అడవి మాదే..మేడారం మాదే...
=హక్కుల కోసం ఆదివాసీల పోరుబాట
=ఆలయూనికి రంగులద్దే పనిని స్థానికేతరులకు అప్పగించడంపై ఆగ్రహం
=దేవాదాయ శాఖ కార్యాలయ సామగ్రి ధ్వంసం.. ధర్నా
=మేడారంలో వేడెక్కిన వాతావరణం
మేడారం (తాడ్వాయి), న్యూస్‌లైన్: మేడారం జాతరపై అడగకుండానే హ క్కులు కల్పించాల్సి ఉన్నప్పటికీ హక్కుల కో సం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఆది వా సీ గిరిజనులకు తలె త్తుతోంది. ప్రతీ రెండేళ్ల కోమారు జరిగే జాతరలో పూజారులకు దక్కే ఆదాయ వనరులను లాక్కొని బడా వ్యాపారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కొత్త నిర్ణయాలను ముందుకు తీసుకొస్తోంది. ఆఖరికి ఆలయానికి రంగులేసే పనిని సైతం స్థానికేతరులకే కేటాయిస్తూ గిరిజన యువతపై వివక్ష చూపిస్తోంది. దానితో గిరిజన యువతలో ఆగ్రహాం పెల్లుబుకుతోంది. జాతర పనులు పరిశీలించేందుకు దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి మంగళవారం మేడారం వచ్చారు. తమకు తమకు జరుగుతున్న అన్యాయాన్ని, తమ సంస్కృతి పట్ల కొనసాగుతున్న వివక్షను గిరిజనులు జాయింట్ కమిషనర్‌కు ఎకరువు పెట్టారు.
రంగు పడింది
మేడారం జాతర సందర్భంగా వంద కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను ప్ర భుత్వం చేపడుతోంది. సమ్మక్క-సారలమ్మ గద్దెలు, పరిసర ప్రాంతాల్లో రంగులేసే పనికి రూ.16 లక్షలు మంజూరయ్యాయి. పెద్ద పనులను టెండర్ల ప్రక్రియ ద్వారా బడా కాంట్రాక్టర్లకు కేటాయించింది. ఈ పనిని ఒక శాతం ఎక్సెస్‌తో టెండర్ వేసిన కాంట్రాక్టర్‌కు అధికారులు కట్టబెట్టారు. తమ ప్రాంతంలో జరిగే గిరిజన జాతరలో తమ ప్రమేయం లేకుండా ఆదాయమే పరమావధిగా ప్రభుత్వం పను లు చేపడుతుండ డం పట్ల గిరిజనులు ఆందోళన చెందారు. తమకు కనీస ఉపాధి కూడా చూపించకపోవడంతో వారిలో ఆగ్రహాం వ్యక్తమయింది. దాంతో వారు మంగళవారం దే వాదాయ శాఖ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. స్థానిక ఆదివాసీల పట్ల దేవదాయశాఖ అధికారుల తీరును నిరసిస్తూ యువకులు, పూజారులు గద్దెల ఎదుట ధర్నా కు దిగారు.
పనులు పరిశీలించేందుకు వెళ్లిన దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి దృష్టికి ఏసీ రాజేశ్వర్‌రావు ఫో న్‌లో యువకుల ధర్నా విషయాన్ని తెలిపా రు. వెంటనే ఆమె ధర్నా చేస్తున్న యువకుల వద్దకు వెళ్లి వారిసమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలరింగ్ పనులు పొందిన కాంట్రాక్ట ర్ టెండర్‌ను రద్దుచేసి, ఆ పనులను ఆది వా సీ యువకులకే ఇస్తామని హామీ ఇవ్వడంతో యువకులు ధర్నా విరమించుకున్నారు.
వివాదాస్పదంగా మారిన తలనీలాలు
జారత సందర్భంగా భక్తులు చెల్లించే తలనీ లాలను సేకరించి అమ్ముకునే పనిని ఇప్పటి వరకు నామినేషన్ పద్ధతిపై పూజారుల సంఘానికే కేటాయిస్తున్నారు. గత ఏడాది 80 లక్షల మంది జాతరకు వస్తారనే అంచనాతో పూజారుల సంఘం రూ 42 లక్షలు దేవాదా య శాఖకు చెల్లించి ఈ పనిని దక్కించుకుంది. ఈ సారి కోటి మంది భక్తులు వస్తారనే అంచానాతో గరిష్టంగా రూ 75 లక్షలు చె ల్లించేందుకు గిరిజన పూజారుల సంఘం సిద్ధమైంది. నామినేషన్ పద్దతిపై కాకుండా టెండర్లను ఆహ్వానించడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందనే లక్ష్యంతో దేవాదాయశాఖ ప్రణాళిక రూపొందించడాన్ని పూజారు ల సంఘం వ్యతిరేకిస్తోంది. అయితే టెండర్ల పద్దతిని ప్రవేశపెడితే కాంట్రాక్టర్లంతా రింగైతే తమకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందని పూజారుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది.