Krishna veni
-
మేడ్చల్ జిల్లాలో నాలుగేళ్ల కృష్ణవేణి కిడ్నాప్
-
అదృశ్యమై ఉరికి వేలాడిన ఇద్దరు.. వివాహేతర సంబంధమే కారణమా?
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లిలో గురువారం అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన రెండు మృతదేహాలు వెలుగు చూశాయి. గ్రామానికి చెందిన మేకతొట్టి వజ్రమ్మ పాతబడిపోయిన తన ఇంటికి తాళం వేసి కొంతకాలంగా అదే గ్రామంలోని కూతురు ఇంట్లో ఉంటోంది. గురువారం ఉదయం ఆమె ఇంటికి వచ్చి తాళం తీసి లోపలికి వెళ్లే సరికి ఒక పురుషుడు, ఓ మహిళ మృత దేహాలు దూలానికి వేలాడుతూ కనిపించడంతో భయాందోళనతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితికి చేరుకున్నాయి. స్థానికులు పరిశీలించి తమ గ్రామానికే చెందిన పచ్చినీళ్ల ధర్మయ్య (32), ఇంజిమళ్ల కృష్ణవేణి (25)గా గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న సత్తుపల్లి రూరల్ సీఐ టి.కరుణాకర్, వీ.ఎం.బంజర్ ఎస్సై తోట నాగరాజు గ్రామానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగి ఉంటుంది.. లంకపల్లికి చెందిన ధర్మయ్య, కృష్ణవేణి గ త నెల 26 నుంచి కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో కృష్ణవేణి భర్త బాలయ్య (30) అదేరోజు కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత చికిత్స పొందుతూ 29న మృతి చెందాడు. కృష్ణవేణి, ధర్మయ్య మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆ అవమానంతోనే బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ప్ర చారం జరుగుతోంది. కాగా, బుధవారం నుంచే ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నా, చుట్టుప్రక్కల ఇళ్ల వారు విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇదిలా ఉండగా, బాల య్య ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళ న చెందిన కృష్ణవేణి, ధర్మయ్య ఆత్మహత్య చేసుకున్నారా.. లేక వీరిద్దరిని హత్య చేశాక బాలయ్య ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నా రు. వజ్రమ్మ తన ఇంటికి తాళం వేసి వెళ్లి పోయిన విషయం తెలుసుకుని వెనుక తలుపు తీసుకుని ఇంట్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య, కృష్ణవేణి మృతితో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఇక ధర్మయ్య భార్య కూడా భర్త వివాహేతర సంబంధం తెలియడంతో పదిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. -
సంబంధాల దారపు ఉండ
వివేక్ షాన్‌బాగ్ కన్నడంలో రాసిన ‘ఘాచర్ ఘోచర్’ నవలికలో, పేరుండని కథకుడు– బెంగళూరులో ‘వందేళ్ళగా పేరు మారని కాఫీహౌస్’లో ‘లెమన్ సోడా’ తాగుతుంటాడు. అతను పాత గర్ల్ఫ్రెండును అక్కడే కలుసుకునేవాడు. ఇప్పుడతనికి పెళ్ళయి ఉంటుంది. ‘ఇంటి గొడవలను తప్పించుకోవడానికి ఇక్కడికి వస్తాను’ అని ఒప్పుకుంటాడు. ఇక్కడినుండీ, తన జీవితాన్ని ఏ క్రమం పాటించకుండా వర్ణిస్తాడు. అతని అప్పా (తండ్రి)సేల్స్‌మాన్. ‘ప్రతీ పొద్దూ తన జోళ్ళు పాలిష్ చేసుకుని, ఇస్త్రీ చేసిన చొక్కా తొడుక్కునేవాడు.’ తన కొద్దిపాటి ఆదాయంతోనే తమ్ముడైన వెంకటాచల (చిక్కప్ప)ని చదివిస్తాడు. అప్పుడు వారి కుటుంబం, ‘వరుసగా ఉండే రైలు కంపార్టుమెంట్ల వంటి, చీమలుపట్టిన నాలుగు గదుల్లో ఉండేది. సమస్త కుటుంబం కలిసుండి, ఒకే శరీరంలా– బిగుతు పరిస్థితుల తాడుపైన నడిచేది.’ తన ఉద్యోగం పోయిన తరువాత అందిన డబ్బుతో అప్పా– చిక్కప్ప సహాయంతో, ‘సోనా మసాలా’ కంపెనీ ప్రారంభిస్తాడు. కలిమిలోకి అడుగు పెట్టిన ఇంటి సభ్యులందరికీ తమతమ గదులు ఏర్పడతాయి. చిక్కప్ప, కథకుడిని కంపెనీ సీఓవో నియమిస్తాడు. అయితే, బాబాయే మొత్తం వ్యాపారం నడుపుతుండటంతో కథకుడికే కాక మరెవరికీ కూడా పని చేసే అవసరం పడదు. ‘అత్యవసర వంటలే చేస్తే గ్యాస్ సిలిండర్ రెండు నెలలు వచ్చేది. గ్యాస్ అయిపోయాక, సిలిండర్‌ను బోర్లా పడుకోబెడితే మరి కొన్ని రోజులు.’ తమ పేదరికపు రోజుల ‘అమ్మ’ మాటలను గుర్తు చేసుకుంటాడు కథకుడు. ‘డబ్బుని అదుపులో ఉంచేది మనం కాదు. డబ్బే మనల్ని నియంత్రిస్తుంది. కొద్దిపాటి డబ్బే ఉన్నప్పుడు అది వినయంగా మసులుకుంటుంది. అది హెచ్చయినప్పుడు, మొండిధైర్యంతో మనమీద హక్కు చూపించుకుంటుందని జనాలనే మాటలు నిజమే... పేదరికం అనుభవిస్తున్నప్పుడు, పూర్తి కుటుంబం కలిసే భోంచేసేది. ఇప్పుడు, మేము భోజనాలప్పుడు కలుసుకున్నాగానీ ధ్యాస మరెక్కడో ఉంటుంది’ అంటాడు. ఇంటివారు అతనికి, ఒక ప్రొఫెసర్ కూతురైన అనితతో పెళ్ళి చేస్తారు. ఆమె బాగా చదువుకున్నది. హనీమూనప్పుడు, కథకుడు అనిత లంగా బొందు విప్పడానికి ప్రయత్నిస్తాడు. అది మరిన్ని ముళ్ళు పడుతుంది. అది‘ఘాచర్ ఘోచర్’ అయిందంటుంది అనిత. దాని అర్థం, ‘విడలేకపోయేంతగా ముళ్ళు పడటం’ అని వివరిస్తుంది. భర్త ఏ పనీ చేయడని తెలిసి అనిత కోపం తెచ్చుకుంటుంది. అలాకాదని నిరూపించేందుకు అతను మళ్ళీ రోజూ కాఫీహౌస్‌కు వెళ్ళడం మొదలుపెడతాడు. హఠాత్తుగా వచ్చిపడిన డబ్బు కుటుంబ సమీకరణాలను మార్చివేసి, వారి నైతిక ధైర్యాన్నీ, మనశ్శాంతినీ పోగొడుతుంది. ఇంటి సభ్యులు బయటివారితో పెట్టుకున్న సంబంధాలన్నీ విఫలమే అవుతాయి. కథకుని అక్క మాలతి పెళ్ళికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా, అత్తగారింట్లో ఇమడలేక పుట్టింటికి వచ్చేస్తుంది. అనితకు– అత్తగారితోనూ, ఆడపడుచుతోనూ పోట్లాటలవుతుంటాయి. అనిత, తన బొందుకు పడిన ముళ్ళను ‘ఎంత జాగ్రత్తగా విడతీసిందో’ కథకుడూ అంతే పదిలంగా, తను చిక్కుకున్న కుటుంబపు దారాలని విప్పుకోవాలిప్పుడు. కథకుడి నిరుత్సాహం, అనిత కోపం, మాలతి అల్పత్వం, అప్పా నిస్సహాయత, చిక్కప్పకుండే నైతిక అస్పష్టతవంటి బలహీనతలన్నిటినీ, యీ 118 పేజీల నవలికలో చూపుతారు రచయిత. దీని కన్నడ ముద్రణ 2013లో. శ్రీనాథ్ పెరూర్ ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ పుస్తకాన్ని పెంగ్విన్ బుక్స్ 2017లోప్రచురించింది. తెలుగులోకి రంగనాథ రామచంద్రరావు అనువదించారు. కృష్ణ వేణి -
నిను వీడిన నీడ
కొత్త బంగారం ‘నాకిద్దరు తండ్రులుండేవారు. ఇప్పుడు ఒక్కరూ లేరు. మొదటి మరణం ఉద్దేశపూర్వకమైనది. రెండోది కణాలు తెచ్చిపెట్టిన ప్రమాదం.’ డెత్ అండ్ అదర్ హోలీడేస్ నవలికకు కథానాయికా, కథకురాలూ అయిన ఏప్రిల్ తన సవతి తండ్రి విల్సన్ క్యాన్సర్‌తో పోయినప్పుడు చెప్తుందీ మాటలు. ‘నాకు 16 ఏళ్ళున్నప్పుడు, నాన్న బెల్టుతో ఉరేసుకున్నాడు. తన డాట్సన్ కారు నాకు వదిలిపెట్టాడు. క్లచ్ వేయడం నేర్చుకోడానికే నెలలు పట్టాయి’ అంటుంది ఇరవైల్లో ఉన్న ఏప్రిల్. నవలికలో ఉండే ఆమె సొంత తండ్రి గురించిన వివరాలవి మాత్రమే. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో విల్సన్ చనిపోయిన 1998 వసంతకాలం నుండీ 1999 శీతాకాలం వరకూ కొనసాగే కథనంలో ఉన్న నాలుగు అధ్యాయాలకీ, నాలుగు రుతువుల పేర్లుంటాయి. ‘తన జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఉండేందుకు’ రోజూ ఒక ఫొటో తీసుకుంటానన్న ఏప్రిల్ నిర్ణయంతో మొదలవుతుంది మార్సీ వోగల్ రాసిన యీ పుస్తకం. విల్సన్‌కూ, సవతి కూతురుకీ బాగా పడేది. ‘నీ జీవితం ఇప్పుడే ప్రారంభమవుతోంది’ అని విల్సన్ తను చనిపోయేముందు ఏప్రిల్‌కు చెప్తాడు. దాన్తో పాటు ‘మొదలుపెట్టింక, పద’ అని రాసిస్తాడు. ఆ వసంతకాలంలోనూ, వేసవిలోనూ చుట్టూ ఉన్న ప్రపంచం యథావిధిగా సాగుతుండగా, ఏప్రిల్ మాత్రం నిర్వీర్యురాలవుతుంది. ఇద్దరు తండ్రులూ, పెళ్ళవబోయే ఆప్తమిత్రురాలు లిబ్బీ గుర్తొస్తుంటారు. ఆకురాలు కాలపు మొదటి రోజు, లిబ్బీ ప్రధానపు రోజు ఫొటోలను డెవలప్ చేస్తూ, ‘అక్కడే ఉన్నానే! నా కెమెరా రికార్డ్ చేసినది నా మనస్సెందుకు పట్టుకోలేకపోయిందో!’ అనుకుంటుంది. కారణం– పూల్ పక్కన కూర్చున్న హ్యూగో కజిన్ విక్టర్, అతని కుక్క ఏర్గోస్నీ తను గమనించకపోవడం. ఏప్రిల్, విక్టర్ ప్రేమలోపడి కలిసి తోటపని చేస్తారు. రహస్యాలు పంచుకుంటారు. ఏప్రిల్ థెరపిస్ట్ వద్దకి వెళ్తుంది. అయితే– తండ్రి ఆత్మహత్యా, విల్సన్ మరణం గురించిన తన అనుభూతులు వ్యక్తపరచలేకపోతుంది. కానీ, జిమ్‌లో తారసపడిన ఒక అపరిచితుడు– తన తండ్రి కూడా అలాగే మరణించాడని చెప్పినప్పుడు, ‘మేమిద్దరం ఆత్మహత్యకు కొడుకూ కూతుళ్ళం’ అనుకుంటుంది. ప్రేమలో భద్రత అన్న ఆమె భావం కాస్తా, ‘ఏదీ శాశ్వతం కాదు’ అన్న అభిప్రాయానికి మారినప్పుడు, ‘ఏర్గోస్ ముసలి కుక్క. విక్టర్ పిరికివాడు’ అనేసుకుని, ‘తన్ని తాను చంపుకోగలిగే నీలాంటి మనిషిని ప్రేమించదలచుకోలేదు’ అని అతనికి చెప్తుంది. సంవత్సరం గడిచి వసంతకాలం ప్రవేశిస్తుండగా– ఏప్రిల్, విల్సన్ సలహా పాటించి, విక్టర్‌తో రాజీపడి, ముందుకు కదిలి జీవితం ప్రారంభిస్తుంది. నవలికలో, ఏప్రిల్ యూదు కుటుంబ సభ్యుల మనస్తత్వాలూ, అలవాట్ల వివరాలూ చాలానే ఉంటాయి. డిపార్టుమెంట్ స్టోర్‌లో ఏప్రిల్ కొన్న సామాన్లేమేమిటో కూడా పేర్లూ, బరువుతో సహా విశదంగా ఉంటాయి. అన్ని అధ్యాయాల్లోనూ విల్సన్ గురించిన చిన్న ఉంటంకింపులుంటాయి. హాస్యం, కోపం, బాధ సమపాళ్ళలో కనపరిచే నవలిక– మృత్యువు, వేదన గురించినదైనప్పటికీ రచయిత్రి శైలివల్ల, మనుష్యుల జీవితాలను యథాత«థంగా చూపుతుంది. మరణాన్ని మనం ఎంత పట్టించుకోకపోయినా అది పక్కనే తచ్చాడుతుందని చెబుతుంది. కవయిత్రయిన వోగల్ భాష ఆకర్షణీయమైనది. ఒక సంవత్సరపు ఆవేదనను చూపించే 126 పేజీలున్న ఈ పుస్తకాన్ని 2018లోప్రచురించినది మెల్విల్ హౌస్. ‘మయామి బుక్ ఫెయిర్ ప్రైజ్ ఫర్ ద బెస్ట్ నొవెలా’ మొట్టమొదటి అవార్డు గెలుచుకుంది. అమెరికాలో నవలికలను గౌరవించే ఒకే ఒక అవార్డు ఇది. కాలిఫోర్నియాలో పుట్టిన వోగల్– అనువాదకురాలు కూడా. సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీనుండి పీహెచ్డీ చేసి, ప్రస్తుతం పోస్ట్ డాక్టరల్ స్కాలర్‌గా ఉన్నారు. - కృష్ణ వేణి -
మరణించే హక్కు గురించి మాట్లాడే నవల
