కేసీఆర్‌, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట | Relief To KCR and Harish Rao In Telangana High Court | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట

Published Tue, Dec 24 2024 1:24 PM | Last Updated on Tue, Dec 24 2024 1:43 PM

Relief To KCR and Harish Rao In Telangana High Court

సాక్షి,హైదరాబాద్‌:బీఆర్‌ఎస్‌ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌(kcr), మాజీ మంత్రి హరీశ్‌రావు(HarishRao)కు తెలంగాణ హైకోర్టులో మంగళవారం(డిసెంబర్‌24) ఊరట లభించింది. మేడిగడ్డ ప్రాజెక్టు పై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను తెలంగాణ హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఈ అంశంలో తదుపరి విచారణను జనవరి ఏడో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 

కాగా, మేడిగడ్డ(Medigadda) బ్యారేజీలో పగుళ్లకు కేసీఆర్‌,హరీశ్‌రావే కారణమని భూపాలపల్లి కోర్టు(Bhupalapalli Court)లో స్థానిక న్యాయవాది ఒకరు గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన భూపాలపల్లి సివిల్‌ కోర్టు కేసీఆర్‌,హరీశ్‌రావులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. 

ఈ నోటీసులను క్వాష్‌ చేయాల్సిందిగా కేసీఆర్‌,హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు భూపాలపల్లి కోర్టు నోటీసులపై కేసీఆర్‌,హరీశ్‌రావులకు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారునికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement