సాక్షి,మహబూబ్‌నగర్:రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాలకుడు ప్రజలను మోసం చేయకుండా చేయాలని కురుమూర్తి స్వామిని కోరుకున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం(నవంబర్ 20) హరీశ్‌రావు మహబూబ్‌నగర్‌లోని కురుమూర్తిస్వామిని దర్శించుకున్నారు.‘కురుమూర్తి స్వామి సాక్షిగా ఇచ్చిన హామీని మరిచి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసగించారు.
రేవంత్‌రెడ్డికి పని తక్కువ మాటలెక్కువ. ఆయనకు సీఎం కేసీఆర్ భయం పట్టుకుంది. పాలకుడే మాటతప్పితే రాజ్యానికి అరిష్టం. రాష్ట్రంలో సగానికి పైగా మంది రైతులకు రుణమాఫీ చేయలేదు.వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క గ్యారెంటీపైన ప్రకటన చేయని సీఎం వరంగల్‌లో కేసీఆర్ మీద తిట్ల పురాణం పెట్టాడు.
రేవంత్‌కు తెలిసింది ఒట్లు లేకుంటే తిట్లు. రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారు. అబద్దాలు,మోసం చేయడం సీఎం రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది. ప్రతిపక్షాల మీద పగ..రైతులు,ప్రజలకు దగా..తప్ప రేవంత్ చేసిందేమీ లేదు. రేవంత్‌రెడ్డి వచ్చాకా బీ ట్యాక్స్ వచ్చింది.బిల్లుల చెల్లింపులకు కమిషన్‌లు వసూలు చేస్తున్నారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేసేంత వరకు రేవంత్ మెడలు వంచుతాం. ఏడాది పాలనలో ఒక్క ఇల్లు నిర్మించలేదు.మూడునాలుగు నెలలు పనులు చేయిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తయి రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది.66 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీలు పాలమూరు జిల్లాను దగా చేశాయి.
కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేశాడు.గత పాలనలో ఇచ్చిన పథకాలను రేవంత్ ఎగ్గొడుతున్నాడు.కేసీఆర్ కలుపు మొక్కకాదు..కల్ప వృక్షం.రేవంత్‌రెడ్డి గురించి ప్రజలకు భ్రమలు తొలగిపోయాయి.రియల్‌ఎస్టేటను కుప్పకూల్చాడు’అని హరీశ్‌రావు ఫైరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment