కాశిబుగ్గ, న్యూస్‌లైన్ : ఆజంజాహిమిల్లు స్థలంలో టైక్స్‌టైల్ పార్కు ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. పార్కు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసి మూడున్నర సంవత్సరాలుగా గడిచినా కార్యరూపం దాల్చలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆజంజాహిమిల్లు సమీపంలో ఉన్న సుమారు 33 ఎకరాల స్థలంలో మి నీ టెక్స్‌టైల్ పార్కు నిర్మాణం కోసం గతంలో పలుమార్లు సర్వేలు చేశారు.
ఇందుకోసం 27 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఈ స్థలంలో తక్షణమే టెక్స్‌టైల్ పార్కు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. అయితే అదేస్థలంలో అర్బన్ పోలీసు కమిషనరేట్ నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు రావడంతో అధికార యంత్రాం గం తర్జనభర్జన పడింది. ఎట్టకేలకు ఆ స్థలాన్ని టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కోసమే కేటాయిస్తున్నట్లు ఓ బోర్డు ఏర్పాటు చేశారు.
శుక్రవారం కలెక్టరేట్‌లో మంత్రి సారయ్య పార్కు ఏర్పాటుపై చేనేత కార్మిక ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మినీ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కోసం రూ. 8 కోట్లు వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అంతేకాకుండా స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ. 70 లక్షలు మంజూరు చేశారు. దసరా తర్వాత పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి సారయ్య, కలెక్టర్ కిషన్ ప్రకటించారు. పార్కు పనులు త్వరగా ప్రారంభించాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.
టెక్స్‌టైల్ పార్కుపై చిగురిస్తున్న ఆశలు
Published Sun, Oct 13 2013 3:24 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
Advertisement