లైంగిక దాడి కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు | Man Sent To 20 Years In Jail For Raping Girl In Ranga Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు

Published Fri, Oct 25 2024 7:19 AM | Last Updated on Fri, Oct 25 2024 9:14 AM

Man sent to 20 years in jail

రంగారెడ్డి కోర్టులు: ప్రేమ పేరుతో యువతిని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి యం.వాణి తీర్పు చెప్పారు. దీనికి సంబంధించి కోర్టు ఏపీపీ మంజులా దేవి తెలిపిన మేరకు...మొయినాబాద్‌ మండలం నాగిరెడ్డిగూడ గ్రామానికి చెందిన కాశీ విశ్వనాథ్‌ (29) అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. రెండేళ్ల అనంతరం పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషిట్‌ దాఖలు చేశారు. సాక్షులను విచారించిన కోర్టు గురువారం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే బాధితురాలికి రూ.3 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థకు సిఫార్సు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement