కూలికి వెళితే.. ప్రాణం పోరుుంది | a person died in wood smuggling | Sakshi
Sakshi News home page

కూలికి వెళితే.. ప్రాణం పోరుుంది

Published Mon, Dec 16 2013 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM

a person died in wood smuggling

 భూపాలపల్లి, న్యూస్‌లైన్ :  కలప అక్రమ రవాణా అన్నెపున్నం తెలియని ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఫారెస్ట్ అధికారులు వస్తున్నారనే సమాచారంతో స్మగ్లర్ కంగారుతో ద్విచక్రవాహనం నడపగా అదుపుతప్పింది. దీంతో వెనకాల టేకు దుంగలను పట్టుకుని కూర్చున్న యువకుడు కిందపడగా, అతడిపై దుంగలు  పడడంతో తీవ్రగాయూలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామశివారులోని పెద్దమ్మగుడి సమీపంలో జరిగింది. భూపాలపల్లి సీఐ ఎల్ ఆదినారాయణ, మృతుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం... రేగొండ మండలం కాకర్లపల్లి శివారు మడతపల్లికి చెందిన సిరంగి రామయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు ప్రశాంత్(18) వారం రోజుల క్రితం వెంకటాపూర్ మండలంలోని పెద్దాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు.

అదే గ్రామానికి చెందిన సల్ల సతీష్ శనివారం రాత్రి సుమారు 12 గంటలకు ప్రశాంత్ వద్దకు వెళ్లి కూలీకి రావాల్సిందిగా కోరాడు. తన ద్విచక్ర వాహనంపై ఒక టేకు దుంగను పట్టుకుని కూర్చుంటే కూలీ ఇస్తానని చెప్పాడు. దీంతో ప్రశాంత్ అతడితో బయల్దేరాడు. వారితోపాటు అదేగ్రామానికి చెందిన పొన్నం సమ్మయ్య, చేను కిరణ్ రెండు టేకు దుంగలతో మరో ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలకు ముందు అదే గ్రామానికి చెందిన ఆవుల సంపత్, గుండగాని రాజు మరో ద్విచక్రవాహనంపై పైలట్‌గా బయల్దేరారు. మూడు ద్విచక్ర వాహనాలు పెద్దాపూర్ నుంచి గణపురం మండలం చెల్పూరు మీదుగా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామశివారులోని పెద్దమ్మ గుడి దాటాయి.

  ఈ క్రమంలోనే పైలట్‌గా వ్యవహరిస్తున్న సంపత్, రాజుకు అటవీశాఖ అధికారులు కనిపించారు. ఈ విషయాన్ని వారు టేకు దుంగలను తీసుకొస్తున్న వారికి చేరవేశారు. అప్పటికే వారు దగ్గరికి రావడంతో చేసేదిలేక సమ్మయ్య, కిరణ్ తమ ద్విచక్రవాహనంతోపాటు రెండు టేకు దుంగలను రోడ్డుపైనే వదిలి పారిపోయారు. అటవీ అధికారులు ఆ బైక్‌ను, కలప దుంగలను స్వాధీనం చేసుకుని భూపాలపల్లి వైపు వస్తున్నారు. మరో ద్విచక్రవాహనంపై వస్తున్న సతీష్, ప్రశాంత్ అటవీ అధికారుల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్రవాహనాన్ని పొలాలబాట వైపు తిప్పారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కిందపడిపోగా ప్రశాంత్‌పై టేకు దుంగ పడింది. దుంగ సుమారు 6 ఫీట్లు ఉండడంతో అతడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యూరుు. రక్తస్రావం అధికంగా జరిగింది.

సతీష్ గమనించి ప్రశాంత్‌ను మోరంచపల్లి గ్రామం వరకు ఎత్తుకుని రాగా మార్గమధ్యలోనే ప్రశాంత్ మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని మోరంచపల్లి క్రాస్‌రోడ్డు వద్దే వదిలి సతీష్ పరారయ్యూడు. తెల్లవారుజామున ఆరు గంటలకు గ్రామస్తులు మృతదేహాన్ని చూసి సమాచారం అందించగా మృతుడి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు సల్ల సతీష్, ఆవుల సంపత్, గుండగాని రాజు, పొన్నం సమ్మయ్య, చేను కిరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆదినారాయణ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు.
 స్మగ్లర్ల కొత్త పంథా..
 అటవీశాఖ అధికారులు, పోలీసులు కొంతకాలంగా కలప తరలిస్తున్న ఎడ్లబండ్లు, ట్రాలీ, డీసీఎం వ్యాన్లను భారీ మొత్తంలో పట్టుకున్నారు. దీంతో కలప స్మగ్లర్లు కొంత పంథాను అవలంభిస్తున్నట్లు తెలిసింది. ద్విచక్ర వాహనంపై దుంగలను తరలిస్తే అటవీ అధికారులు గాలింపు చేపడుతున్న సమయంలో సులువుగా తప్పించుకోవచ్చని భావించినట్లు సమాచారం. దుంగను వదిలి పారిపోవచ్చు... లేదా దుంగను దాచి అధికారులు వెళ్లేంత వరకు బైక్‌పై దర్జాగా తిరగొచ్చని భావించారు. ఇందు కోసం ద్విచక్ర వాహనం వెనుక టైర్‌కు ఇరువైపులా కంపెనీ ఇచ్చే షాకప్జల్ కాకుండా అదనంగా మరో షాకప్జల్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మృతుడు ప్రశాంత్ ప్రయాణించిన, అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న రెండు ద్విచక్ర వాహనాలకు  ఇలాగే ఉండడం బట్టి స్మగ్లర్లు వీటిని కలప దందా కోసమే ప్రత్యేకంగా చేరుుంచినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement