bhupalapalli
-
కేసీఆర్, హరీశ్‌రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు
సాక్షి,భూపాలపల్లి: బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు సోమవారం(ఆగస్టు5) నోటీసులు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన నీటిపారుదల శాఖ అధికారులు సెప్టెంబరు 5న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు వారందరికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై రాజలింగమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను భూపాలపల్లి కోర్టు విచారించింది. అనంతరం కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులిచ్చింది. -
సరిహద్దుల్లో సైనికులను తెచ్చుకున్నా భయపడను: సీఎం రేవంత్
సాక్షి, భూపాలపల్లి జిల్లా: హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తానెప్పుడూ కేసులకు భయపడనని అన్నారు. అమిత్‌షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని, అందుకే ఢిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపించి, తనను అరెస్ట్ చేయాలని ఆదేశించారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులే కాదు, సరిహద్దుల్లో సైనికులను తెచ్చుకున్నా భయపడనని స్పష్టం చేశారు. గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.భూపాలపల్లి జిల్లా రేగొండలో ఏర్పాటు చేసిన జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ పార్లమెంటు సభ్యురాలిగా కడియం కావ్యాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జయశంకర్ ఊరును గత ప్రభుత్వం గ్రామపంచాయతీగా చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకే కాషాయ పార్టీ 400 సీట్లు కావాలని అంటోందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపణలు గుప్పించారు. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు. -
600 ఎకరాల అటవీ భూమి అమ్మకానికి సిద్ధం..?!
సాక్షి, వరంగల్: ఏండ్లుగా అటవీ శాఖ అధీనంలో ఉన్న భూమి తన భూమి అంటూ ఓ వ్యక్తి కోటి రూపాయాలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వైనం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన భూమి తమ దానం(హిబా) ద్వారా తనకు సంక్రమించిందని పేర్కొంటూ సదరు వ్యక్తి భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కొంత మంది వ్యక్తులకు విక్రయించినట్లు జోరుగా ప్రచారం నడుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నంబర్ 41లో 1298.03 ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 41 సర్వే నంబర్‌లోను పూర్తి విస్తీర్ణం అటవీ(మహాసూర) భూమిని రెవెన్యూ అధికారులో రికార్డులో నమోదు చేశారు. సంవత్సారాలుగా పహణీ రికార్డులో, ధరణిలో సైతం మొత్తం ఎకరాలు అటవీ భూమిని అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. సదరు భూమి మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ అని రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. సర్వే నంబర్ 41 పరిధిలోని 600ఎకరాల భూమి తనదంటూ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగిరిగ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. సేత్వార్ రికార్డులో అప్పటి అధికారులు 41 సర్వేనంబర్ ఎవరికీ కేటాయించకపోవడంతోనే ఈ తతంగం అంత నడించిందని పలువురు చర్చించుకుంటున్నారు. ధరణిలో అడవి పేరుతో ఉన్న రికార్డు -
నేడు భూపాలపల్లిలో తెలంగాణ కాంగ్రెస్ సభ
-
ఆర్టీసీ బస్సును ఢీకొట్టి.. 15 మీటర్లు ఈడ్చుకెళ్లి
శాయంపేట: మద్యం మత్తులో ఓ ఇసుక లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. అతివేగంగా లారీని నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఆ వేగానికి ఆర్టీసీ బస్సును లారీ 15 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. లారీ సైతం అదుపుతప్పి పొలాల్లో పక్కకు ఒరిగింది. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారు గుట్టల సమీపాన నేషనల్ హైవేపై శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 45 మంది ప్రయాణికుల్లో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. హన్మకొండ నుంచి భూపాలపల్లి వైపు పరకాల డిపో బస్సు వెళ్తుండగా, కాళేశ్వరం నుంచి హన్మకొండ వైపు ఇసుక లారీ వెళ్తోంది. శాయంపేట సీఐ రమేష్ అక్కడికి చేరుకుని క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఆర్టీసీ డ్రైవర్ పొన్నాల రవి, కండక్టర్ జె.రవితోపాటు ఇల్లంతకుంట మండలం లక్ష్మక్కపల్లెకు చెందిన తాటికొండ సమ్మక్క, రేగొండ మండలం రాజక్కపల్లెకు చెందిన ఎన్.మల్లికాంబ, గండి విజయ, చిట్యాల మండలం రాఘవరెడ్డిపేటకు చెందిన బెజ్జల జోత్స్న, వరంగల్ లేబర్ కాలనీకి చెందిన కూరపాటి నాగరాజు, దుగ్గొండికి చెందిన కోలా సరోజన ఉన్నట్లు సీఐ, డీఎం వివరించారు. కొందరికి స్వల్ప గాయాలైనట్లు పేర్కొన్నారు. లారీ క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్‌ను స్థానికులు కాపాడగా, అతడు పరారయ్యాడు. బస్సు డ్రైవర్ అప్రమత్తం కాకపోతే చాలా ప్రాణనష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చదవండి: కరోనా మృతదేహాలను ఆలింగనం.. ఆపై అంత్యక్రియలు -
భూపాలపల్లి అడవుల్లో మగ పులి
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో పులి సంచరిస్తోంది. నాలుగు రోజులుగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులిని.. మగపులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. తాడోబా లేదా ఇంద్రావతి అడవుల నుంచి రావొచ్చని అంచనా వేశారు. పులికి ఎటువంటి హాని జరగకుండా అటవీశాఖ అధికారులు అప్రమత్తం అవుతుండగా.. అటవీ గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. 17 ఏళ్ల తర్వాత దట్టమైన అడవులు కలిగిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ సమీప అడవుల్లో 2003లో ఏడు పులులు ఉన్నట్లుగా అప్పటి అటవీశాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 2009లో పాకాల సమీపంలోని రాంపూర్ అడవుల్లో ఒక పులి కనిపించింది. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా పులుల జాడ కనిపించలేదు. కాగా గత నెల 30న మహాముత్తారం మండలం యామన్‌పల్లి అడవుల్లో పులి అడుగులను జిల్లా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిమ్మగూడెంకు చెందిన ఓ రైతు తన ఆవు మేతకు వెళ్లి అడవిలో మృత్యువాత పడినట్లుగా గుర్తించాడు. మృతి చెందిన ఆవుపై పులి గాట్లు స్పష్టంగా కనిపించాయి. సోమవారం అదే పులి మహాముత్తారం మండలంలోని మహబూబ్‌పల్లి సమీపంలో గల బంగారుబాట మీదుగా, ఈ నెల 1న రాత్రి మరోమారు యామన్‌పల్లి–ఆజంనగర్ అడవుల్లో సంచరించినట్లుగా బుధవారం అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే బుధవారం సాయంత్రం మళ్లీ అదే పులి అడుగులు మల్హర్ మండలంలోని కిషన్‌రావుపల్లి సమీప అటవీ ప్రాంతంలో కనిపించడంతో అటవీశాఖ అధికారులతో పాటు అటవీ గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా అడవుల్లో పులి నాలుగు రోజులుగా సంచరిస్తుందనే వార్త దావనంలా వ్యాపించింది. అప్రమత్తంగా ఉండండి: డీఎఫ్ఓ జిల్లా అడవుల్లోకి పులి రావడం సంతోషకరమని డీఎఫ్ఓ పురుషోత్తం అన్నారు. కొత్తగా ఎక్కడ అడుగు జాడలు కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. అటవీ గ్రామాల ప్రజలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకరిద్దరు అడవుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని, వేట కోసం విద్యుత్ తీగలు, ఉచ్చులు ఎవరూ అమర్చకూడదన్నారు. చదవండి: బొగతా జలపాతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గల్లంతు -
ఆర్మీ కమాండోల ఆపరేషన్ సక్సెస్..
టేకుమట్ల : చుట్టూ వరదనీరు.. వాగు మధ్యలో ఎల్లమ్మ గుడి.. ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. గుడిలో పదిమంది రైతులు.. దాటుదామని వాగులోకి దిగితే కొట్టుకుపోవాల్సిందే. ప్రాణాలు అరచేతబట్టుకొని ఐదున్నర గం టలుగా బిక్కుబిక్కుమంటున్నారు.. అంతలోనేపైన గాలి మోటారు చప్పుడు వారి చెవిన పడింది. అంతే.. ప్రాణాలు లేచి వచ్చాయి. హెలికాప్టర్లో వచ్చిన ఆర్మీ కమెండోలు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో రైతుల కథ సుఖాంతమైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో.. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. కుందనపల్లిలోని చలివాగు ఒడ్డు వెంట ఉన్న పొలాల్లో వ్యవసాయ మోటార్లు వరదలో కొట్టుకుపోకుండా తీసుకురావాలనుకున్నారు రైతులు. మోటార్లను తెచ్చేందుకు రెండు ట్రాక్టర్లలో పలువురు రైతులు శనివారం ఉదయం పది గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలో పొలాల్లో ట్రాక్టర్లు దిగబాటుకు గురయ్యాయి. ట్రాక్టర్లను బయటికి తీసేందుకు పదిమంది రైతులు వెళ్లారు. అంతే.. ఒక్కసారిగా చలివాగు ప్రవాహం తీవ్ర రూపం దాల్చింది. దీంతో రైతులకు ఇరువైపులా వరదనీరు చేరడంతో ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. వాగులో రైతులు చిక్కుకుపోవడంతో స్థానికులు కూడా రక్షించే అవకాశాలు లేకపోయాయి. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి స్థానికులు విషయాన్ని తీసుకెళ్లారు. రంగంలోకి రెండు ఆర్మీ హెలికాప్టర్లు వాగులో రైతులు చిక్కుకున్న విషయాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావులకు వివరించారు. సీఎం జోక్యంతో హకీంపేట నుండి రెండు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఆర్మీ కమాండోలు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. మధ్యాహ్నం 3:30లకు రైతులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా, వాగు వద్ద సహాయక చర్యలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ అబ్దుల్ అజీం, ఎస్పీ సంగ్రామసింగ్ పాటిల్ పర్యవేక్షించారు. చివరకు రైతులు సురక్షితంగా బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమను రక్షించినందుకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ రుణపడి ఉంటాం వరదలో చిక్కుకున్న మాకు సాయం అందించి రక్షించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మేమూ, మా కుటుంబాలు ఎంతో రుణపడి ఉంటాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి తిరిగి వస్తామో, రామో అని భయపడ్డాం. ఈ పరిస్థితుల్లో మాకు ఎంతో సహకరించి 10 మంది కుటుంబాలకు దిక్కుగా నిలిచారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎస్పీ, ఇతర అధికారులకు కృతజ్ఞతలు. – మాడుగుల ప్రకాశ్, రైతు, కుందనపల్లి -
‘కాళేశ్వరం’ ఎత్తిపోతలు షురూ
కాళేశ్వరం : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో బుధవారం రాత్రి ఆరు మోటార్లను ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. మే 11వ తేదీన గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో మోటార్లను నిలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో.. కాళేశ్వరం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే, ప్రాణహిత వరద కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ వద్ద అప్రోచ్ కెనాల్ నుంచి ఫోర్ బే వరకు నీరు నిల్వ అయింది. వరద కూడా పెరుగుతుం డటంతో లక్ష్మీ పంపుహౌస్‌లోని 11 మోటార్లలోని ఆరు మోటార్లను ఆన్ చేయగా.. 12 పంపుల ద్వారా గ్రావిటీ కాల్వలోకి నీరు ఎత్తిపోస్తోంది. ఈ నీరు 13.41 కిలోమీటర్ల దూరంలోని అన్నారంలోని సరస్వతీ బ్యారేజీకి తరలుతోంది. రాత్రిలోగా మిగిలిన మోటార్లను ఒకేసారి నడిపించనున్నట్లు తెలిసింది. ఈ సీజన్లో మోటార్లు ఆన్ చేయడం ఇదే ప్రథమం కావడంతో ఎస్ఈ, డీఈఈ, ఏఈఈ స్థాయి ఇంజనీరింగ్ అధికారులు పంపుహౌస్ వద్ద పర్యవేక్షిస్తున్నారు. విద్యుత్ కాంతులతో జిగేల్ కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో మోటార్ల ద్వారా నీరు డెలివరీ సిస్టర్న్ వద్ద ఎత్తిపోస్తున్నాయి. దీంతో సిస్టర్న్‌కు రంగురంగుల విద్యుత్ దీపాలను అమర్చారు. దీంతో నీరు రంగు రంగులుగా మారి జిగేల్‌మంటోంది. -
పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం
సాక్షి, కాటారం: మనం పుట్టి, పెరిగిన ఊరు కన్నతల్లితో సమానమని, గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప కల్యాణ మండపంలో సర్పంచ్ తోట రాధమ్మ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి దయాకర్‌రావు, మంథని, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణి, పుట్ట మధు హాజరయ్యారు. మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామాలను స్వచ్ఛత దిశగా తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శ్రమదానాలు నిర్వహించడం, మొక్కలను నాటడం వంటి కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. గ్రామాభివృద్ధికి తోడ్పడిన వారికే గ్రామ అవసరాలు, ప్రభుత్వ పథకాల గురించి గ్రామసభలో ప్రశ్నించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే వ్యాధులు బాధ ఉండదని, బహిరంగ మలమూత్ర విసర్జన చేసేవారికి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతిని నాశనం చేసే వారికి ఎంత ఫైన్ విధిస్తే బాగుంటుందని మంత్రి సభలో గ్రామస్తులను అడుగగా వారు రూ.500 అని అనడంతో అమలు చేయండి అని కలెక్టర్ వెంకటేశ్వర్లుకు సూచించారు. ప్రత్యేక కార్యచరణలో భాగంగా ప్రతి గ్రామం ఓ గంగదేవిపల్లిని మించిపోవాలని మంత్రి అన్నారు. 30 రోజుల ప్రణాళికను గ్రామంలో విజయవంతం చేసుకుంటే ఎన్ని నిధులు అడిగిన కేటాయించే బాధ్యత తనదని మంత్రి హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపులో వెనకాడేది లేదన్నారు. ప్రతి ఏటా కాటారం గ్రామపంచాయతీకి 1.20కోట్లకు పైగా నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. రానున్న రోజుల్లో మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.3లక్షల మేర రుణం ఇచ్చేలా ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర వాటాలతో పాటు మరిన్ని నిధులు సమకూర్చేలా మంత్రి చొరవ చూపాలన్నారు. చెక్‌పవర్‌పై సర్పంచ్‌ల్లో ఇంకా స్పష్టత రాలేదని ఆ అంశాన్ని పునఃపరిశీలించి అధికారాలు ఇస్తే గ్రామపంచాయతీలు మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు. గ్రామసభలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డీఆర్డీఓ సుమతి, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, మహదేవపూర్ జడ్పీటీసీ గుడాల అరుణ, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కాటారం: కాటారం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భూమి పూజ చేశారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రతిష్టాపన రాయి వేశారు. కాగా కాటారం గ్రామపంచాయతీ భవనం గత కొంత కాలం క్రితం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో నూతన పాలకవర్గం గత కొన్ని నెలలుగా కార్యాలయ నిర్వాహాణ అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. దీంతో నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఇటీవల మండల పర్యటనకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సర్పంచ్ తోట రాధమ్మ, పాలకవర్గం సభ్యులు కోరారు. మంత్రి నిధుల మంజూరుకు సూచనాప్రాయంగా అంగీకరించడంతో గురువారం మండల పర్యటనకు వచ్చిన మంత్రి చేతుల మీదుగా భవన నిర్మాణం కోసం భూమి పూజ గావించారు. అనంతరం 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన భవన నిర్మాణం కూల్చివేతలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి స్వయంగా జేసీబీ నడిపి పాత భవనాన్ని కూల్చివేసి పారతో మట్టి ఎత్తి ట్రాక్టర్లో పోశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట రాధమ్మ, మంథని, భూపాలపల్లి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, జయశంకర్భూపాలపల్లి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్లు జక్కు శ్రీహర్షిణిరాకేశ్, పుట్ట మధు, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వెంకటాచారి, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, డీఆర్డీఓ సుమతి, ఎంపీడీఓ శంకర్, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీటీసీలు తోట జనార్దన్, జాడి మహేశ్వరి, ఉడుముల విజయరెడ్డి, ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్, జక్కు రాకేశ్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
‘మాయమాటల టీఆర్ఎస్ సర్కారు’
సాక్షి, భూపాలపల్లి : రాష్ట్రంలో మాయమాటల సర్కారు కొనసాగుతుందని, విద్య, వైద్యరంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించి ప్రజలను భయానక పరిస్థితుల్లోకి నెట్టిందని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆదివారం భట్టివిక్రమార్క, టీపీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ములుగు ఎమ్మెల్యే సీతక్క పరిశీలించారు. తొలుత హాస్టల్లోకి వెళ్లి వంటగది, డైనింగ్ హాల్‌ను పరిశీలించి విద్యార్థులకు వడ్డిస్తున్న కిచిడీని చూశారు. అనంతరం పీహెచ్‌సీని పరిశీలించి అక్కడే విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. భూపాలపల్లి పట్టణం జిల్లా కేంద్రంగా ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఆరు పడకల పీహెచ్‌సీతోనే కాలం వెల్లదీస్తున్నారన్నారు. ఆపరేషన్ థియేటర్‌ను స్టోర్ రూంగా మార్చారని, ఒకే ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారని, స్పెషలిస్ట్‌లు ఎవరూ లేరన్నారు. ఓపీలో ఒకే ఒక మహిళ ఉందంటే ప్రభుత్వ ఆస్పత్రి మీద ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. వెంటనే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇక్కడికి వచ్చి ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేషెంట్లు ఎందుకు ఉన్నారు.. ప్రభుత్వ ఆస్పత్రిలో ఎందుకు లేరో తెలుసుకోవాలన్నారు. ఆస్పత్రులో కుక్కలు, కోతులు కరిచినప్పుడు వేసే ఇంజక్షన్‌కు సంబంధించిన సిరంజీలు కూడా అందుబాటులో లేవన్నారు. మంచినీటి సౌకర్యం లేదని, మందులు సరిపడా లేవన్నారు. ఆరేళ్లలో ఒక్క డాక్టర్‌ను కూడా రిక్రూట్ చేయని ప్రభుత్వంగా టీఆర్ఎస్ చరిత్రలో నిలుస్తుందన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజనం అధ్వానంగా ఉందన్నారు. 280 మందికి 30 కేజీల బియ్యంలో అరకిలో పప్పు వేసి ఉడికించారన్నారు. ఇదీ కిచిడీనా అని ప్రశ్నించారు. వంద గ్రాముల నూనె, పావుకిలో ఉల్లిగడ్డ, అరకిలో చింతపండుతో చారు చేశారని వంట మనుషులే చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ మనువడు కూడా ఇలాగే తింటున్నాడా అని ప్రశ్నించారు. పిల్లల పేరు చెప్పి దోపిడీ చేసే ఈ ప్రభుత్వానికి పాపం తగులుతదన్నారు. సింగరేణి కార్మికులకు రూ.10 లక్షల రుణం, వారసత్వ ఉద్యోగాలు, పదివేల క్వార్టర్ల నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు. అనంతరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఏదో ఒక పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అంటున్నారన్నారు. చిట్యాలలో గైనకాలజిస్ట్ లేక బాలింత, బిడ్డ మృతి చెందినప్పటికీ ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా అన్నారు. రాష్ట్రంలో గడిన 9 నెలల్లో కోటి 20 లక్షల మందికి విష జ్వరాలు సోకినా తగు చర్యలు తీసుకోలేదన్నారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఉండడం లేదన్నారు. కేసీఆర్ కిట్‌కు కొంత మేరకు ఆదరణ లభిస్తే దాన్నే సాకుగా చూపిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులకు ఆదరణ పెరిగిందనడంలో అర్థం లేదన్నారు. పథకాల పేరుతో ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం లాభం చేకూరుస్తుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఐత ప్రకాష్‌రెడ్డి, ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ నాయకుడు జనక్‌ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు ఇస్లావత్ దేవన్, బుర్ర రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘టీఆర్ఎస్లో ఓనర్షిప్ల కొట్లాట మొదలైంది’
సాక్షి, భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో ఓనర్షిప్ కోసం నాయకులు గొడవలు పెట్టుకుంటూ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఆదివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని విక్రమార్క, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సీతక్కతో పాటు పలువు నాయకులు కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రోగులను, ప్రజలను మర్చిపోయి ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రులు అంటే 250 పడకలతో ఉంటుందని, కానీ ఇక్కడ కేవలం 6 పడకలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. భూపాలపల్లి జిల్లాగా ఏర్పడి మూడేళ్లవుతున్నా ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడం, జిల్లా ఆసుపత్రిగా మార్చకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఆస్పత్రికి రోగుల రావాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయని, ప్రస్తుతం ఇన్ పేషంట్లు ఎవరూ లేరని భట్టి పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఏంఆర్ఐ, సీటీ స్కాన్, ఎక్స్ రే ప్లాంట్, ఈసీజీ లేవని, ఇంతటి దుర్భర పరిస్థితులు ఎక్కడా ఉండవని మండిపడ్డారు. ప్రసూతి కోసం వచ్చే మహిళలకు ఉండాల్సిన గైనకాలజిస్టులు ఒక్కరు కూడా లేరని, ఆపరేషన్ థియేటర్ అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉందని విక్రమార్క విమర్శించారు. ఆపరేషన్ థియేటర్‌ను స్టోర్ రూమ్‌గా మార్చిన పరిస్థితి కన్పిస్తుందని, కనీసం ఆస్పత్రిలో లాబ్ టెక్నీషియన్ కూడా లేరని దుయ్యబట్టారు. జిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా కుక్క, కోతి కాట్లకు గురవుతున్నారని, అందుకు కావాల్సిన సిరంజీలు కూడా లేవని విమర్శించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులు బయట సిరంజీలు కొనుక్కుంటే ఇక్కడ ఇంజక్షన్లు ఇస్తున్నారని, ఇది దుర్భరమైన పరిస్థితి బట్టి అంటూ భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. -
సింగరేణికి సుప్రీం కోర్టు మొట్టికాయలు!
న్యూఢిల్లీ : భూపాలపల్లి నివాస ప్రాంతంలోని సింగరేణి ఓపెన్ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చెపట్టింది. ఈ విచారణలో భూపాలపల్లి బాధితుల తరపు న్యాయవాది శ్రవణ్ వాదిస్తూ.. సింగరేణి ఒపెన్‌కాస్ట్ మైనింగ్ బాంబు పేలుళ్ల వల్ల ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా సురక్షిత చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా ఈ పటిషన్‌పై విచారణ చెపట్టిన జస్టిస్ నాగేశ్వరరావు ధర్మాసనం ఓపెన్ కాస్ట్ మైనింగ్‌పై తనిఖీ నిర్వహించి కోర్టుకు నివేదికను సమర్పించింది. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక తమకే అనుకూలంగా ఉందని కోర్టుకు తెలిపింది. అయితే బాధితుల తరపు న్యాయవాది కాలుష్య మండలి నివేదికలో వాయు, ధ్వని, జల కాలుష్యం ఉందని శ్రవణ్ కోర్టుకు వివరించారు. అయితే కేంద్ర పర్యావరణ శాఖ ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు రోజులు సమయం కావాలని సుప్పీం కోర్టును కోరింది. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. -
జయశంకర్ సార్ యాదిలో..
సాక్షి, భూపాలపల్లి: ప్రొఫెసర్ జయశంకర్ తన గురువని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఎప్పుడూ చెప్పేవారని, ఆయన సూచనల మేరకే తాను టీఆర్ఎస్లో చేరానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ తన తండ్రి క్లాస్మేట్ అని, సార్ వద్ద తాను కొద్ది రోజులు చదువుకున్నానని తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. సీఎం కే.చంద్రశేఖర్‌రావుకు కుడి భుజంలా ఉండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని గుర్తు చేశారు. సార్ బ్రతికి ఉంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యేవారన్నారు. జయశంకర్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. మొక్కలు నాటాలి.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మంజూర్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జయశంకర్ ఎకో పార్కు పనులను పరిశీలించారు. అనంతరం పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ.. జయశంకర్ పార్కులో మంచి సౌకర్యాలు కల్పించి భూపాలపల్లి వాసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. వానలు సమృద్ధిగా కురువాలంటే ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పచ్చని వాతావరణం నెలకొనేలా మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. అనంతరం తెలంగాణకు హరితహారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గ్రామ పంచాయతీ నర్సరీ జాబితా 2019 బుక్‌లెట్‌ను మంత్రి దయాకర్‌రావు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ ప్రదీప్‌కుమార్‌శెట్టి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, ఎఫ్డీఓ సారయ్య, టీఆర్ఎస్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, కొత్త హరిబాబు, కటకం జనార్దన్, పైడిపెల్లి రమేష్, శిరుప అనిల్, పిల్లలమర్రి నారాయణ, ముంజాల రవీందర్, మంథెన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
లాఠీ పట్టిన చేయితో నాగలి పట్టిన ఏఎస్పీ
-
ఓ వీడియో వెట్టి నుంచి విముక్తి చేసింది!
భూపాలపల్లి అర్బన్: ఒక ఐడియా జీవితాన్నే మార్చేసింది. ఇది బాగా పాపులర్ అయిన వ్యాపార ప్రకటన. ఇక్కడ ఓ వీడియో వలస కూలీలను వెట్టి నుంచి విముక్తి చేసింది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, రెండు రాష్ట్రాల అధికారులను కదిలించింది. కూలీలను సొంతగూటికి చేరుకునేలా దోహదపడింది. అంతగా ప్రభావితం చేసిన ఆ వీడియో కథాకమామిషు ఇది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాకు చెందిన 49 మంది వలస కూలీలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మట్టి ఇటుక బట్టీల్లో పనిచేయడానికి ఆరు నెలల క్రితం వచ్చారు. పనికి తగిన కూలి ఇవ్వడం లేదని, బలవంతంగా పనులు చేయిస్తూ శ్రమదోపిడీకి గురి చేస్తున్నారని, తమకు ఇక్కడి నుంచి విముక్తి కల్పించాలని వలస కూలీలు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి విన్నవిస్తూ సెల్‌ఫోన్ సహాయంతో ఓ వీడియో తీసి 10 రోజుల క్రితం బంధువులకు పంపించారు. అది వైరల్‌గా మారి ఆ రాష్ట్రంలోని న్యూస్‌చానళ్లు, పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా రావడంతో అక్కడి ప్రభుత్వం స్పందించి చర్యలు ప్రారంభించింది. వెంటనే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గరియాబంద్ జిల్లా కలెక్టర్ శ్యాందావుడే.. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు చేరవేశారు. అలాగే గరియాబంద్‌కు చెందిన లేబర్, రెవెన్యూ, పోలీస్, మహిళా సంరక్షణ అధికారులు భూపాలపల్లికి శుక్రవారం చేరుకొని స్థానిక అధికారులతో కలసి ఆపరేషన్ ప్రారంభించారు. పట్టణంలోని రెండు ఇటుక బట్టీలు, గణపురం క్రాస్‌రోడ్డులో మరో ఇటుక బట్టీలో పనిచేస్తున్న 49 మంది వలస కూలీలను తమ అదీనంలోకి తీసుకుని వివరాలు తెలుసుకున్నారు. తమతో రాత్రీ పగలు అనే తేడా లేకుండా పనులు చేయిస్తూ తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని, సకాలంలో డబ్బులు చెల్లించచడం లేదని వాపోయారు. భోజనం చేయడానికి సైతం కనీస సమయం ఇవ్వడంలేదని, ఖాళీ కడుపుతో పనిచేస్తున్నామని కూలీలు అధికారులకు వివరించారు. అధైర్య పడొద్దని, తొందరలోనే సమస్యను ప్రభుత్వం పరిష్కరించి ఛత్తీస్‌గఢ్‌లో పని కల్పించేలా చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి వారిని స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయమై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సైతం స్పందించింది. ఈ ఘటనపై నివేదిక పంపాలని అధికారులను ఆదేశించింది. -
వృద్ధ దంపతుల వినూత్న నిరసన
భూపాలపల్లి: ‘‘పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేం దుకు తహసీల్దార్ లంచం అడుగుతున్నాడు.. వయోభారంతో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాం.. మా దగ్గర డబ్బులు లేవు.. లంచం కోసం బిచ్చం వేయం డి’’అంటూ ఓ వృద్ధ దంపతులు శుక్రవారం భూపాలపల్లిలో వినూత్న నిరసన తెలిపారు. చేతిలో ఫ్లెక్సీ.. మెడలో ప్లకార్డులు వేసుకొని భిక్షాటన చేయడం చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ స్పందించి.. వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. భూపాలపల్లి మండలం ఆజంనగర్‌కి చెందిన మాంతు బసవయ్య, లక్ష్మి దంపతులకు గ్రామ శివారులోని 50 సర్వే నంబర్లో 1.19 ఎకరాలు, 601లో ఎకరం, 622/42లో ఎకరం, 622/52/అ లో 31 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన నాటి నుంచి పట్టాదారు పాసుపుస్తకాల కోసం వారు భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాలి కి బలపం కట్టుకొని తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పుస్తకాలు ఇచ్చేందుకు నిరాకరిం చారు. దీంతో చేసేది లేక వృద్ధ దంపతులు శుక్రవారం భిక్షాటన ప్రారంభించారు. పట్టాదారు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్ సత్యనారాయణస్వామి డబ్బులు అడుగుతున్నాడని, తమ దగ్గర లేవని, ముసలివాళ్లం అయినందున ఆదుకోవాలని కోరుతూ పట్టణ ప్రధాన రహదారిలోని వ్యాపారుల వద్ద భిక్షాటన చేశారు. చేతిలో ఫ్లెక్సీ.. మెడలో ప్లకార్డు ప్రదర్శిస్తూ ప్రతి దుకాణ యజమాని వద్ద అడుక్కోవడం అక్కడున్న వారిని కదిలించింది. భూమిని ఎప్పుడో అమ్ముకున్నారు బసవయ్య, లక్ష్మి తమకున్న వ్యవసాయ భూమిని ఎప్పుడో అమ్ముకున్నారని భూపాలపల్లి తహసీల్దార్ నారాయణస్వామి అన్నారు. ఆ భూమికి సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. గ్రామంలో విచారణ చేపట్టగా 15 ఏళ్లుగా కానుగంటి కొమురయ్యనే భూమిని సాగు చేసుకుం టున్నాడని తేలిందన్నారు. దీంతో పాసుబుక్కును ఇవ్వకుండా నిలిపివేశామని తెలిపారు. ఎట్టకేలకు పట్టా.. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ కావడంతో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు స్పందించారు. ఆ వృద్ధ దంపతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందివ్వాలని భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారిని ఆదేశించారు. వృద్ధ దంపతులను తన కార్యాలయానికి పిలిపించుకున్న ఆర్డీఓ.. భూరికార్డులను పరిశీలించారు. అదే సమయంలో భూమిని కొనుగోలు చేశానని చెబుతున్న కానుగంటి కొమురయ్య రావడంతో ఈ భూమి నీకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బసవయ్య, లక్ష్మిల భూమిని 1981లో తంశెట్టి బానమ్మ కొనుగోలు చేసిం దని, ఆమె నుంచి 1989లో తన తండ్రి కానుగంటి మొండయ్య కొనుగోలు చేశాడని, అప్ప టి నుంచి తామే కాస్తులో ఉన్నామని చెప్పాడు. 2004లో ఆర్ఓఆర్ పట్టా చేయించుకొని పట్టాబుక్కు తీసుకున్నట్లు చెప్పాడు. ఆ భూమి తమదేనని బసవయ్య, లక్ష్మి 2011 నుంచి గొడవ చేస్తుండటంతో కోర్టును ఆశ్రయించానని, కేసు నడుస్తున్న క్రమంలోనే 2015లో పహాణీ నుంచి తన పేరును అకారణంగా తొలగించారన్నాడు. దీంతో ఆర్డీఓ సదరు భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను బసవయ్య, లక్ష్మీలకు అందజేశారు. నిజంగా భూమి కొనుగోలు చేసి ఉంటే, అన్ని డాక్యుమెంట్స్‌తో తనకు అప్పీల్ చేసుకోవాలని కొమురయ్యకు సూచించారు. -
తొలి ఘట్టం..
సాక్షి, భూపాలపల్లి : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ మరి కొన్నిగంటల్లో ప్రారంభం కాబోతోంది. సోమవా రం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణను మొదలుపెట్టన్నారు. ఎన్నికల షెడ్యూల్.. 12 నుంచి 19వ తేదీ వరకు రోజు ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిణ 20వ తేదీన నామినేషన్ల పరిశీలన 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 7న పోలింగ్(ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు) 11వ తేదీన ఓట్ల లెక్కింపు జిల్లాలో రెండు నియోజకవర్గాలు.. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గ కేంద్రాలతోపాటు పునర్విభజనలో భాగంగా జిల్లాలో కలిసిన కాటారం, మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్ మండలాలకు సంబం ధించి మంథని, వాజేడు, వెంకటాపురం(కే) మండలాలకు సంబంధించి భద్రాచలం నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. నామినేషన్లను రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు 19వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు.. నామినేషన్ల స్వీకరణకు జిల్లా పరిధిలోని భూపాలపల్లి, ములుగుతోపాటు మంథని, భద్రాచలం ని యోజకవర్గ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భూపాలపల్లి రిటర్నింగ్ అధికారి వెంకటాచారి(ఆర్డీఓ), ములుగు రమాదేవి(ఆర్డీఓ), మంథని నగేష్(ఆర్డీఓ), భద్రాచలం భవీష్మిశ్రా(సబ్ కలెక్టర్) తమ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు నేతృత్వంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేయనున్నారు. నామి నేషన్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఆంక్షలు విధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటి రెండు రోజులు తక్కువే.. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారం భం కానున్న నేపథ్యంలో మొదటి రెండు రోజులు నామినేషన్ల దాఖలు అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ జిల్లాలో కేవలం భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది. మహాకూటమిలో సీట్ల సరుబాటు కుదరక అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. దీంతో ప్రధాన పార్టీల నుంచి తొలిరోజున నామినేషన్లు వేసే అవకాశాలు తక్కువగానేఉన్నాయి. మరుసటి రోజు మంగళవారం సెంటిమెంట్ కావడంతో నామినేషన్లు వేసే పరిస్థితి ఉండకపోవచ్చు. జోరందుకోనున్న ప్రచారం నెల రోజుల నుంచే జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతోపాటు అన్ని పార్టీల నుంచి టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నవారు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుండడంతో నాయకులు ప్రచారాన్ని మరింత వేగం చేయనున్నారు. అన్ని పార్టీల నాయకులు ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం ఒక దఫా పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులతో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్ వేసే రోజు బల నిరూపనకు ఎక్కువ మందిని నియోజకవర్గ కేంద్రాలకు తరలించి భారీ ర్యాలీలు తీసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. విస్తృతంగా ప్రచారం చేస్తాం.. జిల్లాలో మావోయిస్టు ప్రభావిత, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలను డిసెంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అదేశాలు జారీ చేసింది. ఈ సమయంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. గంట సమయం కుదించిన విషయమై ఓటర్లు, రాజకీయ పార్టీల నాయకులకు అవగహన కల్పిస్తాం. అలాగే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాం. – వాసం వెంకటేశ్వర్లు, కలెక్టర్ -
వామ్మో పే...ద్ద పాము !
సాక్షి, భూపాపలల్లి రూరల్: భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని పుల్లూరి రామయ్యపల్లి శివారులోని గండ్రపల్లి ప్రాథమిక పాఠశాలలో పొడవైన నాగుపాము దూరింది. సోమవారం పాఠశాల తెరిచేసరికి బీరువా కింద పాము ఉందనే విషయాన్ని విద్యావలంటీర్ గమనించింది. గ్రామస్తులకు సమాచారమివ్వడంతో పాములు పట్టే వ్యక్తి అందుబాటులో లేడని పాఠశాలను మూసివేశారు. మంగళవారం గ్రామానికి చెందిన పాములు పట్టే ఉప్పలయ్యకు సమాచారమివ్వడంతో ఆయన పామును పట్టి సురక్షిత ప్రదేశంలో వదిలాడు. -
ఉపాధ్యాయ వృత్తి వదిలి ఉద్యమంలోకి..
సాక్షి, భూపాలపల్లి : తనకు వచ్చిన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి మావోయిస్టు పార్టీలో చేరి 15 ఏళ్లుగా విప్లవోద్యమంలో కొనసాగుతున్న సుంకరి రాజ్‌కుమార్ అలియాస్ అరుణ్‌కుమార్(36) ప్రస్థానం ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి–నిమ్మలవాగు అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్లో రాజ్‌కుమార్ మృతిచెందడంతో తన స్వగ్రామం భూపాలపల్లి మండలం దూదేకులపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దూదేకులపల్లి చెందిన సుంకరి రామక్క, సమ్మయ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందరిలో చిన్నవాడైన రాజ్‌కుమార్ డిగ్రీ, బీఈడీ పూర్తి చేశాడు. కొన్నాళ్లు గ్రామంలోనే విద్యావలంటీర్‌గా పనిచేశాడు. గ్రామస్తుల సహకారం తీసుకుని పాఠశాలలో వసతులు కల్పించాడు. ఈ క్రమంలోనే అతడికి నాగార్జున సాగర్‌లో ఉద్యోగం వచ్చినప్పటికీ వెళ్లకుండా విప్లవోద్యమానికి ఆకర్షితుడై 2003లో అప్పటి సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్‌లో చేరాడు. 2004లో ప్రభుత్వంతో జరిగిన మావోయిస్టులు చర్చల అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సంవత్సరంపాటు గ్రామంలోనే ఉండి మళ్లీ ఉద్యమబాట పట్టాడు. జిల్లాలోని మహదేవ్పూర్ ఏరియాలో కొన్నాళ్లు పనిచేసిన అనంతరం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం చర్ల శబరి ఏరియా కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నాడు. రాజ్‌కుమార్ దళంలో పని చేసేవారికి వైద్య సేవలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఎదురుకాల్పుల్లో మృత్యువాత.. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిం ది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు కూంబిం గ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కుర్నపల్లి–నిమ్మలగూడెం మధ్యలోని అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మావోయిస్టులు–పోలీసులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ సభ్యుడు అరుణ్ అలియాస్ రాజ్‌కుమా ర్ మృతిచెందాడు. మరికొందరు మావోయిస్టులకు గాయాలయ్యాయని, వారు తప్పించుకున్నారని సమాచారం. కాల్పులు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహంతోపాటు ఒక 303 రైఫిల్, కిట్ బ్యాగులు, గొడుగులు, చేతి సంచులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని ట్రాక్టర్లో కుర్నపల్లి అటవీ ప్రాంతం నుంచి సత్యనారాయణపురంలోని సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంప్ నకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భద్రాచలం ఏరియా వైద్యశాలకు చేర్చారు. -
పట్టు చీర చిక్కేదెలా ?
కాళేశ్వరం భూపాలపల్లి జిల్లా : స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర«శేఖర్‌రావు దంపతులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరాలయంలోని శుభానందదేవి(పార్వతీ) అమ్మవారికి సమర్పించిన పట్టుచీర మాయమైన ఘటనపై విచారణ నత్తనడకన సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016, మే 2న సీఎం కేసీఆర్, శోభ దంపతులు కాళేశ్వరాలయంలో శుభానందదేవి అమ్మవారికి రూ.36 లక్షలతో బంగారు కిరీటం బహూకరించి, పట్టు చీరను సమర్పించి మొక్కులు చెల్లించిన విషయం తెలిసిందే. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుకు అదే రోజున భూమిపూజ చేశారు. అయితే ఆ చీర కొన్నాళ్లుగా కనిపించడం లేదు. విషయం బయటకి పొక్కడంతో సిబ్బంది చీరను మార్చి మోసం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. నాలుగు రోజులైనా.. సీఎం కేసీఆర్ అమ్మవారికి సమర్పించిన చీర మా యమైన విషయం నాలుగు రోజుల క్రితం వెలుగు చూసినా అధికారుల్లో చలనం రావడం లేదు. కేవలం ఆలయ ఉపప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తికి ఈఓ మారుతి మెమో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు. గతంలో కాళేశ్వరాలయంలో ఈఓలుగా పనిచేసిన ఇద్దరికి కూడా తమ వివరణ ఇవ్వాలని ఎండోమెంట్ ఉన్నతస్థాయి అధికారులు మెమోలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదే లేదు.. చీర మాయం విషయమై సంబంధిత ఈఓ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. పోలీ సులు మాత్రం ప్రాథమికంగా విచారణ జరిపారు. సంబంధిత ఈఓ చీర మాయంపై ఫిర్యాదు చేస్తే విచారణలో వేగం పెంచి చీర చిక్కును ఛేదిస్తామని సీఐ రంజిత్ పేర్కొంటున్నారు. అర్చకుడికి మెమో జారీ.. పట్టు చీర మాయంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆలయ ఉపప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తికి ఈఓ మారుతి మెమో జారీ చేశారు. గతంలో కాళేశ్వరాలయంలో ఈఓలుగా పనిచేసిన ఇద్దరికి తమ వివరణ ఇవ్వాలని ఎండోమెంట్ ఉన్నతస్థాయి అధికారులు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. చీరమార్చి మోసం! సీఎం సమర్పించిన చీర మాయమైందని బయటకి పొక్కడంతో మరో ఇద్దరు అర్చకులు, ఓ ఉద్యోగి కలసి మరో చీరను వరంగల్ బట్టల దుకాణంలో కొనుగోలు చేసి ఆలయ చైర్మన్, ఈఓల ముందు ఉంచారు. ఆ చీర సీఎం సమర్పించిన చీర కాదని మరో వర్గం ఆరోపించడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో ఈవ్యవహరమంతా బట్టబయలైంది. భద్రతపై అనుమానాలు... ఆలయంలో సీఎం ఇచ్చిన చీరకు భద్రత లేనప్పుడు బంగారు నగలు, వెండి ఆభరణాలకు ఎలాంటి భద్రత ఉందో అర్థమవుతుంది. ప్రతే ఏటా కాళేశ్వరాలయంలో వీవీఐపీలు విలువైన పట్టు చీరలు అమ్మవారికి బహూకరిస్తారు. ఆ చీరలు కూడా ఆలయంలో కనిపించడం లేదని తెలుస్తోంది. వాటికి సంబంధించిన రికార్డులను కూడా అధికారులు రాయడం లేదు. ఆ విలువైన చీరలు అధికారుల ఇళ్లకు తరలిపోతున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం సీసీ కెమెరాలు కూడా నాణ్యత లేవని అర్థమవుతోంది. 2 మెగా పిక్సల్ కెమెరాలను ఆలయంలో అమర్చినట్లు తెలిసింది. నాకు అధికారికంగా ఆదేశాలు రాలేదు... కాళేశ్వరాలయంలో చీరం మాయంపై విచారణాధికారిగా నన్ను నియమించలేదు. కలెక్టర్ మౌఖికంగా చెప్పారు. అధికారికరంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆదేశాలు ఇస్తే విచారణ ప్రారంభిస్తా. – మోహన్‌లాల్, డీఆర్ఓ, భూపాలపల్లి చీర మాయంపై ఫైలు అందింది.. కాళేశ్వరాలయంలో సీఎం అందజేసిన చీర మాయంపై సంబంధించిన ఫైలు పరిశీలిస్తున్నాం. త్వరలో చర్యలు తీసుకుంటాం. – కృష్ణవేణి, ఎండోమెంట్, విజిలెన్స్ అధికారి -
వైద్య సేవలను మెరుగుపర్చాలి
భూపాలపల్లి అర్బన్ : ప్రభుత్వ వైద్యశాలలంటే దేవుడి గుడిలా భావించేలా వైద్యులు ప్రజలకు వైద్య సేవలందించాలని కలెక్టర్ అమయ్‌కుమార్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 25 పీహెచ్‌సీలు, 4 సీహెచ్‌సీ కేంద్రాల్లో వైద్యుల పనితీరును మెరుగుపరుచుకోవాలన్నారు. గ్రామీణ, ఏజెన్సీ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించి ప్రభుత్వ వైద్యశాలలపై నమ్మకం కలిగించే పని చేయాలన్నారు. వందశాతం సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో గర్భిణుల వివరాలను సేకరించి తేదీలవారీగా ఒక ప్రణాళిక రూపొందించుకొని, వారిని కలిసి ఆరోగ్య స్థితిని తెలుసుకొని ఎప్పటికప్పుడు వైద్యసేవలందించాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో ప్రజలకు వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పనిచేసే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధునాతన వైద్య పరికరాలను ఏఏ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలో నివేదిక సమర్పించాలని, వైద్య పోస్టుల ఖాళీల వివరాలను తెలియజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ–ఔషధి పథకంలో వచ్చే మందుల వివరాలు ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేసి నివేదికగా అందించాలన్నారు. ప్రాథమిక కేంద్రాల్లో ఎక్కువ సమయం పని చేస్తే ప్రసవాల సంఖ్య పెరుగుతుందని, వైద్యులు పనిచేసే సెంటర్ల పరిధిలోనే నివాసం ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వైద్యులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ మధుసూదన్, క్రాంతికుమార్, ఆస్పత్రి సూపరింటెండెట్లు వాసుదేవరెడ్డి, గోపాల్, రవిప్రవీణ్, ప్రోగ్రాం ఆఫీసర్ శృతి, రవీందర్ పాల్గొన్నారు. -
మర్మావయవాన్ని నలిపి హత్యాయత్నం
కొత్తగూడ: తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్త మర్మావయవాలను నలిపి హత్య చేసేందుకు యత్నించిందో కిరాతకురాలు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తగూడ మండలం ఓటాయిలో సోమవారం వెలుగు చూసింది. ఓటాయికి చెందిన పెండ్యాల సారయ్య భార్య కోనాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆదివారం రోజు ప్రియుడు నేరుగా ఇంటికే రావడంతో సారయ్య భార్యతో గొడవ పడ్డాడు. అది కాస్తా ముదిరి సోమవారం కొట్టుకునే స్థాయికి చేరింది. కోపం పట్టలేక సారయ్య మర్మావయవాలను అతని భార్య చిదిమివేసింది. దీంతో విపరీతంగా రక్తస్రావమై సారయ్య కేకలు పెడుతుండగా విన్న ఇరుగుపొరుగు వారు భార్యను చితకబాది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సారయ్య ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో పోలీసులకు సమాచారం అందించి నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సారయ్య బంధువులు కోరుతున్నారు. ఘటనపై సమాచారం ఉందని, అయితే ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్సై సతీష్ చెప్పారు. -
మోజు తీరాక... వద్దుపొమ్మన్నాడు..
భూపాలపల్లి అర్బన్: ప్రేమించానన్నాడు. పెళ్లికూడా చేసుకున్నాడు. తీరా మోజు తీరాక వద్దుపొమ్మంటున్నాడు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకొన్న వాడికోసం భార్య, భర్త ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. వివరాలు.. పట్టణానికి చెందిన పెండెల రవికుమార్ వరంగల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో హన్మకొండ వడ్డేపల్లికి చెందిన మాడుచి చారుశీలతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2016 సెప్టెంబర్ 13న వరంగల్ మ్యూజికల్ గార్డెన్లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరు కలిసే ఉంటున్నారు. పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్న అనంతరం ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. ఈ విషయం పై పలుమార్లు ఒత్తిడి తెచ్చిన లాభం లేకపోయింది. కాగా.. గత నెల 17 వరకు ఫోన్లో మాట్లాడిన రవి అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. ఆందోళన చెందిన చారుశీల భర్త గురించి కూపీ లాగగా.. మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో ప్రేమించిన వాడికోసం రెండు రోజులుగా పట్టణంలోని రెడ్డికాలనీలోని రవికుమార్ ఇంటి ముందు చారుశీల నిరాహారదీక్షకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు తమ మద్దతు తెలిపాయి. -
క్లాస్‌రూమ్‌లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భూపాలపల్లి అర్బన్: పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేసుకున్న సంఘటన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. స్థానిక గుడ్ మార్నింగ్ రెసిడెన్షియల్ పాఠశాలలో సందీప్ వర్మ పదో తరగతి చదువుతూ పాఠశాల హాస్టల్లోనే ఉంటు న్నాడు. గురువారం మధ్యాహ్నం దోమలను చంపేందుకు ఉపయోగించే రసాయన ద్రవం తాగాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే సందీప్ ను సింగరేణి ఏరియా ఆస్పత్రికి, అనంతరం వరంగల్‌కు తరలించారు. -
పోరాడి పెళ్లి చేసుకుంది
భూపాలపల్లి: పోరాటం చేస్తే పోయేది ఏమీ లేదు, అనుకున్నది సాధించడం తప్ప అనుకుందో యువతి. ప్రేమించి మొహం చాటేసిన ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ఐదురోజుల పాటు మౌన దీక్ష చేసింది. తన ప్రయత్నం ఫలించింది. ప్రియుడి ఇంట్లో వారి మనసు కరిగింది. పెళ్లికి జెండా ఊపారు. చివరకు కోరుకున్న వాడిని దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లికి చెందిన కళాసాగర్, మహబూబాబాద్‌కు చెందిన నాగమణి ఇరువురు ప్రేమించుకున్నారు. అయితే కళాసాగర్ తమ ప్రేమను ఇంట్లోవాళ్లు అంగీకరించట్లేదని మొహం చాటేశాడు. దీంతో ప్రేమించిన వ్యక్తితో పెళ్లికోసం నాగమణి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. కళాసాగర్ తనను పెళ్లి చేసుకునే వరకు కదిలేది లేదంటూ ఐదురోజులపాటు దీక్ష చేసింది. ఇంటి ముందు చేపట్టిన నాగమణి మౌన పోరాటం ఫలించింది. ఎట్టకేలకు కళాసాగర్, అతడి కుటుంబంలో చలనం రావడంతో ఆ ప్రేమ జంట ఆదివారం ఒక్కటైంది. పెద్దల సమక్షంలో ఇరువురు దండలు మార్చుకున్నారు.