తన అంతర్జాతీయ కచేరీ పర్యటనకి మూడు వారాల ముందు, ఆత్మహత్యా ప్రయత్నం చేయడంతో, హాస్పిటల్లో చేరిన ఎలిఫ్రిడీ (ఎల్ఫ్)తో నవల ప్రారంభం అవుతుంది. ఆమె ప్రపంచ ప్రసిద్ధి పొందిన పియానిస్ట్. డబ్బున్నది. ప్రేమించే భర్త్ నిక్ ఉంటాడు. కానీ, మానసిక వ్యధతో బాధపడుతూ, మరణించాలన్న ప్రగాఢమైన కోరిక ఉన్న స్త్రీ. చనిపోయేందుకు– కడుపు మాడ్చుకోవడం, నిద్ర మాత్రలు మింగడం, మణికట్టు కోసుకోవడం, బ్లీచ్ తాగడం వంటి ప్రయత్నాల్లో వేటినీ వదలదు. ‘ఎల్ఫ్ చనిపోవాలనుకుంది కానీ తను బతకాలన్నది నాకోరిక. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకునే శత్రువులం’ అన్న చెల్లెలు యోలాండా (యోలీ) జీవితం ఆటుపోట్లకి గురైనది. కథనం ఆమె స్వరంతోనే వినిపిస్తుంది. అక్కను చుట్టుముట్టిన చీకటి గురించి తెలిసిన యోలీని, కారుణ్య మరణం చట్టబద్ధం అయిన స్విస్ క్లినిక్‌కి తనను తీసుకెళ్ళమని ఎల్ఫ్ అడుగుతుంది. తను వొప్పుకున్నా లేకపోయినా కూడా, ఎల్ఫ్ ఆత్మహత్యా ప్రయత్నం ఎప్పుడో అప్పుడు నెరవేరుతుందని గ్రహించిన యోలీ – అక్కకి సహాయపడ్డానికే నిశ్చయించుకుంటుంది. కానీ, బాంక్ ఆమెకి లోన్ ఇవ్వదు. ఎల్ఫ్కూ, నిక్కూ ఉమ్మడి ఖాతా ఉండటం వల్ల ఆ ప్రయాణాన్నిభర్తనుంచి దాయడం ఎల్ఫ్కు కుదరదు. తన పుట్టినరోజు జరుపుకోడానికి ఎల్ఫ్ హాస్పిటల్ నర్సుల అనుమతి తీసుకుని బయటకెళ్ళి, నిక్‌తో పాటు విందు భోజనం చేసి, పుస్తకాలు తెమ్మని అతన్ని లైబ్రరీకి పంపుతుంది. ఎదురుగా వస్తున్న రైలు కింద తల పెట్టేసి, ఆత్మహత్య చేసుకోవడంలో కృతకృత్యురాలవుతుంది. తన జీవిత బీమా డబ్బుని యోలీకి వదిలిపెడుతుంది. ఎల్ఫ్ తండ్రి కూడా ఇదే విధానంలో, 12 సంవత్సరాల కిందట తన మరణాన్ని ఎంచుకుంటాడు. అక్కచెల్లెళ్ళ పల్లెటూరి బాల్య జ్ఞాపకాలని రచయిత్రి స్పష్టంగా, శక్తిమంతంగా వర్ణిస్తారు. కథనం– సానుభూతికీ, పరిహాసానికీ మధ్య ఊగిసలాడుతుంది. మితిమీరిన విషాదం కనిపించక, పదునైన చమత్కారం కనబడుతుంది. కొన్ని చోట్ల నవ్విస్తుంది కూడా. అందుకే నవల విషాదకథల జోన్రాలోకి మాత్రం రాదు. కథాంశం తక్కువా, అస్పష్టమైన కవిత్వం ఎక్కువా ఉన్న ఈ నవల నిజాయితీగా అనిపిస్తుంది. కెనడియన్ రచయిత్రి మిరియమ్ తియస్ దీన్లో కొటేషన్ మార్క్స్ ఉపయోగించరు. అందువల్ల, ఏ పాత్ర మాట్లాడుతోందో, అది పలికిన మాటో, ఆలోచనో అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. నవల ఆఖరున రచయిత్రి డి.హెచ్.లారెన్స్‌ను ఉటంకిస్తారు: ‘ఎన్ని ఆకాశాలు మీద పడ్డా సరే, మనం బతకక తప్పదు.’ ‘జీవితంతో అలిసిపోవడం వల్ల మరణాన్ని ఎంచుకోవడం సహేతుకమైనదేనా! మనం ప్రేమించే వారిపట్ల మనకే బాధ్యత ఉండదా?’ అన్న ఎన్నో ప్రశ్నలని పుస్తకం సంధిస్తుంది. చనిపోయే ఎంపికా, ఆత్మహత్యకు సంబంధించిన అవమానం ఎదురుకోవడం అన్న అంశాలు నవల నేపథ్యానికి ఆయువుపట్టు. బ్రిటనీ మేనార్డ్ మొదలుపెట్టిన ‘మరణించే హక్కు’ ఉద్యమం ఊపందుకున్న తరువాత, ఈ పుస్తకం 2014లో విడుదల అయింది. ఇది రచయిత్రి ఆరవ నవల. తియస్ పుస్తకాలు ఎక్కువగా మానసిక వ్యాధులకి సంబంధించినవే. ఈ స్వీయ చరిత్ర 2014లో ‘రోజర్స్ ట్రస్ట్ ఫిక్షన్’ బహుమతి పొంది,‘స్కాటియా బాంక్గిలర్’బహుమతికి షార్ట్ లిస్ట్ అయింది. తదుపరి రెండేళ్ళలో మరెన్నో బహుమతులు కూడా గెలుచుకుంది. ఆడియో పుస్తకం కూడా ఉంది. కృష్ణ వేణి -
ఉత్తరం వెళ్లే రైలు
కొత్త బంగారం ‘తనకి 16 సంవత్సరాలో, పదిహేడో కోరాకి తెలియదు’ అంటూ కాల్సన్ వైట్‌హౌస్ ప్రారంభించిన ఈ నవల్లో, ప్రధాన పాత్రయిన కోరా– జోర్జా రాష్ట్రపు, రాండాల్ ప్లాంటేషన్‌లో ఉండే మూడవ తరపు(1812) బానిస. బానిసల హింస, ఉరితీతలు, మానభంగాలు సామాన్యం అయిన చోటు అది. కోరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ప్లాంటేషన్ నుండి తప్పించుకు పారిపోయి, పట్టుబడని ఒకే ఒక బానిస–ఆమె తల్లి. కోరా అమ్మమ్మ చరిత్ర కూడా ఉంటుంది నవల్లో. కోరా యజమానిది వక్ర బుద్ధి. కోరా స్వతంత్ర భావాలున్నది. కొత్త బానిస సీసర్ సలహాతో, అతనితోపాటు ఒక రాత్రి పారిపోయి, ఒక తెల్ల ‘స్టేషన్ ఏజెంట్’ సహాయంతో నేలమాళిగ రెయిలెక్కుతుంది. స్వేచ్ఛ వెతుక్కుంటూ పారిపోయే బానిసలకి సహాయపడేందుకు అభివృద్ధి చేయబడిన అండర్‌గ్రౌండ్ రెయిల్ రోడ్ యొక్క అనేకమైన సొరంగాల ద్వారా ప్రయాణిస్తూ– ప్రమాదాలనీ, ప్రతిఘటనలనీ ఎదుర్కుంటుంది. చదువూ,స్వేచ్ఛా గురించిన తన కలలను నిజం చేసుకునేటందుకు వాటన్నిటినీ తట్టుకుంటూ, అణిచివేత గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలున్న దక్షిణ రాష్ట్రాలనుంచి ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తుంది. ఆ ప్రక్రియలో, ఒక తెల్ల వ్యక్తిని చంపవలిసి వస్తుంది. కోరా పరుగు మీద నుంచి దృష్టి మళ్ళించకుండానే రచయిత అనేకమైన ఇతర పాత్రలనీ, వారి దృష్టి కోణాలనీ, అంతర్గత జీవితాలనీ కనపరుస్తారు. ‘తనకీ ప్లాంటేషన్కీ మధ్యనున్న ప్రతీ మైలూ ఒక విజయమే’ అనుకున్న కోరా ఏ చోటూ భద్రమైనది కాదని గ్రహిస్తుంది. తను అడుగు పెట్టిన ప్రతీ రాష్ట్రంనుంచీ నేర్చుకుంటూ– మానసికంగా, తాత్వికంగా ఎదుగుతుంది. సౌత్ కారొలీనా వెళ్ళినప్పుడు కొత్త పేర్లూ, కొత్త గుర్తింపూ ఉన్న నూతన జీవితాలు మొదలెడతారు కోరా, సీసర్. అక్కడే సీసర్ హత్య జరుగుతుంది. పారిపోయిన బానిసలని తిరిగి తెచ్చే రిజ్వే గతంలో కోరా తల్లిని వెతకడంలో విఫలుడైన వ్యక్తి. అతనిప్పుడు కోరాని వెంబడిస్తాడు. మొదటిసారి ఆమె తప్పించుకుంటుంది. రెండోసారి అతన్ని రెయిలు మెట్లమీద నుంచి తోసి, గాయపరిచి– పట్టాలమీదగా పారిపోయి, నేలమాళిగ నుండి బయటకి వచ్చి– పశ్చిమదిక్కుగా ప్రయాణిస్తున్న బిడారుతో కలిపి వెళ్ళిపోతుంది. పారిపోయే వారికి సహాయం చేసేవారిని ‘కండక్టర్స్’ అనీ, బానిసలని ‘కార్గో’ అనీ పిలుస్తారు. ఈ నవల చారిత్రాత్మక వాస్తవికత యొక్క కాల్పనిక వృత్తాంతం. ఆనాటి రెయిలు వ్యవస్థకి ఆధునిక సౌకర్యాలని కలిపిస్తారు వైట్‌హౌస్. బానిసల మనస్తత్వాలని సూక్ష్మంగా వ్యక్తీకరిస్తారు. నిషేధించబడిన ‘నీగ్రో, నిగ్గర్’ అన్న మాటలని రచయిత వాడతారు. రచయిత మాటల్లో: ‘మనం గతాన్ని నిర్లక్ష్యపెట్టలేం. భయం సృష్టించడంతో గతాన్ని పునరావృతం చేయలేం. వర్తమానాన్ని గుర్తిస్తూ, గతంతో పాటు జీవించక తప్పదు... సమస్యకి పరిష్కారం ఉండే వీలు లేదు కనుక కథకీ పరిష్కారం లేదు. అమెరికాలో నల్లవారిగా ఉండటం అనేది ఏ విధమైన ముగింపుకీ చేరలేదు.’ రాయడానికి రచయితకి 16 సంవత్సరాలు పట్టిన ఈ నవలని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, టీవీ ప్రయోక్త ఓప్రా విన్ఫ్రే చదివారు. ఇది వైట్‌హౌస్ ఆరవ నవల. మాజికల్ రియలిజం పద్ధతిలో ఉండి, ప్రథమ పురుష స్వరంతో కొనసాగుతుంది. 2016లో అచ్చయి, అదే యేడు ‘నేషనల్ బుక్ అవార్డ్ ఆఫ్ ఫిక్షన్’ పొందింది. 2017లో పులిట్జర్ అవార్డు గెలుచుకుంది. ఆడియో పుస్తకం కూడా ఉంది. - కృష్ణవేణి -
వృద్ధాశ్రమ నిర్వాహకురాలి ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు
భారీగా లావాదేవీలు, నగదు ఉందన్న అనుమానంతో సోదాలు? అనంతపురం జిల్లాలో ఘటన యాడికి: ఓ వృద్ధాశ్రమ నిర్వాహకురాలి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ) అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువులోని ‘లీలావతి వృద్ధాశ్రమం’ నిర్వాహకురాలు కృష్ణవేణి ఇల్లు, ఆశ్రమంలో గురువారం బెంగళూరు నుంచి వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. బ్యాంకు అకౌంట్ నుంచి కృష్ణవేణి ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరగడంతో పాటు, ఆమె ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఉన్న సమాచారంతో అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. సుమారు గంటసేపు తనిఖీలు చేసిన అధికారులు.. వృద్ధాశ్రమానికి వచ్చిన నిధులు తదితరాలపై నిర్వాహకురాలిని ప్రశ్నించారు. గతంలో తనపై ఉన్న కేసులకు సంబంధించిన విషయాలను కృష్ణవేణిని అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం కూడా ఐటీ అధికారులు వస్తారనీ, వారికి సహకరించాలని ఆమెకు చెప్పి వెళ్లిపోయారు. కృష్ణవేణి ఇంటిని పోలీసులు దిగ్బంధించడంతో పూర్తి వివరాలు తెలియలేదు. మీడియా అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేదు. గతంలోనూ కృష్ణవేణిపై కేసులు ‘తేజ విమెన్ ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ’ని స్థాపించి దాని ఆధ్వర్యంలో లీలావతి వృద్ధాశ్రమం నడుపుతున్న కృష్ణవేణిపై ఇదివరకే రెండు కేసులు నమోదై ఉన్నాయి. కోల్‌కత్తలోని ఓ వ్యక్తిని మోసం చేసి అతని అకౌంట్ నుంచి వృద్ధాశ్రమ అకౌంట్లోకి రూ. 12 లక్షలు వేయించుకుందన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అలాగే తనను కృష్ణవేణి మోసం చేసి రూ. 2.35 కోట్లను తన ఖాతాలో వేసుకుందని ఢిల్లీకి చెందన సంజయ్ కొఠారీ అనే వ్యక్తి 2014 నవంబర్ 17న తాడిపత్రి డీఎస్పీకి ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. -
మైనర్ బాలిక అనుమానాస్పద మృతి
-
మైనర్ బాలిక అనుమానాస్పద మృతి
మైనర్ బాలక అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం వెలుగుచూసింది. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న బాలిక అనుమానాస్పద స్థితిలో కాలి బూడిదైంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నల్లగొండ జిల్లా నారాయణపురం మండలం కోతలపురం గ్రామానికి చెందిన సిరిరెండ్ల కృష్ణవేణి(17) తల్లి తండ్రులతో పాటు పరకాల మండలానికి వలస వచ్చి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ రోజు సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో కాలి బూడిదైంది. దీంతో ఆత్మహత్య చేసుకుందా.. లేక ఎవరైనా కిరోసిన్ పోసి నిప్పంటించారా.. అని అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీకాకుళంలో చైన్ స్నాచింగ్
శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి సమీపంలో విధి నిర్వహణలో ఉన్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణవేణి మెడలోంచి బంగారు చైన్‌ను దుండ గుడు లాక్కెళ్లాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. కృష్ణవేణి పీల్డ్ నుంచి ఇంటికి సైకిల్‌పై వెళుతుండగా మోటార్‌బైక్‌పై వచ్చిన దుండగుడు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ విషయమై ఆమె సరిబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మహిళపై కత్తితో దాడి
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : చిన్నపిల్లాడితో వచ్చిన వివాదం ముదిరి హత్యాయత్నానికి దారి తీసింది. క్షణికావేశంతో జరిగిన ఈ ఘటన ఒక వ్యక్తిని జైలుపాల్జేసింది. మరో మహిళ ఆస్పత్రి పాలైంది. ఈ ఘటనకు సంబంధించి ఎస్.కోట పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న వానపల్లి దేవి ఇంటికి పొరుగున ఒక ఇల్లు తనఖాకు తీసుకుని ఏడాదిగా పట్నాల శ్రీనివాస్, కృష్ణవేణి దంపతులు ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. శ్రీనివాస్ విశాఖ రైల్వేలో కాంట్రాక్ట్ కూలీగా పనిచేస్తున్నాడు. కృష్ణవేణి బ్యూటీషియన్ శిక్షణ తీసుకుంటోంది. బుధవారం తనను వానపల్లి రవి, అతని తల్లి వానపల్లి దేవిలు కొట్టి, అవమానించారని కృష్ణవేణి ఫోన్లో భర్త శ్రీనివాస్‌కు సమాచారం అందించింది. దీంతో సాయంత్రం 5.30 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నాడు. వేటకత్తి తీసుకుని వానపల్లి దేవి కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. దీంతో వానపల్లి దేవికి వీపుపైన, ఎడమ చేతిపైన గాయూలయ్యూరుు. ఈ దాడిలో రాజేశ్వరి అనే మహిళ త్రుటిలో తప్పించుకుంది. శ్రీనివాస్ అక్కడితో ఆగకుండా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ బయటకు తెచ్చాడు. గ్యాస్ లీక్ చేసి, దానిపై పెట్రోల్ పోసి ఎవరైనా వస్తే నిప్పు పెడతానంటూ కత్తి చేత పట్టుకుని వీధిలో పరుగులు తీసి వీరంగం చేశాడు. దీంతో వీధిలో జనం ఇళ్లలో దూరి తలుపులు మూసుకున్నారు. శ్రీనివాస్ భార్య కృష్ణవేణి కూడా శరీరంపై పెట్రోల్ పోసుకుని తనకు న్యాయం చేయాలని, లేకుంటే నిప్పు పెట్టుకుంటానంటూ హల్చల్ చేసింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై సాగర్‌బాబు, పీసీలు విజయ్, ప్రతాప్ శ్రీనివాసకాలనీకి చేరుకున్నారు. పోలీసులను చూసినా వారిద్దరూ శాంతించలేదు. అతి కష్టంమీద వారి వద్ద ఉన్న కత్తి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలను స్టేషన్‌కు తరలించారు. దాడిలో గాయపడిన దేవిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బట్టలూడదూసి అవమానించారు... ఈ ఘటనపై పట్నాల కృష్ణవేణి మాట్లాడుతూ.. తన కొడుకు సతీష్‌కుమార్‌ను వానపల్లి రవి గుట్కా తెమ్మని చెప్పాడని తెలిపింది. సతీష్ నిరాకరించడంతో రవి తీవ్రంగా కొట్టాడని చెప్పింది. దీనిపై తాను వెళ్లి రవి కుటుంబ సభ్యులను నిలదీశానని, దీంతో నాచేయి వెనక్కి విరిచి, దాడికి పాల్పడ్డారని తెలిపింది. ఇంతలో అతని తల్లి దేవి వచ్చి కొబ్బరిమట్టతో తనను తీవ్రంగా కొట్టిందని పేర్కొంది. తాను ఇంటికి పారిపోయి భర్తకు ఫోన్ చేశానని, అదే సమయంలో వానపల్లి దేవి వీధిలోని పది మందికి పైగా స్థానికులను తీసుకొచ్చి, తన దుస్తులు ఊడదీసి అవమానం చేశారని వాపోరుుంది. హత్యకు యత్నించారు.. దాడిలో గాయపడిన దేవి మాట్లాడుతూ.. తన కుమారుడు రవిపై కృష్ణవేణి చేరుు చేసుకుందని, అందుకే ఆమెను మందలించానని తెలిపింది. ఈలోగా ఆమె భర్త వచ్చి కత్తితో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
అడవి మాదే..మేడారం మాదే...
=హక్కుల కోసం ఆదివాసీల పోరుబాట =ఆలయూనికి రంగులద్దే పనిని స్థానికేతరులకు అప్పగించడంపై ఆగ్రహం =దేవాదాయ శాఖ కార్యాలయ సామగ్రి ధ్వంసం.. ధర్నా =మేడారంలో వేడెక్కిన వాతావరణం మేడారం (తాడ్వాయి), న్యూస్‌లైన్: మేడారం జాతరపై అడగకుండానే హ క్కులు కల్పించాల్సి ఉన్నప్పటికీ హక్కుల కో సం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఆది వా సీ గిరిజనులకు తలె త్తుతోంది. ప్రతీ రెండేళ్ల కోమారు జరిగే జాతరలో పూజారులకు దక్కే ఆదాయ వనరులను లాక్కొని బడా వ్యాపారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయాలను ముందుకు తీసుకొస్తోంది. ఆఖరికి ఆలయానికి రంగులేసే పనిని సైతం స్థానికేతరులకే కేటాయిస్తూ గిరిజన యువతపై వివక్ష చూపిస్తోంది. దానితో గిరిజన యువతలో ఆగ్రహాం పెల్లుబుకుతోంది. జాతర పనులు పరిశీలించేందుకు దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి మంగళవారం మేడారం వచ్చారు. తమకు తమకు జరుగుతున్న అన్యాయాన్ని, తమ సంస్కృతి పట్ల కొనసాగుతున్న వివక్షను గిరిజనులు జాయింట్ కమిషనర్‌కు ఎకరువు పెట్టారు. రంగు పడింది మేడారం జాతర సందర్భంగా వంద కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను ప్ర భుత్వం చేపడుతోంది. సమ్మక్క-సారలమ్మ గద్దెలు, పరిసర ప్రాంతాల్లో రంగులేసే పనికి రూ.16 లక్షలు మంజూరయ్యాయి. పెద్ద పనులను టెండర్ల ప్రక్రియ ద్వారా బడా కాంట్రాక్టర్లకు కేటాయించింది. ఈ పనిని ఒక శాతం ఎక్సెస్‌తో టెండర్ వేసిన కాంట్రాక్టర్‌కు అధికారులు కట్టబెట్టారు. తమ ప్రాంతంలో జరిగే గిరిజన జాతరలో తమ ప్రమేయం లేకుండా ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం పను లు చేపడుతుండ డం పట్ల గిరిజనులు ఆందోళన చెందారు. తమకు కనీస ఉపాధి కూడా చూపించకపోవడంతో వారిలో ఆగ్రహాం వ్యక్తమయింది. దాంతో వారు మంగళవారం దే వాదాయ శాఖ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. స్థానిక ఆదివాసీల పట్ల దేవదాయశాఖ అధికారుల తీరును నిరసిస్తూ యువకులు, పూజారులు గద్దెల ఎదుట ధర్నా కు దిగారు. పనులు పరిశీలించేందుకు వెళ్లిన దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి దృష్టికి ఏసీ రాజేశ్వర్‌రావు ఫో న్లో యువకుల ధర్నా విషయాన్ని తెలిపా రు. వెంటనే ఆమె ధర్నా చేస్తున్న యువకుల వద్దకు వెళ్లి వారిసమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలరింగ్ పనులు పొందిన కాంట్రాక్ట ర్ టెండర్‌ను రద్దుచేసి, ఆ పనులను ఆది వా సీ యువకులకే ఇస్తామని హామీ ఇవ్వడంతో యువకులు ధర్నా విరమించుకున్నారు. వివాదాస్పదంగా మారిన తలనీలాలు జారత సందర్భంగా భక్తులు చెల్లించే తలనీ లాలను సేకరించి అమ్ముకునే పనిని ఇప్పటి వరకు నామినేషన్ పద్ధతిపై పూజారుల సంఘానికే కేటాయిస్తున్నారు. గత ఏడాది 80 లక్షల మంది జాతరకు వస్తారనే అంచనాతో పూజారుల సంఘం రూ 42 లక్షలు దేవాదా య శాఖకు చెల్లించి ఈ పనిని దక్కించుకుంది. ఈ సారి కోటి మంది భక్తులు వస్తారనే అంచానాతో గరిష్టంగా రూ 75 లక్షలు చె ల్లించేందుకు గిరిజన పూజారుల సంఘం సిద్ధమైంది. నామినేషన్ పద్దతిపై కాకుండా టెండర్లను ఆహ్వానించడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందనే లక్ష్యంతో దేవాదాయశాఖ ప్రణాళిక రూపొందించడాన్ని పూజారు ల సంఘం వ్యతిరేకిస్తోంది. అయితే టెండర్ల పద్దతిని ప్రవేశపెడితే కాంట్రాక్టర్లంతా రింగైతే తమకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందని పూజారుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది.