మైనర్ బాలిక అనుమానాస్పద మృతి | The mysterious death of a minor girl | Sakshi
Sakshi News home page

మైనర్ బాలిక అనుమానాస్పద మృతి

Published Wed, Jan 27 2016 8:04 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

The mysterious death of a minor girl

 మైనర్ బాలక అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాలిక అనుమానాస్పద స్థితిలో కాలి బూడిదైంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

నల్లగొండ జిల్లా నారాయణపురం మండలం కోతలపురం గ్రామానికి చెందిన సిరిరెండ్ల కృష్ణవేణి(17) తల్లి తండ్రులతో పాటు పరకాల మండలానికి వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ రోజు సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో కాలి బూడిదైంది. దీంతో ఆత్మహత్య చేసుకుందా.. లేక ఎవరైనా కిరోసిన్ పోసి నిప్పంటించారా.. అని అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement