రెండు నాటు తుపాకులు స్వాధీనం
రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మండలం మదన్‌పల్లి గ్రామంలో రెండు నాటు తుపాకులను ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.
ఎస్‌ఐ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఈశ్వరయ్య తన పొలంలో ఉన్న గదిలో రెండు నాటు తుపాకులను ఉంచాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు ఆదివారం దాడి చేసి తుపాకులను స్వాధీనం చేసుకుని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈశ్వరయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.