
చేనేత కార్మికుడి బలవన్మరణం
ధర్మవరం అర్బన్ :
ధర్మవరం సాయినగర్‌లో నివసిస్తున్న చేనేత కార్మికుడు నాగేంద్ర(21) బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడని పట్టణ పోలీసులు తెలిపారు. రాజమ్మ, కంబగిరి దంపతుల కుమారుడైన నాగేంద్ర డిగ్రీ వరకు చదువుకుని మగ్గం నేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. పండుగ రోజు తండ్రి తిట్టాడని మనస్తాపంతో ఇంట్లో మగ్గానికి తాడుతో ఉరేసుకుని తనువు చాలించాడు. బంధువులు గమనించి వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కేసు దర్యాప్తులో ఉంది.