కడపలో వ్యక్తి దారుణ హత్య
Published Fri, Jul 21 2017 4:20 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM
కడప: వైఎస్సార్ జిల్లా కడప ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో గంధం ఈశ్వరయ్య (23) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంతో తారకరామా నగర్‌లో గురువారం రాత్రి చాంద్‌బాషా అనే వ్యక్తి ఇతడిని హత్య చేశాడు. రిమ్స్ మార్చురీకి మృతదేహాన్నితరలించారు. టౌన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement