అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారధి నగర్‌లో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారధి నగర్‌లో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పామిశెట్టి ఈశ్వరయ్య (55)కు ఇద్దరు కుమార్తెలు. మూడు మగ్గాలు ఉండగా కూలీ కూడా గిట్టుబాటు కాకపోవడంతో వాటిని అమ్మేశాడు. నేత పనులకు కూలీగా వెళుతూ రూ.4 లక్షల వరకు అప్పులు చేసి కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. అప్పుల బాధతో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.