సాక్షి, వరంగల్: ఏండ్లుగా అటవీ శాఖ అధీనంలో ఉన్న భూమి తన భూమి అంటూ ఓ వ్యక్తి కోటి రూపాయాలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్న వైనం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన భూమి తమ దానం(హిబా) ద్వారా తనకు సంక్రమించిందని పేర్కొంటూ సదరు వ్యక్తి భూపాలపల్లి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన కొంత మంది వ్యక్తులకు విక్రయించినట్లు జోరుగా ప్రచారం నడుస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం నాచారం రెవెన్యూ శివారు పరిధిలోని సర్వే నంబర్ 41లో 1298.03 ఎకరాల భూమి ఉంది.
రెవెన్యూ రికార్డుల ప్రకారం 41 సర్వే నంబర్‌లోను పూర్తి విస్తీర్ణం అటవీ(మహాసూర) భూమిని రెవెన్యూ అధికారులో రికార్డులో నమోదు చేశారు. సంవత్సారాలుగా పహణీ రికార్డులో, ధరణిలో సైతం మొత్తం ఎకరాలు అటవీ భూమిని అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. సదరు భూమి మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ అని రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. సర్వే నంబర్ 41 పరిధిలోని 600ఎకరాల భూమి తనదంటూ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగిరిగ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. సేత్వార్ రికార్డులో అప్పటి అధికారులు 41 సర్వేనంబర్ ఎవరికీ కేటాయించకపోవడంతోనే ఈ తతంగం అంత నడించిందని పలువురు చర్చించుకుంటున్నారు.
ధరణిలో అడవి పేరుతో ఉన్న రికార్డు
Comments
Please login to add a commentAdd a comment