కడప అర్బన్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల ఆన్‌లైన్ పరీక్ష (మెన్స్) ఈ నెల 29 నుంచి నిర్వహించనున్నట్లు స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్ ఈశ్వరయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 గంటల వరకు, 30న ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కడప, సీకే దిన్నె, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందుల పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించారని వివరించారు. ఇందుకుగాను ఉప తహసీల్దార్లు, సీకే దిన్నె, కడప, వేంపల్లె, ప్రొద్దుటూరు, రాజంపేట వారిని లైజన్ ఆఫీసర్లుగా నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు తప్పనిసరిగా హాజరై రిజిష్టర్ కావాల్సి ఉందన్నారు. ఉదయం 9.30 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరని తెలిపారు.. హాజరయ్యే అభ్యర్థులు వారి ఒరిజినల్ ఐడీ కార్డులను తీసుకు రావాలని సూచించారు.