తిరుపతి లీగల్: భార్యను వేధించిన కేసులో భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.5వేలు జరి మానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జూనియర్ జడ్జి సంధ్యారాణి గురువారం తీర్పు చెప్పారు. వివరాలిలా..తిరుపతి ఎస్టీ వీనగర్‌కు చెందిన ఎన్.ఆదినారాయణ 19 86 నవంబర్ 12న, వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం టీ.సుండుపల్లికి చెందిన సుశీలదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో ఆమె దత్తత తల్లి 5 తులాల బంగారు నగలుకట్నంగా ఇచ్చింది. ఆది నారాయణ కార్వేటినగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తుండగా, సుశీలదేవి పోస్టల్ అసిస్టెంట్‌గా పని చేస్తోం ది. ఏడాది గడిచాక భర్త మద్యానికి బానిసయ్యాడు. ఆమె పేరున ఉన్న ఇంటి స్థలం తన పేరున రాయాలని, అదనపు కట్నం ఇవ్వాలని వేధించసాగాడు.
సొమ్ము తీసుకున్న తర్వాత ఇతర దురలవాట్లకు ఖర్చు పెట్టేవాడు. 2009 డి సెంబర్ 29న భార్యపై దాడి చేసి ఇంటి నుంచి గెంటేశాడు. అయి నా ఆమెను వేధింపులకు గురిచేస్తుండటం తో బాధితురాలు తిరుపతి మహిళా పోలీ సులకు ఫిర్యాదు చేసింది. భర్త, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. భర్తపై నేరం రుజువు కావడంతో ఆదినారాయణకు శిక్ష విధిస్తూ, మిగిలిన ముగ్గురిపై కేసు కొట్టి వేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
వేధింపుల కేసులో భర్తకు జైలు
Published Fri, Jul 31 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement
Advertisement