ఏటూరునాగారం మండలకేంద్రంలో భూక్య సారయ్య అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.
ఏటూరునాగారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న భూక్య సారయ్య అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తన ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యపై అనుమానంగా ఉండటంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.