మల్లన్నగుట్టకు మహర్దశ
-
ప్రభుత్వ కార్యాలయాలకు గుట్టచుట్టూ భూమి కేటాయింపు
గణపురం : మండలంలోని మైలారం–గాంధీనగర్ గ్రామాల మధ్యనున్న మల్లన్నగుట్టకు మహర్దశ పట్టిం ది. భూపాలపల్లి జిల్లా అవుతుందనే ప్రచారం మొదలు కాగానే అధికారు ల దృష్టి ఈ గుట్టపై పడింది. గత ఏడాది పోలీస్ బెటాలియన్ కోసం 120 ఎకరాలు, మిషన్ భగీరథ పనుల నిర్మాణానికి 12ఎకరాలు కేటాయిం చారు. ఇక్కడి నుండి మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ, గణపురం మండలాల్లోని 120గ్రామాలకు తాగు నీరందించనున్నారు. ఇందుకోసం పైపులైన్, ఇన్‌టేక్ వెల్ పనులు జరుగుతున్నాయి. భూపాలపల్లికి మంజూరైన అగ్నిమాపక కేంద్రానికి కూడా ఈ గుట్ట వద్దే రెండెకరాలు కేటాయించారు. రూ.3 కోట్లతో నిర్మించే ఐబీ గెస్ట్‌హౌస్ రెండెకరాల భూమి సేకరించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మించే విద్యాలయానికీ ఇక్కడే భూ సేకరణ చేపట్టనున్నారు. మల్లన్న గుంటపైన ఇంకా పలు ప్ర భుత్వ కార్యాలయాల కోసం భూమి సేకరిస్తున్నారు. వరంగల్ – భూపాలపల్లి ప్రధాన రహదారిని ఆ నుకుని ఉన్న మల్లన్నగుట్ట ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.