సాక్షి,హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావులు తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ భూపాలపల్లి కోర్టు పంపిన నోటీసుల్ని కొట్టివేయాలని కోరారు.
మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన కోర్టు ఈ ఏడాది జులై 10న కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు పంపింది. అయితే, ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్, హరీష్‌రావు తాజాగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment