బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయంచేసిన నాయకుడాయన
ఉత్తరాదిలో మోదీకి వ్యతిరేకత.. అందుకే దక్షిణాదిపై కన్ను
మనువాదవర్గంతో చంద్రబాబు జతకట్టడం దురదృష్టకరం
జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, హైకోర్టు మాజీ న్యాయమూర్తి,
జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ మాజీ చైర్మన్
సాక్షి, అమరావతి: స్వాతంత్య్రం వచ్చాక దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరిగింది, రాజ్యాంగ హక్కులు దక్కింది ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమేనని, అదీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాకే సాధ్యమైందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య చెప్పారు. ఉత్తరాదిలో మోదీ ప్రాభవం తగ్గిపోవడంతో ఆయన దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై పడిందన్నారు. అలాంటి మనువాదులతో చంద్రబాబు జతకట్టడం దురదృష్టమని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు ఓటేయకపోతే అధికంగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జస్టిస్ ఈశ్వరయ్య స్పందన ఆయన మాటల్లోనే..
అగ్రవర్ణాల కుట్రలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలు బలి
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటరానివారుగా, ఆదివాసీలుగా, అగ్రకులాల సేవకులుగానే కాకుండా వారినొక వస్తువుగా చూశారు. వారికి ఎలాంటి అధికారాలుగానీ, హక్కులుగానీ ఇవ్వకుండా విధ్వంసం జరిగింది. మనువాదుల చాతుర్వర్ణ వ్యవస్థ ఆధారంగా వివక్షకు గురిచేశారు. విద్యావంతులై పాలనలో భాగస్వాములైతే తమ ఆధిçపత్యం దెబ్బతింటుందనే కుట్రతో అలాంటి సమాజాన్ని సృష్టించే ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో సామాజిక స్పృహ గల బుద్ధుడు, వేమన, నారాయణగురు, పెరియార్ రామస్వామి, జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేడ్కర్ వంటి యుగపురుషుల త్యాగంతో భారత రాజ్యాంగం ఏర్పడింది.
జగన్ పాలనలోనే రాజ్యాంగ ఫలాలు అందాయి
బడుగు, బలహీనవర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక, ఆర్టీక న్యాయం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం అందించాలన్న దృక్పథంతో రాసిన భారత రాజ్యాంగాన్ని అక్షరాలా అమలు చేస్తోంది జగన్ ప్రభుత్వం. ఎన్ని కష్టాలకు ఓర్చి అయినా ఎదురులేని స్వచ్ఛమైన, శక్తిమంతమైన సంకల్పంతో రాజ్యాంగ ఫలాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అందించే కృషి జరిగింది. విద్యాలయాల అభివృద్ధి, నాణ్యమైన విద్యాబోధనతో ఏపీ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా ఇంజనీర్లు, సైంటిస్టులు, డాక్టర్లను తయారు చేసేందుకు ఆయన అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.
బడుగు, బలహీనవర్గాల భవిష్యత్తును సుసంపన్నం చేసేందుకు పెట్టుబడి కింద భావించి బడ్జెట్‌లో నిధులు ఖర్చు పెడుతున్నారు. 2019లో ఆయన మేనిఫెస్టోను చూసి అసాధ్యమన్నారు. కానీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జగన్ చట్టసభల్లోను సామాజికన్యాయం కలిగేలా ముందడుగు వేశారు. తన కుల, వర్గ ప్రయోజనాలూ ఖాతరు చేయకుండా సమానత్వం పాటించి రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాల్లో, కార్పొరేషన్ల పదవుల్లో 50 శాతం బీసీలకు అవకాశం కలి్పంచారాయన.
అలాంటి నాయకుడిపై కొందరు తప్పుడు అభిప్రాయాలను సృష్టించే యత్నం చేస్తున్నారు. ఆ అభిప్రాయానికి గురై తప్పుచేస్తే మనకు మనమే నష్టం చేసుకున్నట్టు అవుతుంది. ధనం, విద్య, అధికార బదలాయింపు కోసం, పేదలు సంపన్నులు కావడానికి, విద్యావేత్తలు కావడానికి, ఆరోగ్యవంతులు కావడానికి పనిచేస్తున్న జగన్‌కు ఓటేయకపోతే ఏపీలోని బీసీలను దేశంలో ఎవరూ నమ్మరు.
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న మోదీ
ఉత్తర భారతదేశంలో కూడా మోదీకి వ్యతిరేకత ఉంది. అక్కడ ఓడిపోతున్నందునే దక్షిణ భారతదేశంలో అబద్ధాలు మాట్లాడుతూ విలువల్లేని పార్టీలతో జతకట్టి, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఆయనకు మంత్రివర్గంపై, ప్రతిపక్షంపై, ప్రజలపై నమ్మకం లేదు. రిజర్వేషన్లు, కులగణనకు వ్యతిరేకమైన, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నా, బీసీల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నా, సామాజిక వెనుకబాటుకు గురైన ముస్లింల రిజర్వేషన్లు రద్దుచేస్తామని చెబుతున్నా, మతకలహాలు, అంతర్యుద్ధం, రక్తపాతం ద్వారా పబ్బం గడుపుకొనేందుకు ప్రయతి్నస్తున్నారు.. అని జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు.
జగన్‌కు ఓటేస్తేనే బీసీలకు మనుగడ
మనువాద, చాతుర్వర్ణ, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలతో చంద్రబాబు జతకట్టడం దురదృష్టకరం. బీసీలను మోసం చేయడంలో భాగంగానే బాబు, పవన్‌కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపారు. రాజ్యాంగ ఫలాలను దక్కకుండా కుదిరిన ఈ పొత్తును ఏపీ ప్రజలు చిత్తుచేయాలి. అతిజాగ్రత్తగా ఆలోచించి దుష్టచతుష్టయాన్ని నిరోధించాలి. జగన్‌ను బీసీలే రక్షించుకోవాలి. జగన్‌కు ఓటేయకపోతే మోసపోతాం. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా పూర్తిస్థాయిలో గెలిపిస్తే ఢిల్లీ పీఠం కదులుతుంది. జగన్ గెలిస్తే బీసీల బతుకులు బాగుపడుతాయి. కూటమి అధికారంలోకి వస్తే బీసీలు అంధకారంలోకి వెళ్తారు. ఈ యుద్ధంలో బీసీలే గెలుస్తారని, జగన్‌ను మరోమారు గెలిపిస్తారని నమ్ముతున్నాను.
Comments
Please login to add a commentAdd a comment