ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు | Shame the government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు

Published Sun, Oct 19 2014 12:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు - Sakshi

ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
 మాజీ మంత్రి సారయ్య
 కాంగ్రెస్ మహా ధర్నా ఉద్రిక్తం
 పలువురు నేతల అరెస్ట్.. విడుదల
 మట్టెవాడ స్టేషన్‌లో హైడ్రామా

 
వరంగల్ అర్బన్ : సీఎం కేసీఆర్ దృష్టిలో ‘బంగారు తెలంగాణ’ అంటే... పేద,మధ్య తరగతి వర్గాల ప్రజలపై మోయలేని భారం వేయడమేనా... అని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ జిల్లా, నగర కమిటీల ఆధ్వర్యంలో వరంగల్‌లోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఎదుట చేపట్టిన మహా ధర్నా స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.

రెండు గంటల పాటు జరిగిన ధర్నా అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, బల్దియా కార్యాలయంలోని కమిషనర్‌కు వినతి పత్రాన్ని సమర్పిస్తామని పోలీస్ అధికారుల నుంచి నేతలు అనుమతి తీసుకున్నారు. ర్యాలీగా బయలుదేరి మార్గమధ్యలోని కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీ సులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ కార్యకర్తలు గేట్ ఎదుట బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పరిస్థితి అదుపు తప్పుతుండడంతో నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా...  కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిపై స్వల్ప లాఠీచార్జ్ చేశారు. అంతకుముందు ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ  ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా బల్దియా అధికారుల చే త టీఆర్‌ఎస్ ప్రభుత్వం నల్లా పన్నులను పెంచడం కోసం తీర్మానం చేయించడం సిగ్గుచేటన్నారు.

సీయం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే పెండింగ్‌లో ఉన్న గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ జీఓను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ అవలంబిస్తున్న విధానాలు సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని మాజీ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. విద్యుత్ కోతలు విధిస్తే కర్ర కాల్చి వాతలు పెడతామని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య... సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నేరవేర్చిన తర్వాతే వరంగల్‌లో పర్యటించాలని, లేనిపక్షంలో మడికొండ వద్ద అడ్డుకుంటామని  మాజీ మేయర్ స్వర్ణ హెచ్చరించారు.

కేసీఆర్ మాటలు, చేతలకు పొంతన ఉండదని మాజీ మంత్రి విజయరామారావు ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి,  మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, కాంగ్రెస్ నాయకులు పోల నటరాజ్, మూగా రాంమోహన్ రావు, నమిం డ్ల శ్రీనివాస్, రాజారపు ప్రతాప్, బస్వరాజు కుమారస్వామి, రావుల సదానందం, కట్ల శ్రీనివాస్, బుద్ద పెద్దన్న, మాజీ కార్పొరేటర్లు గుండేటి నరేంద్రకుమార్, రోకుల భాస్కర్, గండ్ర జ్యోతి పాల్గొన్నారు. కాగా, బల్దియూ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్న క్రమంలో మాజీ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య, కాంగ్రెస్ నగర కమిటీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్‌ను పోలీసులు మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

రెండు గంటల హైడ్రామా తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వారి ని విడుదల చేశారు. మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, డీసీసీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మేయర్ స్వర్ణను కూడా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. తాము శాంతి యుతంగా వినతిపత్రాన్ని సమర్పించి వెళ్లిపోతామని మాజీ మంత్రి సారయ్య హామీ ఇవ్వడంతో పోలీసులు వారిని అక్కడే విడుదల చేశా రు.

ఆ తర్వాత  పెంచిన నల్లా పన్నులను తగ్గిం చాలని, అర్హులందరీకి సం క్షేమ పథకాలు వర్తింపజేయూలని,   అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, నిరుద్యోగ భృతి తదితర డిమాండ్లను పరిష్కారించాలని బల్ది యూ అడిషనల్ కమిషనర్ నలుపరాజు శంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. అయితే మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా నడిచింది. తనకు ఓ కాంగ్రెస్ నేత చూపుడు వేలుతో వార్నింగ్ ఇచ్చారని, అతడిపై తను ఫిర్యాదు చేశానని, అ వ్యక్తిని అప్పగించాలని కాంగ్రెస్ నేతలకు డీఎస్పీ హిమవతి సూచిం చింది.

ఈ క్రమంలో అనుమానితులుగా గుర్తిం చిన మట్టెవాడ ఎస్‌ఐ నాగబాబు...  మాజీ కార్పొరేటర్ దామెర సర్వేష్, పెండ్లి కుమారస్వామి తదితరులను పోలీసులు స్టేషన్ తరలించగా, డీఎస్పీ వీరిని విచారించారు. కాం గ్రెస్ నాయకులు  పోలీస్ స్టేషన్‌లో ఉండి అధికారులతో మంతనాలు జరిపారు. వారి విజ్ఞప్తి మేరకు అరెస్ట్ చేసిన వారిని  విడిచిపెట్టడంతో సమస్య సద్దుమణిగింది. కాంగ్రెస్ మహా ధర్నా సందర్భంగా బల్దియా ప్రధాన కార్యాలయానికి తాళాలు వేశారు. ఎంజీఎం సెంటర్, జెమిని థేయేటర్ రోడ్డు వద్ద భారి కేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ మళ్లించారు. బల్దియాలో పౌరసేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement