adi narayana
-
ఈయన ప్రపంచానికి ‘పక్కా లోకల్’గా!!
సాక్షి, ఒంగోలు: ‘సముద్రం జ్ఞానమైతే ఒక వెన్నెల రాత్రి పడవ మీద ప్రయాణించగలగటం ఒక మధురానుభూతి. జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి’ అనే డాక్టర్ మాచవరపు ఆదినారాయణ ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలుకు సమీపంలోని చవటపాలెం గ్రామ నివాసి. ఒంగోలు సీఎస్ఆర్ శర్మా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆదినారాయణ ఆ తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా చేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. ‘ఇండియన్ ట్రావెలర్ ఇన్ రష్యా’ అనే పేరుతో రష్యన్ పత్రికలు డాక్టర్ ఆదినారాయణ గురించి వ్యాసాలు రాశాయి. జీవిత విశేషాలు డాక్టర్ ఆదినారాయణ ప్రయాణానుభవాలకి, ఆయన మైండ్ సెట్‌కీ ఒక కలయిక ఉంటుంది. ‘ఎగుడుదిగుడు కాలిబాటలు నా స్వర్గద్వారాలు’ అంటూ తన జీవిత లక్ష్యాన్ని చాటిచెప్పారాయన. ‘ఎన్ని దేశాలు తిరిగినా, కొత్త ప్రదేశం అంటూ ఏదీ అనిపించలేదు. విదేశం అంటూ ఏదీ లేదు. దూరంగా ఉన్న స్వదేశాలే అన్నీ. ప్రపంచమంతా ఒక గుండ్రని గ్రామం’ అంటారు. విశ్వమానవీయతను చాటే డాక్టర్ ఆదినారాయణ ప్రపంచానికి పక్కా లోకల్‌గా అనిపిస్తాడు. ఆయన స్వయంగా శిల్పి, చిత్రకారుడు. కొండలు, పర్వతాలు అధిరోహించటం, వాగులు, వంకలు, లోయల్లో ప్రయాణించడం, గ్రామీణ జీవితంలో లీనం కావడం, అక్కడి వనరుల్లోనే సర్దుకుపోవడం ఆయన తన ప్రయాణాల్లో నేర్చుకున్న అంశాలు. ఇప్పటి వరకు 7 ఖండాల్లో 30కి పైగా దేశాల్లో ఆయన పాదయాత్రలు చేశారు. ఈ క్రమంలో 30 వేల కిలోమీటర్లకు పైగా నడిచారు. ఆయన నడిచినంతమేరా ఆయా ప్రాంతాల భౌగోళిక విశేషాలు, కళ, సంస్కృతి, మతం, సారస్వతం, ఆహారం, ఆహార్యం, గృహ నిర్మాణం, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, కుటుంబ జీవిత నిర్మాణం, జీవన శైలి, వృత్తులు, విరామ సమయాల కాలక్షేపాలు పరిశీలిస్తారు. తన పరిశీలనలోకి వచ్చిన విషయాలను అక్షరీకరించి పుస్తకాలు రాస్తారు. ‘కదిలే పంజరం లాంటి ఈ శరీరంలో స్థిరంగా ఉండలేక, బంధాల్ని తెగ్టొట్టుకుని బయటికి వచ్చిన ప్రయాణాల పక్షిని నేను’ అన్న సొంత విచక్షణ కలిగిన డాక్టర్ ఆదినారాయణ కాలినడకతో ప్రపంచాన్ని చుట్టివచ్చారు. తన మీద ప్రభావం చూపిన వ్యక్తుల గురించి చెబుతూ.. ‘‘మా తాతయ్య వైకుంఠ పెరుమాళ్లు మాదిరిగా పాటలు పాడుకుంటూ, ప్రకృతిని పూజించుకుంటూ పూర్తిస్థాయి దేశదిమ్మరిగా మారిపోదాం’ అనేవారు. డిగ్రీ చదువుకునే రోజుల్లో లోకసంచారిగా ఉండాలని తీర్మానించుకున్నా. ‘ఒరే చిన్న గాలోడా’ అని చిన్నప్పుడు మా అమ్మ పిలిచేది. ఆ పిలుపును సార్థకం చేసుకున్నా’’ అని చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రయాణాల్లో కొన్ని.. ఆసియా ఖండంలోని నేపాల్(2009), భూటాన్(2010), ఇరాన్(2011), చైనా(2013), ఐరోపాలోని స్వీడన్(2012), నార్వే(2014), ఇటలీ(2014), బ్రిటన్(2015), స్కాట్లాండ్(2015), ఉత్తర అమెరికాలోని మెక్సికో(2014), దక్షిణ అమెరికాలోని బ్రెజిల్(2016), ఆఫ్రికాలోని నైజీరియా(2013), ఆస్ట్రేలియాలోని తాస్మానియా(2015)లో ఆయన చేసిన ప్రయాణాల తాలూకు విశేషాలను ఆయన రాసిన ‘భూభ్రమణ కాంక్ష’లో పొందుపరిచారు. ఇటీవల రష్యా పత్రికల్లో ఆయన ప్రముఖంగా నిలిచారు. రష్యన్ కాలమిస్టు దిమిత్రో త్యికోటిన్ ‘వెలుగు–విజయం’ పేరుతో రాసిన వ్యాసం సాహిత్య లోకంలో చర్చనీయాంశమైంది. ఏ దేశం వెళితే ఆ దేశ భాష నేర్చుకునే స్కాలర్ జిప్సీ, ఇండియన్ మార్కోపోలోగా పేరు గడించిన డాక్టర్ ఎం.ఆదినారాయణ మన జిల్లా వాసి కావడం విశేషం. ‘తిరిగే తుమ్మెదకే తేనె దొరుకుతుంది’ – డాక్టర్ మాచవరపు ఆదినారాయణ -
అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్ : అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో మంగళవారం సాయంత్రం అప్పుల బాధ తాళలేక సింహం ఆదినారాయణ(40) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సుకన్య, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదినారాయణ కూలి మగ్గం నేసేవాడు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. కుమారుడు కష్ణమోహన్, కుమార్తె మౌనికలను ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ చదివిస్తున్నాడు. కుటుంబ పోషణ, పిల్లల చదువు కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షల దాకా అప్పులు చేశాడు. మగ్గం పని గిట్టుబాటు కాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలోనని రోజూ మదనపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మగ్గానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మతుని కుటుంబాన్ని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజినేయులు, వార్డు కౌన్సిలర్ రామాంజినేయులు పరామర్శించారు. -
వేధింపుల కేసులో భర్తకు జైలు
తిరుపతి లీగల్: భార్యను వేధించిన కేసులో భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.5వేలు జరి మానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి గురువారం తీర్పు చెప్పారు. వివరాలిలా..తిరుపతి ఎస్టీ వీనగర్కు చెందిన ఎన్.ఆదినారాయణ 19 86 నవంబర్ 12న, వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం టీ.సుండుపల్లికి చెందిన సుశీలదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఆమె దత్తత తల్లి 5 తులాల బంగారు నగలుకట్నంగా ఇచ్చింది. ఆది నారాయణ కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తుండగా, సుశీలదేవి పోస్టల్ అసిస్టెంట్‌గా పని చేస్తోం ది. ఏడాది గడిచాక భర్త మద్యానికి బానిసయ్యాడు. ఆమె పేరున ఉన్న ఇంటి స్థలం తన పేరున రాయాలని, అదనపు కట్నం ఇవ్వాలని వేధించసాగాడు. సొమ్ము తీసుకున్న తర్వాత ఇతర దురలవాట్లకు ఖర్చు పెట్టేవాడు. 2009 డి సెంబర్ 29న భార్యపై దాడి చేసి ఇంటి నుంచి గెంటేశాడు. అయి నా ఆమెను వేధింపులకు గురిచేస్తుండటం తో బాధితురాలు తిరుపతి మహిళా పోలీ సులకు ఫిర్యాదు చేసింది. భర్త, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. భర్తపై నేరం రుజువు కావడంతో ఆదినారాయణకు శిక్ష విధిస్తూ, మిగిలిన ముగ్గురిపై కేసు కొట్టి వేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
కూలికి వెళితే.. ప్రాణం పోరుుంది
భూపాలపల్లి, న్యూస్‌లైన్ : కలప అక్రమ రవాణా అన్నెపున్నం తెలియని ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఫారెస్ట్ అధికారులు వస్తున్నారనే సమాచారంతో స్మగ్లర్ కంగారుతో ద్విచక్రవాహనం నడపగా అదుపుతప్పింది. దీంతో వెనకాల టేకు దుంగలను పట్టుకుని కూర్చున్న యువకుడు కిందపడగా, అతడిపై దుంగలు పడడంతో తీవ్రగాయూలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామశివారులోని పెద్దమ్మగుడి సమీపంలో జరిగింది. భూపాలపల్లి సీఐ ఎల్ ఆదినారాయణ, మృతుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం... రేగొండ మండలం కాకర్లపల్లి శివారు మడతపల్లికి చెందిన సిరంగి రామయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు ప్రశాంత్(18) వారం రోజుల క్రితం వెంకటాపూర్ మండలంలోని పెద్దాపూర్ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన సల్ల సతీష్ శనివారం రాత్రి సుమారు 12 గంటలకు ప్రశాంత్ వద్దకు వెళ్లి కూలీకి రావాల్సిందిగా కోరాడు. తన ద్విచక్ర వాహనంపై ఒక టేకు దుంగను పట్టుకుని కూర్చుంటే కూలీ ఇస్తానని చెప్పాడు. దీంతో ప్రశాంత్ అతడితో బయల్దేరాడు. వారితోపాటు అదేగ్రామానికి చెందిన పొన్నం సమ్మయ్య, చేను కిరణ్ రెండు టేకు దుంగలతో మరో ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ రెండు ద్విచక్ర వాహనాలకు ముందు అదే గ్రామానికి చెందిన ఆవుల సంపత్, గుండగాని రాజు మరో ద్విచక్రవాహనంపై పైలట్‌గా బయల్దేరారు. మూడు ద్విచక్ర వాహనాలు పెద్దాపూర్ నుంచి గణపురం మండలం చెల్పూరు మీదుగా భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామశివారులోని పెద్దమ్మ గుడి దాటాయి. ఈ క్రమంలోనే పైలట్‌గా వ్యవహరిస్తున్న సంపత్, రాజుకు అటవీశాఖ అధికారులు కనిపించారు. ఈ విషయాన్ని వారు టేకు దుంగలను తీసుకొస్తున్న వారికి చేరవేశారు. అప్పటికే వారు దగ్గరికి రావడంతో చేసేదిలేక సమ్మయ్య, కిరణ్ తమ ద్విచక్రవాహనంతోపాటు రెండు టేకు దుంగలను రోడ్డుపైనే వదిలి పారిపోయారు. అటవీ అధికారులు ఆ బైక్‌ను, కలప దుంగలను స్వాధీనం చేసుకుని భూపాలపల్లి వైపు వస్తున్నారు. మరో ద్విచక్రవాహనంపై వస్తున్న సతీష్, ప్రశాంత్ అటవీ అధికారుల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్రవాహనాన్ని పొలాలబాట వైపు తిప్పారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కిందపడిపోగా ప్రశాంత్‌పై టేకు దుంగ పడింది. దుంగ సుమారు 6 ఫీట్లు ఉండడంతో అతడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యూరుు. రక్తస్రావం అధికంగా జరిగింది. సతీష్ గమనించి ప్రశాంత్‌ను మోరంచపల్లి గ్రామం వరకు ఎత్తుకుని రాగా మార్గమధ్యలోనే ప్రశాంత్ మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని మోరంచపల్లి క్రాస్‌రోడ్డు వద్దే వదిలి సతీష్ పరారయ్యూడు. తెల్లవారుజామున ఆరు గంటలకు గ్రామస్తులు మృతదేహాన్ని చూసి సమాచారం అందించగా మృతుడి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడి తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు సల్ల సతీష్, ఆవుల సంపత్, గుండగాని రాజు, పొన్నం సమ్మయ్య, చేను కిరణ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆదినారాయణ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు. స్మగ్లర్ల కొత్త పంథా.. అటవీశాఖ అధికారులు, పోలీసులు కొంతకాలంగా కలప తరలిస్తున్న ఎడ్లబండ్లు, ట్రాలీ, డీసీఎం వ్యాన్లను భారీ మొత్తంలో పట్టుకున్నారు. దీంతో కలప స్మగ్లర్లు కొంత పంథాను అవలంభిస్తున్నట్లు తెలిసింది. ద్విచక్ర వాహనంపై దుంగలను తరలిస్తే అటవీ అధికారులు గాలింపు చేపడుతున్న సమయంలో సులువుగా తప్పించుకోవచ్చని భావించినట్లు సమాచారం. దుంగను వదిలి పారిపోవచ్చు... లేదా దుంగను దాచి అధికారులు వెళ్లేంత వరకు బైక్‌పై దర్జాగా తిరగొచ్చని భావించారు. ఇందు కోసం ద్విచక్ర వాహనం వెనుక టైర్‌కు ఇరువైపులా కంపెనీ ఇచ్చే షాకప్జల్ కాకుండా అదనంగా మరో షాకప్జల్ను ఏర్పాటు చేసుకున్నారు. మృతుడు ప్రశాంత్ ప్రయాణించిన, అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్న రెండు ద్విచక్ర వాహనాలకు ఇలాగే ఉండడం బట్టి స్మగ్లర్లు వీటిని కలప దందా కోసమే ప్రత్యేకంగా చేరుుంచినట్లు తెలుస్తోంది.