ధర్మవరం: అనంతపురం జిల్లాలో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మవరం పట్టణం సూర్యప్రకాశ్‌రెడ్డి కాలనీలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
కాలనీకి చెందిన మారెప్ప(40) అనే చేనేత కార్మికుడు సరైన ఉపాధి దొరక్క కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు రూ.3 లక్షల వరకు ఉన్నాయి. రుణ భారం తీర్చే దారిలేక కుటుంబం నడిచే పరిస్థితి కష్టమవ్వడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం వేకువజామున ఇంటి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. మారెప్ప మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.