eswaraiah
-
జగన్‌కు ఓటేయకపోతే నష్టపోతాం
సాక్షి, అమరావతి: స్వాతంత్య్రం వచ్చాక దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరిగింది, రాజ్యాంగ హక్కులు దక్కింది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమేనని, అదీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాకే సాధ్యమైందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య చెప్పారు. ఉత్తరాదిలో మోదీ ప్రాభవం తగ్గిపోవడంతో ఆయన దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై పడిందన్నారు. అలాంటి మనువాదులతో చంద్రబాబు జతకట్టడం దురదృష్టమని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు ఓటేయకపోతే అధికంగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జస్టిస్ ఈశ్వరయ్య స్పందన ఆయన మాటల్లోనే.. అగ్రవర్ణాల కుట్రలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు బలి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటరానివారుగా, ఆదివాసీలుగా, అగ్రకులాల సేవకులుగానే కాకుండా వారినొక వస్తువుగా చూశారు. వారికి ఎలాంటి అధికారాలుగానీ, హక్కులుగానీ ఇవ్వకుండా విధ్వంసం జరిగింది. మనువాదుల చాతుర్వర్ణ వ్యవస్థ ఆధారంగా వివక్షకు గురిచేశారు. విద్యావంతులై పాలనలో భాగస్వాములైతే తమ ఆధిçపత్యం దెబ్బతింటుందనే కుట్రతో అలాంటి సమాజాన్ని సృష్టించే ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో సామాజిక స్పృహ గల బుద్ధుడు, వేమన, నారాయణగురు, పెరియార్ రామస్వామి, జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేడ్కర్ వంటి యుగపురుషుల త్యాగంతో భారత రాజ్యాంగం ఏర్పడింది. జగన్ పాలనలోనే రాజ్యాంగ ఫలాలు అందాయి బడుగు, బలహీనవర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక, ఆర్టీక న్యాయం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం అందించాలన్న దృక్పథంతో రాసిన భారత రాజ్యాంగాన్ని అక్షరాలా అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఎన్ని కష్టాలకు ఓర్చి అయినా ఎదురులేని స్వచ్ఛమైన, శక్తిమంతమైన సంకల్పంతో రాజ్యాంగ ఫలాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందించే కృషి జరిగింది. విద్యాలయాల అభివృద్ధి, నాణ్యమైన విద్యాబోధనతో ఏపీ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా ఇంజనీర్లు, సైంటిస్టులు, డాక్టర్లను తయారు చేసేందుకు ఆయన అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.బడుగు, బలహీనవర్గాల భవిష్యత్తును సుసంపన్నం చేసేందుకు పెట్టుబడి కింద భావించి బడ్జెట్లో నిధులు ఖర్చు పెడుతున్నారు. 2019లో ఆయన మేనిఫెస్టోను చూసి అసాధ్యమన్నారు. కానీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జగన్ చట్టసభల్లోను సామాజికన్యాయం కలిగేలా ముందడుగు వేశారు. తన కుల, వర్గ ప్రయోజనాలూ ఖాతరు చేయకుండా సమానత్వం పాటించి రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాల్లో, కార్పొరేషన్ల పదవుల్లో 50 శాతం బీసీలకు అవకాశం కలి్పంచారాయన.అలాంటి నాయకుడిపై కొందరు తప్పుడు అభిప్రాయాలను సృష్టించే యత్నం చేస్తున్నారు. ఆ అభిప్రాయానికి గురై తప్పుచేస్తే మనకు మనమే నష్టం చేసుకున్నట్టు అవుతుంది. ధనం, విద్య, అధికార బదలాయింపు కోసం, పేదలు సంపన్నులు కావడానికి, విద్యావేత్తలు కావడానికి, ఆరోగ్యవంతులు కావడానికి పనిచేస్తున్న జగన్‌కు ఓటేయకపోతే ఏపీలోని బీసీలను దేశంలో ఎవరూ నమ్మరు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న మోదీ ఉత్తర భారతదేశంలో కూడా మోదీకి వ్యతిరేకత ఉంది. అక్కడ ఓడిపోతున్నందునే దక్షిణ భారతదేశంలో అబద్ధాలు మాట్లాడుతూ విలువల్లేని పార్టీలతో జతకట్టి, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఆయనకు మంత్రివర్గంపై, ప్రతిపక్షంపై, ప్రజలపై నమ్మకం లేదు. రిజర్వేషన్లు, కులగణనకు వ్యతిరేకమైన, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నా, బీసీల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నా, సామాజిక వెనుకబాటుకు గురైన ముస్లింల రిజర్వేషన్లు రద్దుచేస్తామని చెబుతున్నా, మతకలహాలు, అంతర్యుద్ధం, రక్తపాతం ద్వారా పబ్బం గడుపుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు.. అని జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు.జగన్‌కు ఓటేస్తేనే బీసీలకు మనుగడ మనువాద, చాతుర్వర్ణ, ఆర్ఎస్ఎస్, బీజేపీలతో చంద్రబాబు జతకట్టడం దురదృష్టకరం. బీసీలను మోసం చేయడంలో భాగంగానే బాబు, పవన్‌కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపారు. రాజ్యాంగ ఫలాలను దక్కకుండా కుదిరిన ఈ పొత్తును ఏపీ ప్రజలు చిత్తుచేయాలి. అతిజాగ్రత్తగా ఆలోచించి దుష్టచతుష్టయాన్ని నిరోధించాలి. జగన్‌ను బీసీలే రక్షించుకోవాలి. జగన్‌కు ఓటేయకపోతే మోసపోతాం. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా పూర్తిస్థాయిలో గెలిపిస్తే ఢిల్లీ పీఠం కదులుతుంది. జగన్ గెలిస్తే బీసీల బతుకులు బాగుపడుతాయి. కూటమి అధికారంలోకి వస్తే బీసీలు అంధకారంలోకి వెళ్తారు. ఈ యుద్ధంలో బీసీలే గెలుస్తారని, జగన్‌ను మరోమారు గెలిపిస్తారని నమ్ముతున్నాను. -
బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
తిరుపతి కల్చరల్: సామాజికన్యాయం పాటిస్తూ బడుగు, బలహీన, అణగారినవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా దేశంలో సంక్షేమ పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అఖిల భారత బీసీ సమాఖ్య అధ్యక్షుడు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. చంద్రబాబును నమ్మితే ప్రజలు మరోసారి తీవ్రంగా మోసపోతారని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మళ్లీ బానిస బతుకులు తప్పవని ఆయన హెచ్చరించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జస్టిస్ ఈశ్వరయ్య సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కూటమి కట్టిన చంద్రబాబు అనేక ఉచిత పథకాల హామీలు ఇచ్చి మోసంచేశారు. మళ్లీ నేడు అధికారం కోసం అదే బీజేపీ, జనసేనతో చంద్రబాబు జట్టు కట్టారు. అడ్డగోలు హామీలు, అసత్య ప్రచారంతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కుట్రలు పన్నారు. ప్రస్తుత ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కూటమి కల్పించే భ్రమలను నమ్మితే మళ్లీ బానిస బతుకులు తప్పవు. 2019లో అధికారంలోకి వచి్చన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీల్లో 99శాతం అమలుచేశారు. ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి సామాజికన్యాయం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి తీసుకువచ్చి పేదల పిల్లలకు మెరుగైన విద్యావసతులు కల్పించారు. కరోనా సమయంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనివిధంగా ప్రజలకు అండగా నిలిచి వారి ఆరోగ్య పరిరక్షణకు సీఎం జగన్ భరోసా కల్పించారు.’ అని జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒక సాహసోపేత నిర్ణయం ‘భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకురావడం ఒక సాహసోపేతమైన నిర్ణయం. దీనిపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సమన్యాయం చేసిన సీఎం జగన్మోహన్రెడ్డిపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తుంటే పచ్చపత్రికలు వారికి వంతపాడుతూ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెడుతున్నాయి.’ అని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు.ఉత్తరాదిలో బీజేపీ హవా తగ్గడంతోనే దక్షిణాదిలో అడ్డగోలు పొత్తులు ‘వెనుకబడిన వర్గాలను నమ్మించి పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ఆయా వర్గాలను నట్టేట ముంచి కార్పొరేట్లకు ఊడిగం చేస్తోంది. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ పబ్బంగడుపుతోంది. ముస్లిం రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగం మార్పు వంటి కుట్రలకు పాల్పడుతోంది. ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తోంది. అందువల్లే ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో బీజేపీ హవా తగ్గింది. దీంతో అధికారం కోసం దక్షిణ భారతదేశంలో అడ్డగోలుగా పొత్తులు పెట్టుకుంది.అధికారం కోసం పచ్చి అబద్ధాలతో మభ్యపెడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన విషయంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాలు చైతన్యంతో ఆలోచించి చిత్తుగా ఓడించాలి. సామాజికన్యాయం చేసే జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరింత అభివృద్ధి పథంలో పయనించాలి.’ అని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అధ్యయన కమిటీ జాతీయ మాజీ చైర్మన్ కృష్ణయ్య, సీనియర్ న్యాయవాది వందాడి వెంకటేశ్వర్లు, రాయచోటి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శశిరేఖ, వివిధ సంఘాల నాయకులు లవ్లీ వెంకటేష్, బుసగాని లక్ష్మయ్య, నాగరాజు, సదాశివ, వెంకటేష్ యాదవ్, మాసమయ్య పాల్గొన్నారు. -
కామ్రేడ్ ఈశ్వరయ్య ఇక లేరు.. రైలు కిందపడి..
సాక్షి, అనంతపురం: ఉపాధ్యాయుడిగా, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడిగా విశేష సేవలందించి ప్రజలకు సుపరిచితుడైన కామ్రేడ్ ఈశ్వరయ్య ఇక లేరు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రైలు కింద పడి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అనంతపురం నగరంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పామిడి మండలానికి చెందిన ఈశ్వరయ్య (65) రిటైర్డ్ ఉపాధ్యాయుడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పదవీ విరమణ పొందాక ఈశ్వరయ్య అనంతపురం హౌసింగ్ బోర్డులో భార్యతో కలిసి నివసిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున అనంతపురం రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ ఎస్ఐ విజయకుమార్ ఘటనపై కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పలు రంగాల్లో సేవలు ఈశ్వరయ్య బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. ఒకవైపు ఉపాధ్యాయుడిగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూనే.. మరోవైపు సామాజిక, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించారు. ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాలో జన విజ్ఞాన వేదిక ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. జర్నలిస్టు కావాలనుకొని మాసప్రతిక ప్రారంభించి ప్రజలను చైతన్యపరిచే అనేక వ్యాసాలు రాశారు. సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమంలో రచయితగా పాటలు రాశారు. జిల్లాలో బళ్లారి రాఘవ సాంస్కృతిక ఉత్సవాలను జయప్రదం చేయడంలో ఆయన కృషి ఎనలేనది. అందరూ ఆయన్ను ‘ఈశ్వరయ్య సార్’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. తీరని లోటు అనంతపురం అర్బన్: ఎన్.ఈశ్వరయ్య అకాల మరణం సాంస్కృతిక రంగానికి తీరని లోటని ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లప్ప, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులుతో పాటు పలువురు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సాంస్కృతిక ఉద్యమాలను నడిపారని గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి మృతి బాధకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
‘కిలిమంజారో’పై సీఎం జగన్ ఫొటో ప్రదర్శన
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని చిల్డ్రన్ స్పేస్ క్లబ్ ఆఫ్ ఇండియా సభ్యులైన కె.శంకరయ్య, శీలం ఈశ్వరయ్య టాంజానియా దేశంలో ప్రపంచంలోనే అత్యంత రెండో ఎత్తయిన కిలిమంజారో మంచు పర్వత శిఖరాన్ని అధిరోహించారు. ఈ నెల 17న హైదరాబాద్ నుంచి టాంజానియా బయలుదేరిన వారు 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ ఘనత సాధించారని క్లబ్ కార్యదర్శి జి.శాంతమూర్తి శనివారం గుంటూరులో వెల్లడించారు. కిలిమంజారో పర్వతంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోటోను ప్రదర్శించి శంకరయ్య తన అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే జాతీయ జెండాను సైతం ఎగురవేశారు. అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థలో శంకరయ్య స్పోర్ట్స్ కోచ్‌గా పని చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలోని మారుమూల తండా దాపుపల్లికి చెందిన శీలం ఈశ్వరయ్య డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. -
గవర్నర్‌తో జస్టిస్ ఈశ్వరయ్య భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఏపీ ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగల ఈశ్వరయ్య సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఆయన.. ఏపీలో ఉన్నత విద్య బలోపేతంపై చర్చించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన విషయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ప్రస్తావించారు. ఆయన ఉన్నత విద్య కమిషన్ చైర్మన్‌గా రాణించాలని తమిళిసై ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ విద్యావంతుల వేదిక కో ఆర్డినేటర్ విజయ్ భాస్కర్ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
కడపలో వ్యక్తి దారుణ హత్య
కడప: వైఎస్సార్ జిల్లా కడప ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గంధం ఈశ్వరయ్య (23) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంతో తారకరామా నగర్లో గురువారం రాత్రి చాంద్‌బాషా అనే వ్యక్తి ఇతడిని హత్య చేశాడు. రిమ్స్ మార్చురీకి మృతదేహాన్నితరలించారు. టౌన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బాధ్యతలు చేపట్టిన ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్
బుక్కరాయసముద్రం : ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్‌గా ఈశ్వరయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న గోవిందరాజులు విజయవాడ హెడ్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. నెల్లూరులో ఏపీ స్టేట్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రిఫర్మేషన్ సర్వీసెస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న ఈశ్వరయ్య ఇక్కడికి బదిలీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ ఎయిర్ జైలు అభివృద్ధికి, ఖైదీల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. గతంలో ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా, జైలు ఇన్చార్జ్ అధికారిగా పని చేసినట్లు ఆయన తెలిపారు. -
నేడు, రేపు ఏఈల ఆన్లైన్ పరీక్ష
కడప అర్బన్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల ఆన్లైన్ పరీక్ష (మెన్స్) ఈ నెల 29 నుంచి నిర్వహించనున్నట్లు స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్ ఈశ్వరయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు, 30న ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కడప, సీకే దిన్నె, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించారని వివరించారు. ఇందుకుగాను ఉప తహసీల్దార్లు, సీకే దిన్నె, కడప, వేంపల్లె, ప్రొద్దుటూరు, రాజంపేట వారిని లైజన్ ఆఫీసర్లుగా నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు తప్పనిసరిగా హాజరై రిజిష్టర్ కావాల్సి ఉందన్నారు. ఉదయం 9.30 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని తెలిపారు.. హాజరయ్యే అభ్యర్థులు వారి ఒరిజినల్ ఐడీ కార్డులను తీసుకు రావాలని సూచించారు. -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని పార్థసారధి నగర్లో ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పామిశెట్టి ఈశ్వరయ్య (55)కు ఇద్దరు కుమార్తెలు. మూడు మగ్గాలు ఉండగా కూలీ కూడా గిట్టుబాటు కాకపోవడంతో వాటిని అమ్మేశాడు. నేత పనులకు కూలీగా వెళుతూ రూ.4 లక్షల వరకు అప్పులు చేసి కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. అప్పుల బాధతో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
రెండు నాటు తుపాకులు స్వాధీనం
రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం మదన్‌పల్లి గ్రామంలో రెండు నాటు తుపాకులను ఎస్ఓటీ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఈశ్వరయ్య తన పొలంలో ఉన్న గదిలో రెండు నాటు తుపాకులను ఉంచాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఆదివారం దాడి చేసి తుపాకులను స్వాధీనం చేసుకుని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా : యజమాని మృతి
పొలంలో దుక్కి దున్నుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తిరగబడిన ఘటనలో యజమాని మృతి చెందాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్ మండలం ఎండపల్లె పంచాయతీ బోయపల్లెలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సానికులు తెలిపిన వివరాలివీ.. బోయపల్లె సమీపంలోని పొలంలో చిన్నరామిరెడ్డిగారి పల్లె గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ట్రాక్టర్ తో దుక్కి దున్నుతున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. డ్రైవర్ ఈశ్వరయ్య ట్రాక్టర్ ను బయటకు తీసేందుకు యత్నించినా ఫలితం కనిపించలేదు. విషయం తెలుసుకున్న ట్రాక్టర్ యజమాని బి.ఆంజనేయులు(29) అక్కడికి చేరుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని, ట్రాక్టర్ బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఒక్కసారిగా ముందు వైపు పైకి లేచింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న ఆంజినేయులు వెనక్కి బురదలో పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నారు. -
వివాహిత ఆత్మహత్య
పాణ్యం: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మాధవి (22) కి అదే గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (26) తో ఏడాది క్రితం వివాహమైంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో ఇద్దరి మధ్య కలతలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రోజు ఈశ్వరయ్య వేధిస్తుండటంతో మనస్తాపానికి గురైన మాధవి ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి
బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని ఓపెన్ ఎయిర్‌జైలు నందు జీవిత ఖైదీ అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. ఓపన్ ఎయిర్ జైలు సూపరిండెంట్ ఈశ్వరయ్య తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా పెద్ద కంబదూరు మండలం, చిన్న కంబదూరు గ్రామానికి చెందిన బోయ బెంగల గంటి లక్ష్మిరెడ్డి (40) 2002 లో ఓహత్య కేసులో నిందితుడు. 2005లో శిక్ష పడింది. 2013లో కడప సెంట్రల్ జైలు నుండి జిల్లా ఓపెన్ ఎయిర్‌జైలుకు వచ్చాడు. గత కొద్ది రోజులుగా మూర్ఛవ్యాదితో బాధపడుతూ ఉన్నాడు. దీంతో అప్పుడప్పుడు జైలు అధికారులు చికిత్సలు చేయిస్తూ ఉండేవారు. సోమవారం ఉదయం మూర్ఛవ్యాది రావడంతో జైలు అధికారులు చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మరణించినట్లు సూపరిండెంట్ ఈశ్వరయ్య తెలిపారు. -
ఆఫీస్ లోనే ఉరేసుకున్న డిప్యూటీ డైరెక్టర్
అనంతపురం: సాక్షర భారత కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఈశ్వరయ్య సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్యాలయంలోనే ఈశ్వరయ్య ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. విధులకు హాజరవుదామని వచ్చిన ఉద్యోగాలకు ఈశ్వరయ్య ఉరేసుకుని కన్పించడంతో వారంతా షాక్ కు గురైయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలు కార్యాలయంలోనే ఈశ్వరయ్య ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషాద వార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి బయల్దేరారు. -
ఈశ్వరయ్యా... ఇదేందయ్యా..!
ఒంటిమిట్ట: ఆయన పేరు ఈశ్వరయ్య. ఉద్యోగం.. మండల తహశీల్దార్. ఆయనకు అధికార పార్టీపై ఎందుకో అమాంతం ప్రేమ పుట్టుకొచ్చింది. సదా మీ సేవలో అంటూ వారి ఆదేశాలను తూ.చ. తప్పక పాటించడమే విధిగా పెట్టుకున్నట్లున్నారు. అందుకే.. అధికార పార్టీ నేతలు ఆదేశించిందే తడవు. మండలంలోని పలువురు చౌక దుకాణ డీలర్లను కార్యాలయానికి పిలిపించి ‘మీ పైన ఫిర్యాదులు వస్తున్నాయి. స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోండి.. మీకే మంచిది.. లేదంటే డీలర్షిప్ రద్దు చేయాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇదేంటి ఇన్నేళ్లుగా లేని సమస్య ఇప్పుడేం వచ్చిందబ్బా అంటూ డీలర్లు అయోమయానికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం కొత్తమాధవరం గ్రామ డీలర్ నాగమురళిని పిలిపించి రాజీనామా చెయ్.. నీకే మంచిదంటూ బెదిరింపు ధోరణిలో సూచించారు. ‘అధికార పార్టీ నాయకుల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మీ డీలర్‌షిప్పులను కొనసాగిస్తే నాకు తలనొప్పులు తప్పవు. ఎందుకొచ్చిన సమస్య.. స్వచ్ఛందంగా రాజీనామా చేసి వైదొలగండి అని సదరు తహశీల్దార్ డీలర్లకు ఉచిత సలహా ఇస్తున్నారు. స్టాకు కోసం డీడీ తీసి ఉంటే డీడీలను వెనక్కు తీసుకోండ ని ఆదేశించినట్లు తెలిసింది. ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి తాము ఓట్లు వేశామనే అక్కసుతోనే తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తహశీల్దార్ అధికార పార్టీ నేతలకు కొమ్ము కాసేలా వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నా : తహశీల్దార్ ఈ విషయంపై తహశీల్దార్ ఈశ్వరయ్యను వివరణ కోరగా తనకు కొంత మంది డీలర్లపై ఫిర్యాదులు అందాయని తెలిపారు. అందువల్ల వారిని పిలిపించి డీలర్‌షిప్‌లు జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు చూపించండని కోరగా తన వద్ద లేవని సమాధానమిచ్చారు. -
'విధి ఆ కుటుంబంతో వింత నాటకం ఆడుకుంది'
మనిషికి గర్భశోకానికి మించిన శాపమేముంది. అల్లారు ముద్దుగా పెంచి, అడిగింది అందించి, ఉన్నత విద్యావంతులను చేస్తే...తల్లిదండ్రుల శ్రమ, ఆశ ఫలించే దశలో ఆ బిడ్డలే బలవన్మరణం పొందితే అంతకు మించి కష్టం, నష్టం ఏముంటుంది. జిల్లా జైలు పర్యవేక్షణాధికారి సీహెచ్ ఈశ్వరయ్య కుటుంబంతో విధి ఈ విషాద నాటకమే ఆడుకుంది. నిరుడు ఎంఎస్ చేస్తున్న కూతురు, నేడు సాప్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న కొడుకు బలవన్మరణానికి గురయ్యాడు. అనంతపురానికి చెందిన సీహెచ్ ఈశ్వరయ్య ఏడాది కాలంగా ఇక్కడ జిల్లా జైలు పర్యవేక్షణాధికారిగా వ్యవహిస్తున్నారు. ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ శుక్రవారం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజినీరింగ్ చదివిన ప్రవీణ్ కుమార్ డీఎల్ఎఫ్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే అతను ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈశ్వరయ్యే తరచూ హైదరాబాద్ వెళ్లి కుమారుని యోగ క్షేమాలు తెలుసుకుని వస్తుండేవారు. కుమారుని అకాల మృతి వార్తతో హుటాహుటీన హైదరాబాద్ వెళ్లారు. కాగా ప్రవీణ్ కుమార్ మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కాగా గత ఏడాది జూన్ 24న ఈశ్వరయ్య కుమార్తె హరిప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో ఎం.ఎస్ చేస్తున్న ఆమె ఆరోగ్యం బాగోలేదని ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లోనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ దుఖం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈశ్వరయ్య కుటుంబాన్ని ప్రవీణ్ ఆత్మహత్య మళ్లీ తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. -
గ్రీవెన్స్‌సెల్‌కు హాజరుకాని అధికారులు
సాక్షి, కడప : జిల్లా వ్యాప్తంగా వేళకు విధులకు రావాల్సిన అధికారులు ఆలస్యంగా కార్యాలయాలకు వస్తున్నారు. వచ్చినా గ్రీవెన్స్ సెల్‌కు హాజరు కావడం లేదు. దీంతో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ‘గ్రీవెన్స్‌సెల్’కు మండలాధికారులు ఏమాత్రం ప్రాధన్యత ఇవ్వడంలేదు. సోమవారం... గ్రీవెన్స్ డే: ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తారు. ఇదే క్రమంలో ప్రతి మండల కేంద్రంలో కూడా సోమవారం గ్రీవెన్స్‌సెల్ కచ్చితంగా నిర్వహించాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. సోమవారాన్ని ‘గ్రీవెన్స్‌డే’గా అధికారులు నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో మినహా తక్కిన చాలా మండల కేంద్రాల్లో గ్రీవెన్స్డేలు నిర్వహించడం లేదు. ఎక్కడికి వెళ్లాలో... ఎన్ని సార్లు వెళ్లాలో.. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రజలు గ్రీవెన్స్ సెల్‌కు వస్తారు. అన్నిశాఖల అధికారులు ఆరోజు ఒకేచోట అందుబాటులో ఉంటారని, తమ సమస్య పరిష్కారమవుతుందని ఆశతో వెళతారు. తీరా మండలానికి పోయిన తర్వాత వేళకు కొంతమంది అధికారులు రారు. గ్రీవెన్స్‌సెల్‌కు పూర్తి గైర్హాజరవుతారు? దీంతో తమ సమస్య పరిష్కారం కోసం ఓశాఖ కార్యాలయానికి ఒకసారి, తర్వాత మరో అధికారి వద్దకు...ఆపై ఇంకో అధికారి వద్దకు ప్రజలు తిరగాల్సి వస్తోంది. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్‌సెల్‌కు వెళితే అక్కడ మండలాధికారులకు సమస్యను ఎండార్స్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే అసలు అధికారులే అందుబాటులో లేని పరిస్థితి. దీంతో తమ సమస్యల పరిష్కారానికి ఎక్కడికి వెళ్లాలో...ఎన్నిసార్లు వెళ్లాలో అర్థం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందరూ హాజరు కావల్సిందే: ఈశ్వరయ్య, డీఆర్ఓ. గ్రీవెన్స్‌సెల్‌కు తహశీల్దార్‌తో పాటు అన్నిశాఖల అధికారులు కచ్చితంగా హాజరుకావాల్సిందే! ఈ మేరకు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమస్య పరిష్కారానికి అందరూ ఒకేచోట ఉండాలని గ్రీవెన్స్‌డేను పెట్టాం. ఇకమీదట హాజరుకాని వారిపై తక్షణ చర్యలు ఉంటాయి.