూసాపేటలోని ఆంజనేయనగర్‌లో బాలప్రశాంత్ నిర్వహిస్తున్న డ్యాన్స్ స్కూల్‌కు తన కూతురిని రెండేళ్లుగా పంపిస్తున్న ఆమె అతడికి దగ్గరైందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement