SARAIAH
-
మాజీ మంత్రి బస్వారాజ్ సారయ్యకు షాక్
-
మర్మావయవాన్ని నలిపి హత్యాయత్నం
కొత్తగూడ: తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్త మర్మావయవాలను నలిపి హత్య చేసేందుకు యత్నించిందో కిరాతకురాలు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తగూడ మండలం ఓటాయిలో సోమవారం వెలుగు చూసింది. ఓటాయికి చెందిన పెండ్యాల సారయ్య భార్య కోనాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఆదివారం రోజు ప్రియుడు నేరుగా ఇంటికే రావడంతో సారయ్య భార్యతో గొడవ పడ్డాడు. అది కాస్తా ముదిరి సోమవారం కొట్టుకునే స్థాయికి చేరింది. కోపం పట్టలేక సారయ్య మర్మావయవాలను అతని భార్య చిదిమివేసింది. దీంతో విపరీతంగా రక్తస్రావమై సారయ్య కేకలు పెడుతుండగా విన్న ఇరుగుపొరుగు వారు భార్యను చితకబాది బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. సారయ్య ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో పోలీసులకు సమాచారం అందించి నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సారయ్య బంధువులు కోరుతున్నారు. ఘటనపై సమాచారం ఉందని, అయితే ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్సై సతీష్ చెప్పారు. -
గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
మంగపేట : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తోన్న దోబి.సారయ్య(57) గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు.. సారయ్యది ములుగు మండలం రాయిగూడెం. గత వారం రోజులుగా సెలవులో ఉన్న సారయ్య శుక్రవారం విధులకు వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఎస్ఐ మహేందర్, సారయ్యను ఏటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
ఏటూరునాగారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న భూక్య సారయ్య అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యపై అనుమానంగా ఉండటంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి మాజీ మంత్రి సారయ్య కాంగ్రెస్ మహా ధర్నా ఉద్రిక్తం పలువురు నేతల అరెస్ట్.. విడుదల మట్టెవాడ స్టేషన్లో హైడ్రామా వరంగల్ అర్బన్ : సీఎం కేసీఆర్ దృష్టిలో ‘బంగారు తెలంగాణ’ అంటే... పేద,మధ్య తరగతి వర్గాల ప్రజలపై మోయలేని భారం వేయడమేనా... అని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జిల్లా, నగర కమిటీల ఆధ్వర్యంలో వరంగల్‌లోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఎదుట చేపట్టిన మహా ధర్నా స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు గంటల పాటు జరిగిన ధర్నా అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, బల్దియా కార్యాలయంలోని కమిషనర్‌కు వినతి పత్రాన్ని సమర్పిస్తామని పోలీస్ అధికారుల నుంచి నేతలు అనుమతి తీసుకున్నారు. ర్యాలీగా బయలుదేరి మార్గమధ్యలోని కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీ సులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు గేట్ ఎదుట బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా... కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిపై స్వల్ప లాఠీచార్జ్ చేశారు. అంతకుముందు ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా బల్దియా అధికారుల చే త టీఆర్ఎస్ ప్రభుత్వం నల్లా పన్నులను పెంచడం కోసం తీర్మానం చేయించడం సిగ్గుచేటన్నారు. సీయం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పెండింగ్‌లో ఉన్న గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ జీఓను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అవలంబిస్తున్న విధానాలు సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని మాజీ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. విద్యుత్ కోతలు విధిస్తే కర్ర కాల్చి వాతలు పెడతామని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య... సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నేరవేర్చిన తర్వాతే వరంగల్‌లో పర్యటించాలని, లేనిపక్షంలో మడికొండ వద్ద అడ్డుకుంటామని మాజీ మేయర్ స్వర్ణ హెచ్చరించారు. కేసీఆర్ మాటలు, చేతలకు పొంతన ఉండదని మాజీ మంత్రి విజయరామారావు ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు పోల నటరాజ్, మూగా రాంమోహన్ రావు, నమిం డ్ల శ్రీనివాస్, రాజారపు ప్రతాప్, బస్వరాజు కుమారస్వామి, రావుల సదానందం, కట్ల శ్రీనివాస్, బుద్ద పెద్దన్న, మాజీ కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, రోకుల భాస్కర్, గండ్ర జ్యోతి పాల్గొన్నారు. కాగా, బల్దియూ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్న క్రమంలో మాజీ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య, కాంగ్రెస్ నగర కమిటీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్‌ను పోలీసులు మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రెండు గంటల హైడ్రామా తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారి ని విడుదల చేశారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, డీసీసీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మేయర్ స్వర్ణను కూడా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాము శాంతి యుతంగా వినతిపత్రాన్ని సమర్పించి వెళ్లిపోతామని మాజీ మంత్రి సారయ్య హామీ ఇవ్వడంతో పోలీసులు వారిని అక్కడే విడుదల చేశా రు. ఆ తర్వాత పెంచిన నల్లా పన్నులను తగ్గిం చాలని, అర్హులందరీకి సం క్షేమ పథకాలు వర్తింపజేయూలని, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, నిరుద్యోగ భృతి తదితర డిమాండ్లను పరిష్కారించాలని బల్ది యూ అడిషనల్ కమిషనర్ నలుపరాజు శంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. అయితే మట్టెవాడ పోలీస్ స్టేషన్లో హైడ్రామా నడిచింది. తనకు ఓ కాంగ్రెస్ నేత చూపుడు వేలుతో వార్నింగ్ ఇచ్చారని, అతడిపై తను ఫిర్యాదు చేశానని, అ వ్యక్తిని అప్పగించాలని కాంగ్రెస్ నేతలకు డీఎస్పీ హిమవతి సూచిం చింది. ఈ క్రమంలో అనుమానితులుగా గుర్తిం చిన మట్టెవాడ ఎస్ఐ నాగబాబు... మాజీ కార్పొరేటర్ దామెర సర్వేష్, పెండ్లి కుమారస్వామి తదితరులను పోలీసులు స్టేషన్ తరలించగా, డీఎస్పీ వీరిని విచారించారు. కాం గ్రెస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఉండి అధికారులతో మంతనాలు జరిపారు. వారి విజ్ఞప్తి మేరకు అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టడంతో సమస్య సద్దుమణిగింది. కాంగ్రెస్ మహా ధర్నా సందర్భంగా బల్దియా ప్రధాన కార్యాలయానికి తాళాలు వేశారు. ఎంజీఎం సెంటర్, జెమిని థేయేటర్ రోడ్డు వద్ద భారి కేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ మళ్లించారు. బల్దియాలో పౌరసేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. -
సొంత వాళ్లే ముంచారు
చేసింది చెప్పుకోలేక ఓడాం సాధారణ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్‌లో చర్చ ‘వరంగల్ లోక్‌సభ’ పరిధిలో ముగిసిన పొన్నాల సమీక్ష సారయ్య, సిరిసిల్ల, దుగ్యాల గైర్హాజరు సాక్షి ప్రతినిధి, వరంగల్ : ‘సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకంగా పనిచేశారు. టిక్కెట్ల కేటాయింపు ఆలస్యంగా జరిగింది. తెలంగాణ ఇచ్చిన విషయం, హామీలపై స్పష్టంగా చెప్పలేకపోయాం. డబ్బులు ఉన్న నేతలకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఇవ్వడంతో వారు కొందరికే ప్రాధాన్యం ఇచ్చారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో బాగా పని చేసింది. ఓటమితో అయినా మన పార్టీ నేతల తీరు మారాలి. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన అందరిపై చర్యలు తీసుకోవాలి. ఓట్లు వేయిస్తానని చెప్పి డబ్బులు దండుకున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. పార్టీపై సమీక్షలు కాదు, నాయకులపై సమీక్షలు చేయాలి. చిన్న కార్యకర్తలను ఎదిగేలా చేయాలి. కాంగ్రెస్ బలోపేతం కోసం చర్యలు మొదలుపెట్టాలి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించాలి.’ ...సాధారణ ఎన్నికల్లో ఓటమిపై నియోజకవర్గాల సమీక్షలో కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు ఇవీ. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమిపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింట సమీక్ష పూర్తయింది. వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు ఎవరూ వెళ్లకపోవడంతో ఈ సెగ్మెంట్‌పై సమీక్ష జరగలేదు. వరంగల్ తూర్పు సెగ్మెంట్‌కు ఇటీవలి వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య సమీక్షకు హాజరు కాలేదు. మొదటి నుంచి పొన్నాలకు ప్రత్యర్థి వర్గంగా ఉన్న ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈ సమీక్షకు వెళ్లలేదని తెలిసింది. సారయ్యకు సన్నిహితంగా ఉండే వరంగల్ మాజీ లోక్‌సభ సభ్యుడు సిరిసిల్ల రాజయ్య సైతం సమీక్షకు హాజరుకాలేదు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దుగ్యాల శ్రీనివాసరావు సైతం సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, కొండేటి శ్రీధర్, ఇనుగాల వెంకట్రామిరెడ్డి, జి.విజయరామారావు, నేతలు భువనగిరి ఆరోగ్యం, హరిరమాదేవి, టి.విద్యాసాగర్, జి.రమాకాంత్‌రెడ్డి, ఈవీ.శ్రీనివాస్, బట్టి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. కాగా, కాంగ్రెస్ వరంగల్ జిల్లా కమిటీని వెంటనే నియమించాలని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను నాయిని రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాపోలు జయప్రకాశ్, ఈవీ.శ్రీనివాస్, కె.శ్రీనివాస్, లక్ష్మణ్‌గౌడ్ కోరారు. నైరాశ్యం వద్దు... ఆరు నియోజకవర్గాల సమీక్షల్లో నాయకులు చెప్పిన అంశాలను ఆలకించిన పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య... పార్టీ బలోపేతం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. నియోజకవర్గానికి ఒకరు చొప్పున రాష్ట్ర పార్టీ నేతలను పరిశీలకులుగా నియమిస్తామని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై క్రమశిక్షణ సంఘం త్వరలోనే చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ‘అసలైన కార్యకర్తలకు న్యాయం చేస్తాం. పార్టీని కూడగట్టడం... ముందుకు ఎలా వెళ్లాలో వంటి అంశాలపై గ్రామ, మండల, జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించి నిర్ణయం తీసుకుందామన్నారు. ఓటమి సహజమని... ఎవరూ నైరాశ్యం చెందొద్దన్నారు. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ఎత్తులు వేసినా... మన వాళ్లు మనకు ఉంటారు, అందరం కలిసి పార్టీ కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల నేతలు కలిసి వరంగల్ కార్పొరేషన్లో విజయం కోసం ప్రణాళిక రూపొందించుకుందాం’ అని పొన్నాల అన్నట్లు విశ్వసనీయనీయ వర్గాల ద్వారా తెలిసింది. పరకాల : ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఇనుగాల వెంకట్రామిరెడ్డి సహా 25 మంది నాయకులు ఈ సమీక్షకు హాజరుకాగా... సాంబారి సమ్మారావు గైర్హాజరయ్యూరు. టికెట్ల కేటాయింపులో ఆలస్యం కావడంతో ప్రజల్లోకి వెళ్లలేకపోయామని... ఇది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని పలువురు అభిప్రాయపడ్డారు. కొందరు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ వారితో చేతులు కలపడంతో నష్టపోయామని చెప్పారు. ఇలాంటి వారిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ పొన్నాల చెప్పారు. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన నేతలకు పదవులు ఇవ్వొద్దని పొన్నాలను పలువురు కోరారు. భూపాలపల్లి : టీఆర్ఎస్ మేనిఫెస్టో, కేసీఆర్ బహిరంగ సభలు ఎన్నికల్లో ప్రభావితం చూపాయని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర నేతలు చెప్పారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలతో సింగరేణి కార్మికులు, యువత ముఖ్యంగా కొత్త ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని పలువురు అన్నారు. పాలకుర్తి... పాలకుర్తి : నియోజకవర్గ సమీక్షకు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావు హాజరు కాలేదు. కొడకండ్ల, పాలకుర్తి నుంచి నాయకులు ఎవరు హాజరుకాలేదని తెలిసింది. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన దుగ్యాల శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కొందరు నాయకులు ఫిర్యాదు చేశారు. పాలకుర్తి రైతు సేవా సహకార సంఘం చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాంచారని చెప్పారు. ఈ అంశాలు తమ పరిశీలనలో ఉన్నాయని పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. వర్ధన్నపేట : నియోజకవర్గ సమీక్షలో కాంగ్రెస్ నాయకులు మోసం చేయడం వల్లే ఓడిపోయామని పార్టీ నేతలు చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వారు ఇప్పుడు కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన 11 మంది నాయకులపై చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు చెందిన సీనియర్ నాయకులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిసింది. వరంగల్ పశ్చిమ : నియోజకవర్గ సమీక్షలో ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ... ‘ఎవరి మీద ఫిర్యాదు చేయను. ఏ ఒక్కరు చేస్తేనో విజయం రాదు. కాంగ్రెస్ విజయం కోసం ఎవరు పనిచేశారు, ఎవరు చేయలేదని నేను చెప్పదలుచుకోలేదు. ఏ ఒక్కరో ఇద్దరో వ్యతిరేకంగా పనిచేసినా, అనుకూలంగా వ్యవహరించినా... మెజారిటీ విషయంలో అంత తేడా ఉండదు. పార్టీ ఓటమిపై అందరం పరిశీలించుకోవాలి. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం అందరం కృషి చేయాలి’ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ : నియోజకవర్గ సమీక్ష సాదాసీదాగా జరిగింది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తనను పట్టించుకోవడం లేదని భువనగిరి ఆరోగ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తనకు ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని అన్నారు. -
దొంతీ .. కరుణచూపు
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో నర్సంపేట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన దొంతి మాధవరెడ్డిని తిరిగి కాంగ్రెస్‌లోకి రప్పించుకునేందుకు సోమవారం ముఖ్య నేతలు చర్చలు జరిపారు. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే దొంతి సహకారం అవసరం కావడంతో జిల్లాకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు సారయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు, నాయిని రాజేందర్‌రెడ్డి, ఇనుగాల వెంకటరాంరెడ్డి, పొదెం వీరయ్య కలిసి దొంతితో సమావేశమై హరిత హోటల్లో చర్చలు జరిపారు. 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 24, టీఆర్ఎస్కు 18, టీడీపీకి 6, బీజేపీకి 1, ఇండిపెండెంట్ 1 గెలుచుకున్నారు. తెలంగాణలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ అవకాశం ఉన్న ఏ ఒక్క జెడ్పీ పీఠాన్ని కూడా వదలకూడదనే పట్టుదలతో ఉండడంతో జిల్లాలో దొంతి కరుణ తప్పనిసరి అయింది. మాధవరెడ్డి ఇంటికి గండ్ర తప్ప ముఖ్య నాయకులందరూ వెళ్లి మొదట చర్చలు జరిపిన తర్వాత హరిత హోటల్‌కు వేదిక మార్చారు. చర్చల్లో వచ్చిన అంశాలను కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి నుంచి ప్లాన్ ప్రకారం గెలిచిన జెడ్పీటీసీ అభ్యర్థులను మాధవరెడ్డి 10మందిని తన వద్ద ఉంచుకున్నారు. జెడ్పీ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కోసం మాధవరెడ్డి సహకారం అవసరమైంది. దీనికి ప్రతిఫలంగా మాధవరెడ్డిపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా దొంతి జెడ్పీ పీఠం తన నియోజకవర్గానికే కావాలని, జిల్లా అధ్యక్ష పదవి కూడా తనకే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ ప్రతిపాదనను దుగ్యాల శ్రీనివాసరావు వ్యతిరేకించారు. మొదట తన నియోజకవర్గానికి జెడ్పీ పీఠం కావాలని డిమాండ్ చేయడంతో పాటు దొంతికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఆయన అంగీకరించలేదు. అయితే మాధవరెడ్డి మెట్టుదిగకపోవడంతో చివరకు జెడ్పీ పీఠం ఆయన నియోజకవర్గానికే కేటాయించాలనే అభిప్రాయానికి వచ్చారు. కానీ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చేందుకు మాత్రం ప్రస్తుత ఇన్చార్జి నాయిని, దుగ్యాల, గండ్ర అంగీకరించకపోవడంతో దొంతి కొంత సానుకూలత చూపారు. టీఆర్ఎస్ పార్టీకి జెడ్పీ పీఠం దక్కకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు దొంతిని పార్టీలోకి తీసుకుని జెడ్పీ చైర్మన్ పదవి అప్పగించేందుకు సానుకూలత చూపారు. అయితే మంగళవారం మరో దఫా జరిగే చర్చల్లో స్పష్టత రానుంది. నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, నగర పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న దొంతి తనపట్టు నిలుపుకున్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన దొంతికి మళ్లీ అదే పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. -
'ఆ విషయంపై కేసీఆరే సమాధానం చెప్పాలి'
-
రాయల రగడతో ఆగిన గుండెలు
కరీంనగర్ జిల్లాలో ఇద్దరి మృతి హుస్నాబాద్/ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ వార్తల నేపథ్యంలో మనస్తాపం చెంది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సారయ్య(40), ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు చెందిన పైతరి రామయ్య(58) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. సారయ్య బుధవారం రాత్రి తన ఇంట్లో టీవీల్లో వస్తున్న రాయల తెలంగాణ వార్తలు చూసి తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిన ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. రాజయ్య సైతం ఇదే తరహా తుదిశ్వాస విడిచాడు. వీరిద్దరూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించేవారని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెవిలో పువ్వు
=కల్చరల్ ప్రాజెక్టుకు రెండోసారి భూమి పూజ =మంత్రి సారయ్య మాయ.. కొత్తగా తెచ్చినట్టు డ్రామా సాక్షి ప్రతినిధి, వరంగల్ : వారం రోజుల కిందట... అంటే ఈ నెల 11న వరంగల్‌లోని పోచమ్మమైదాన్‌లో మల్టీపర్పస్ కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీ సిరిసిల్ల రాజయ్య కలిసి శంకుస్థాపన చేశారు. రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపట్టే ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలోనే ప్రత్యేకంగా ఈ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తామని.. త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలను సైతం వరంగల్‌లోనే నిర్వహిస్తామని మంత్రి సారయ్య ఇదే వేదికపై ఘనంగా ప్రకటించారు. ఇదిలావుంటే.. ఆరున్నరేళ్ల కిందట అదే స్థలం.. అదే వేదికపై... 2007 మార్చి 11న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అదే స్థలంలో భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వైఎస్ వెంట అప్పటి ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, రెడ్యానాయక్ సైతం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు మంజూరు చేసిన మల్టీ పర్పస్ కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తవ్వ లేదు. అప్పటి నుంచీ ఇప్పటివరకు సారయ్యనే ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ.. తన హయాంలోనే ఆ ప్రాజెక్టు మంజూరైందని మరిచిపోయారో ఏమో మరి. ప్రాజెక్టును కొత్తగా తాను సాధించి తెచ్చినట్లుగా బతుకమ్మ పండుగకు ముందు రోజు కొబ్బరికాయలు కొట్టిన మళ్లీ భూమి పూజ చేయడం అందరినీ విస్మయపరిచింది. కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంచుకున్న ఎకరం స్థలం.. మెయిన్‌రోడ్డుకు ఆనుకుని, మంత్రి ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్థలంలో గడిచిన దశాబ్ద కాలంగా చేపట్టిన ప్రాజెక్టులన్నీ రాతి ఫలకాలుగానే నిలిచిపోవడం గమనార్హం. 1999లో చంద్రబాబు హయాంలో రూ.65 లక్షల అంచనా వ్యయంతో ఇక్కడ రైతుబజార్ నిర్మించారు. 2007 జనవరి 21న ఈ రైతు బజార్‌ను కూరగాయల మార్కెట్‌కు తరలిస్తున్నట్లుగా చెప్పి.. రేకుల షెడ్లన్నీ నేలమట్టం చేశారు. అప్పట్నుంచీ కొత్త ప్రాజెక్టులకు మోక్షం రాకపోగా.. ఈ స్థలం కేవలం శిలాఫలకాలకు, ప్రజాప్రతినిధులు చెప్పుకునే గొప్పలకు వేదికగా మారినట్లు వెక్కిరిస్తోంది. -
టెక్స్టైల్ పార్కుపై చిగురిస్తున్న ఆశలు
కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : ఆజంజాహిమిల్లు స్థలంలో టైక్స్‌టైల్ పార్కు ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పార్కు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసి మూడున్నర సంవత్సరాలుగా గడిచినా కార్యరూపం దాల్చలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆజంజాహిమిల్లు సమీపంలో ఉన్న సుమారు 33 ఎకరాల స్థలంలో మి నీ టెక్స్టైల్ పార్కు నిర్మాణం కోసం గతంలో పలుమార్లు సర్వేలు చేశారు. ఇందుకోసం 27 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఈ స్థలంలో తక్షణమే టెక్స్టైల్ పార్కు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. అయితే అదేస్థలంలో అర్బన్ పోలీసు కమిషనరేట్ నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు రావడంతో అధికార యంత్రాం గం తర్జనభర్జన పడింది. ఎట్టకేలకు ఆ స్థలాన్ని టెక్స్టైల్ పార్కు ఏర్పాటు కోసమే కేటాయిస్తున్నట్లు ఓ బోర్డు ఏర్పాటు చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో మంత్రి సారయ్య పార్కు ఏర్పాటుపై చేనేత కార్మిక ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మినీ టెక్స్టైల్ పార్కు ఏర్పాటు కోసం రూ. 8 కోట్లు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అంతేకాకుండా స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ. 70 లక్షలు మంజూరు చేశారు. దసరా తర్వాత పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి సారయ్య, కలెక్టర్ కిషన్ ప్రకటించారు. పార్కు పనులు త్వరగా ప్రారంభించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. -
‘పురా’ అమలుపై సమీక్ష
= హాజరైన మంత్రి సారయ్య, ఎంపీ రాజయ్య నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : పట్టణ మౌలిక సదుపాయాల కల్పన (పురా) ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని పర్వతగిరి మండలంలో రూ.168.52 కోట్లతో పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) పనుల అమలుపై రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు కలెక్టర్ కిషన్ శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, చింత నెక్కొండ, రోళ్లకల్లు, నారాయణపురం, సోమారం, జమాళ్లపురం, పర్వతగిరి, కల్లెడ, రావూర్, పెద్దతండాల్లో ప్రభుత్వం పుర ప్రాజెక్ట్‌ను అమలు చేయనుంది. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ప్రాజెక్ట్ అమలు చేసేందుకు మొత్తం రూ.168.52 కోట్లను వెచ్చించింది. ఇందులో రూ.123.34 కోట్లు (73 శాతం కేంద్ర ప్రభుత్వం), రూ.25.80 కోట్లు (15 శాతం రాష్ట్ర ప్రభుత్వం) రూ.19.38 కోట్లు (11 శాతం కన్సోరిటీయం) చెల్లిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను యుగాంతర్, ఎస్వీఈసీ సంస్థలు చేపట్టనున్నాయి. ఈ మేరకు పర్వతగిరి పెద్ద చెరువులోకి ఎస్ఆర్ఎస్పీ నీటిని పంపింగ్ చేసి సాగు, తాగునీరు అందించేందుకు రూ. 41 కోట్లు, మైనర్, మేజర్ ఇరిగేషన్ పనులను చేపట్టేందుకు రూ.36 కోట్ల ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ పంపే విషయంపై మంత్రి, ఎంపీ, కలెక్టర్, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్ ఎస్ఆర్ఎస్పీ అధికారులు, ఇరిగేషన్ విభాగం అధికారులతో సుమారు రెండుగంటలపాటు చర్చించారు. కాగా, కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పక్షాన పుర పనులను డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్ పర్యవేక్షించనున్నారు. ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్ట్‌లో భూమి కొనుగోలుకు సుమారు రూ. 3 కోట్లు, నీటి పంపిణీకి రూ.36.60 కోట్లు, వాటర్షెడ్ల నిర్మాణం కోసం రూ.14.94 కోట్లు, సామూహిక మరుగుదొడ్ల నిర్వహణకు రూ. 6.82 కోట్లు, రోడ్లు, డ్రెయినేజీలకు రూ. 1.85 కోట్లు, సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణకు రూ. 1.59 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్కు రూ. 4.80 కోట్లు, రూరల్ బిజినెస్ హబ్‌కు రూ. 53 లక్షలు, ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టంకు రూ.52 లక్షలు, కమ్యూనిటీ రేడియో ఏర్పాటుకురూ. 63లక్షలు, వాటర్ సస్టెనబులిటీకి రూ.41.53 కోట్లు, బ్రాడ్‌బాండ్‌కు రూ.63లక్షలు, ప్యాక్‌హౌస్‌కు రూ.1.19కోట్లు, రీఫర్ వ్యాన్‌కు రూ.60 లక్షలు, కామన్ సర్వీస్ సెంటర్‌కు రూ.47లక్షలు, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌కు రూ.33 లక్షలు, వీధిదీపాల ఏర్పాటుకు రూ.75 లక్షలు వెచ్చించనున్నారు. కాగా, ఆర్థిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.6.11 కోట్లతో జిన్నింగ్ మిల్లు ఏర్పాటు, రూ.3.20 కోట్లతో రూరల్ గోదాం నిర్మాణం, రూ.11 లక్షల తో ఇంటర్నెట్ కియోస్క్, రూ.3.16 కోట్లతో లెర్నింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. గత జూలై 22వ తేదీన పురా ప్రాజెక్ట్ కేంద్ర మంత్రి జైరాం రమేష్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించాల్సి ఉండగా... చివరి నిమిషంలో సీఎం రాకపోవడంతో కార్యక్రమం వాయిదా పడింది. కాగా, ఈ ప్రాజెక్ట్‌ను తిరిగి ఈ నెల చివరన ... లేకుంటే నవంబర్ మొదటి వారంలో గాని తిరిగి ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా, పురా ప్రాజెక్ట్‌ను కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంతోపాటు మరో గ్రామంలో ప్రస్తుతం అమలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ప్రాజెక్టు అమలుకు ఎంపీ సిరిసిల్ల రాజయ్య ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.