మర్మావయవాన్ని నలిపి హత్యాయత్నం
కొత్తగూడ: తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్త మర్మావయవాలను నలిపి హత్య చేసేందుకు యత్నించిందో కిరాతకురాలు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తగూడ మండలం ఓటాయిలో సోమవారం వెలుగు చూసింది. ఓటాయికి చెందిన పెండ్యాల సారయ్య భార్య కోనాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది.
ఆదివారం రోజు ప్రియుడు నేరుగా ఇంటికే రావడంతో సారయ్య భార్యతో గొడవ పడ్డాడు. అది కాస్తా ముదిరి సోమవారం కొట్టుకునే స్థాయికి చేరింది. కోపం పట్టలేక సారయ్య మర్మావయవాలను అతని భార్య చిదిమివేసింది. దీంతో విపరీతంగా రక్తస్రావమై సారయ్య కేకలు పెడుతుండగా విన్న ఇరుగుపొరుగు వారు భార్యను చితకబాది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
సారయ్య ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో పోలీసులకు సమాచారం అందించి నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సారయ్య బంధువులు కోరుతున్నారు. ఘటనపై సమాచారం ఉందని, అయితే ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్సై సతీష్ చెప్పారు.