సాక్షి, భూపాలపల్లి జిల్లా: హామీల గురించి అడిగితే తనపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తానెప్పుడూ కేసులకు భయపడనని అన్నారు. అమిత్‌షాను కేసీఆర్ ఆవహించినట్లున్నారని, అందుకే ఢిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపించి, తనను అరెస్ట్ చేయాలని ఆదేశించారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులే కాదు, సరిహద్దుల్లో సైనికులను తెచ్చుకున్నా భయపడనని స్పష్టం చేశారు. గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.
భూపాలపల్లి జిల్లా రేగొండలో ఏర్పాటు చేసిన జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ పార్లమెంటు సభ్యురాలిగా కడియం కావ్యాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జయశంకర్ ఊరును గత ప్రభుత్వం గ్రామపంచాయతీగా చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోందని, అందుకే కాషాయ పార్టీ 400 సీట్లు కావాలని అంటోందని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారని ఆరోపణలు గుప్పించారు. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment