రాజ్‌కుమార్ (ఫైల్)
కర్నూలు ,వెల్దుర్తి: చేనేత కార్మికుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన రాజ్‌కుమార్(35) వ్యవసాయం కలిసిరాకపోవడంతో అప్పుల పాలై నాలుగేళ్ల క్రితం కోడుమూరు మండల కేంద్రానికి వలస వెళ్లి కులవృత్తి మగ్గం నేసుకుంటూ జీవనం సాగించేవాడు. అప్పులకు వడ్డీ ఎక్కువై మొత్తం రూ.7లక్షలకు చేరింది.
వాటిని తీర్చే మార్గం లేక బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి బంధువులున్న వెల్దుర్తి పట్టణానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి భార్య శ్రీదేవికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పాడు. ఆమె బంధువులకు ఫోన్‌చేసి అప్రమత్తం చేసింది. వారు అక్కడికి వెళ్లేలోగా రైల్వేట్రాక్‌పై విగతజీవిగా కనిపించాడు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే ఎస్‌ఐ మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment