ధర్మవరం అర్బన్ : అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో మంగళవారం సాయంత్రం అప్పుల బాధ తాళలేక సింహం ఆదినారాయణ(40) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సుకన్య, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదినారాయణ కూలి మగ్గం నేసేవాడు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. కుమారుడు కష్ణమోహన్, కుమార్తె మౌనికలను ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ చదివిస్తున్నాడు. కుటుంబ పోషణ, పిల్లల చదువు కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షల దాకా అప్పులు చేశాడు.
మగ్గం పని గిట్టుబాటు కాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలోనని రోజూ మదనపడేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మగ్గానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మవరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మతుని కుటుంబాన్ని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజినేయులు, వార్డు కౌన్సిలర్ రామాంజినేయులు పరామర్శించారు.
అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య
Published Wed, Oct 12 2016 11:24 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement